జావా.. నాటి హవా !

16th International Jawa Bike Day - Sakshi

 నేడు 16వ ఇంటర్నేషనల్‌ జావా బైక్‌ డే

బెజవాడ బీటింగ్‌ హార్ట్స్‌  జావా క్లబ్‌ ఆధ్వర్యంలో

నేడు జావా బైక్‌ రైడింగ్‌ ర్యాలీ

విజయవాడ స్పోర్ట్స్‌: ఒకప్పుడు పెద్దవాళ్లు ఆఫీషియల్‌గా వాడే బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అయితే... 1987కు ముందువరకు కుర్రకారు బైక్‌ ఏదంటే జావా మోటార్‌ సైకిలే. 1929లో చెకోస్లేవియాలో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. రోడ్డుపైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ సింహం అయితే...జవా మోటార్‌ సైకిల్‌ పులి అనేవాళ్లు. ఇప్పటికీ దీనికున్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. బీటింగ్‌కు మారుపేరు జావానే. టుస్ట్రోక్‌ ఇంజిన్‌ ఇది.

 350 సీసీ, 250 సీసీ బైక్‌లు ఉన్నాయి. బండి స్టార్ట్‌ చేయడానికి కిక్‌ రాడ్డే గేర్‌ రాడ్‌ ఉన్న బైక్‌ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక్క జావా బైక్‌ మాత్రమే. పూర్తిగా ఎగ్‌ షేప్‌గా ఏ ఒక్క పార్టు బయటకు కనిపించకుండా ఉండే బైక్‌ జావా బైక్‌. ఇప్పటికీ రోడ్డుపై ఎన్ని వందల బైక్‌లు వెళ్లినా...ఒక జావా బైక్‌  చాలు తన ఉనికిని చాటుకోవడానికి. పాత సినిమాల్లో హీరోలు వాడిన బైక్‌ ఇది. 1980 తరువాత జావా బైక్‌ని కొంతమార్పులు చేసి యజ్డీ బైక్‌గా పేరు మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు పైగా ఈ బైక్‌ ఏలింది. పాత బులెట్‌ మాదిరిగానే ఎన్ని సంవత్సరాలు బండి అయినా సరే మళ్లీ దానిని కొత్త బైక్‌గా తయారు చేసుకునే వీలున్న బైక్‌ ఇది. బండి ఎంత పాతదయితే అంత క్రేజ్‌ ఉంది. 

దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు
దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 8న ఇంటర్నేషనల్‌ ‘జావా డే’ ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జవా క్లబ్‌లు వరల్డ్‌ జావా డేని నిర్వహిస్తున్నాయి. విజయవాడలో కూడా ‘బీటింగ్‌ హార్ట్స్‌ జావా’ క్లబ్‌ ఉంది. ఆ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 ఎనిమిది గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి క్లబ్‌ సభ్యులంతా తమ బైక్‌లపై రైడ్‌ చేయనున్నారు. జావా బైక్‌ల బీటింగ్‌తో కనులవిందు చేయనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top