చిన్నగంజాం వద్ద రోడ్డుప్రమాదం | 2 died and 7 injured in Road accident | Sakshi
Sakshi News home page

చిన్నగంజాం వద్ద రోడ్డుప్రమాదం

Apr 19 2016 3:40 PM | Updated on Apr 3 2019 7:53 PM

చిన్నగంజాం మండలం కడవకుదురు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడవకుదురు నుంచి చీరాల వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

చిన్నగంజాం (ప్రకాశం జిల్లా) : చిన్నగంజాం మండలం కడవకుదురు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడవకుదురు నుంచి చీరాల వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు మొత్తం 9 మంది ఉండగా... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఏడుగురికి గాయలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement