ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని అక్టోబర్ 17 నుంచి 25 వరకు కర్నూలులో నిర్వహించనున్నారు.
కల్లూరు రూరల్(కర్నూలు), న్యూస్‌లైన్: ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని అక్టోబర్ 17 నుంచి 25 వరకు కర్నూలులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్) ఆర్మీ రిక్రూట్‌మెంట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎస్.బి.సజ్జన్ సోమవారం కర్నూలు ఔట్‌డోర్ స్టేడియాన్ని పరిశీలించారు.
అంతకు ముందే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీపై అభ్యర్థులకు అవగాహన సదస్సు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రిక్రూట్‌మెంట్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు (ఏడు) జిల్లాల ఆర్మీ రిక్రూట్‌మెంట్ డెరైక్టర్ జాఫ్రితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆర్మీకి సంబంధించిన వివిధ ట్రేడ్‌ల ఎంపిక ప్రక్రియ ఇక్కడి ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థి అర్హతలు, సామర్థ్యం బట్టి ఎంపిక ఉంటుందని, డబ్బులిచ్చి ఉద్యోగాలిప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని సూచించారు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సెట్కూరు సీఈఓ పి.వి.రమణ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నా రు. ఉద్యోగార్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలకు ఠీఠీఠీ.జీఛి.జీ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.