విశాఖలోని అనంతగిరిలో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.
విశాఖ: విశాఖలోని అనంతగిరిలో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు 150 కేజీల గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని అక్రమంగా తరిలిస్తున్న ఒకరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.