ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ట్రాక్టర్..ఒకరి మృతి | 1died, 2 injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ట్రాక్టర్..ఒకరి మృతి

May 2 2015 9:05 AM | Updated on Apr 3 2019 7:53 PM

కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.

మొవ్వ : కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మొవ్వ మండలానికి చెందిన కొందరు గుంటూరులో జరుగుతున్న తాతావారి సంబరాలకు ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యార్లగడ్డ సుశీల(50) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్తానిక ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన మహిళ స్వగ్రామం కృష్ణాపురం శివారు గౌడపేట గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement