breaking news
suseela
-
యువతిని అశ్లీలంగా చిత్రీకరించి...
ఆచంట: భర్త చెడుమార్గంలో నడిస్తే సరిద్దాల్సిన భార్యే అతడికి వంతపాడింది. ఓ యువతిని అశ్లీలంగా చిత్రీకరించి.. కామ వాంఛలు తీర్చుకునేందుకు సహకరించింది. అంతేకాకుండా వ్యభిచారం చేయాలని ఆ యువతిపై ఆ భార్యాభర్తలిద్దరూ ఒత్తిడి తెచ్చారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో గురువారం వెలుగు చూసింది. పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. ఆచంట పంచాయతీ పరిధి కొత్తూరు ప్రాంతానికి చెందిన నెక్కంటి శ్రీనివాస్, సుశీల భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన, డిగ్రీ చదువుతున్న ఓ యువతి తరచూ వారి ఇంటికి వస్తుండేది. గతేడాది మే 1న సాయంత్రం ఆ యువతి శ్రీను ఇంటికి వెళ్లింది. శ్రీను దంపతులు పథకం ప్రకారం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతితో భర్త అశ్లీలంగా వ్యవహరించిన తీరును స్వయంగా భార్యే సెల్ఫోన్లో చిత్రీకరించింది. అప్పటినుంచి వారిద్దరూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న ట్రాక్టర్..ఒకరి మృతి
మొవ్వ : కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్ఫార్మర్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మొవ్వ మండలానికి చెందిన కొందరు గుంటూరులో జరుగుతున్న తాతావారి సంబరాలకు ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యార్లగడ్డ సుశీల(50) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్తానిక ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన మహిళ స్వగ్రామం కృష్ణాపురం శివారు గౌడపేట గా గుర్తించారు.