ఆర్‌టీసీకి రూ.15 లక్షల నష్టం | 15 lakh loss on rtc | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీకి రూ.15 లక్షల నష్టం

Oct 15 2014 1:31 AM | Updated on Sep 2 2017 2:50 PM

ఆర్‌టీసీకి రూ.15 లక్షల నష్టం

ఆర్‌టీసీకి రూ.15 లక్షల నష్టం

ఆర్‌టీసీ నెక్ రీజియన్ పరిధిలో జిల్లాలోని నాలుగు డిపోలకు తుపాను వల్ల సుమారు రూ. 15 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా డిపోల

 విజయనగరం అర్బన్ :      ఆర్‌టీసీ నెక్ రీజియన్ పరిధిలో జిల్లాలోని నాలుగు డిపోలకు తుపాను వల్ల సుమారు రూ. 15 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా డిపోల పరిధిలోని చెట్లు కూలడంతో ప్రహరీలు, గ్యారేజీ పరిస రాల్లోని సామగ్రి పాడైంది. విజయనగరం డిపో గ్యారీ జీలో 60 అడుగుల ప్రహరీ, పార్వతీపురంలో 70 అడుగుల ప్రహరీ, సాలూరు లో 40 అడుగుల గోడ, అలాగే ఎస్. కోట డిపో లో కూడా ప్రహరీపై చెట్లు కూలడంతో నష్టం సంభవించినట్టు నెక్ రీజియన్ అధికా  రులు చెప్పారు. ఇవికాకుండా జోనల్ వర్స్ షాపు, రీజియన్ కార్యాలయం ఆవరణలోని కూలిన చెట్ల వల్ల మరో రూ. 5 లక్షల మేరకు నష్టం జరిగింది.
 ఆర్‌టీసీ సర్వీసులు పునరుద్ధరణ
 
 తుపాను నేపథ్యంలో జిల్లాలోని డిపోలలో ఆర్‌టీసీ స ర్సీసులను రెండు రోజులుగా నడపలేదు. మంగళవా రం నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడంతో మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.పార్వతీపురం రూ ట్లలో మినహా విశాఖ, శ్రీకాకుళం, రాజాం, ఎస్. కోట, అనకాపల్లి ప్రాంతాలకు ఎప్పటి మాదిరిగానే సర్వీసులన్నింటినీ నిర్వహించారు.
       జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల సెలవు ప్రకటించిన నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన హాస్టల్ విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని కాంప్లెక్స్ కిట కిటలాడింది.
 
 సెల్ చార్జింగ్‌కి డిమాండ్
 కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ చార్జింగ్ పా యింట్లు రద్దీగా కనిపించారుు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విద్యుత్ పంపిణీ నిలిచిపోవడంతో సెల్‌ఫోన్‌ల వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ప్ర ధానంగా ప్రయాణికులకు సమాచార వ్యవస్థ దూరమైంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం డిపో మేనేజర్ పద్మావతి, స్టేషన్ మాస్టర్ రమేష్ స్థానిక కాం ప్లెక్స్ ఆవరణలో సెల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ ఆవరణలో విద్యుత్ సౌకర్యం లేకపోయినప్పటికీ ప్రయాణికులకు అందుబాటులో సేవలందించాలన్న ఉద్ధేశంతో భారీ జనరేటర్ ఏర్పాటు చేసి, మూడు సెల్ పారుుంట్ల ద్వారా ప్రయూణికులకు సేవ లందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement