breaking news
Neck Region
-
ఆర్టీసీకి రూ.15 లక్షల నష్టం
విజయనగరం అర్బన్ : ఆర్టీసీ నెక్ రీజియన్ పరిధిలో జిల్లాలోని నాలుగు డిపోలకు తుపాను వల్ల సుమారు రూ. 15 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా డిపోల పరిధిలోని చెట్లు కూలడంతో ప్రహరీలు, గ్యారేజీ పరిస రాల్లోని సామగ్రి పాడైంది. విజయనగరం డిపో గ్యారీ జీలో 60 అడుగుల ప్రహరీ, పార్వతీపురంలో 70 అడుగుల ప్రహరీ, సాలూరు లో 40 అడుగుల గోడ, అలాగే ఎస్. కోట డిపో లో కూడా ప్రహరీపై చెట్లు కూలడంతో నష్టం సంభవించినట్టు నెక్ రీజియన్ అధికా రులు చెప్పారు. ఇవికాకుండా జోనల్ వర్స్ షాపు, రీజియన్ కార్యాలయం ఆవరణలోని కూలిన చెట్ల వల్ల మరో రూ. 5 లక్షల మేరకు నష్టం జరిగింది. ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరణ తుపాను నేపథ్యంలో జిల్లాలోని డిపోలలో ఆర్టీసీ స ర్సీసులను రెండు రోజులుగా నడపలేదు. మంగళవా రం నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడంతో మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.పార్వతీపురం రూ ట్లలో మినహా విశాఖ, శ్రీకాకుళం, రాజాం, ఎస్. కోట, అనకాపల్లి ప్రాంతాలకు ఎప్పటి మాదిరిగానే సర్వీసులన్నింటినీ నిర్వహించారు. జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల సెలవు ప్రకటించిన నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన హాస్టల్ విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని కాంప్లెక్స్ కిట కిటలాడింది. సెల్ చార్జింగ్‌కి డిమాండ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ చార్జింగ్ పా యింట్లు రద్దీగా కనిపించారుు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విద్యుత్ పంపిణీ నిలిచిపోవడంతో సెల్ఫోన్ల వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ప్ర ధానంగా ప్రయాణికులకు సమాచార వ్యవస్థ దూరమైంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం డిపో మేనేజర్ పద్మావతి, స్టేషన్ మాస్టర్ రమేష్ స్థానిక కాం ప్లెక్స్ ఆవరణలో సెల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ ఆవరణలో విద్యుత్ సౌకర్యం లేకపోయినప్పటికీ ప్రయాణికులకు అందుబాటులో సేవలందించాలన్న ఉద్ధేశంతో భారీ జనరేటర్ ఏర్పాటు చేసి, మూడు సెల్ పారుుంట్ల ద్వారా ప్రయూణికులకు సేవ లందించారు. -
పీకల్లోతు నష్టాల్లో నెక్
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోన్ పరిధిలోని నార్త్ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందం గా తయారైంది. ప్రతీనెలా డీజిల్ ధర పెంపు విధానం, ప్రైవేటు వాహనాల జోరు వంటి పలు అంశాలు ఆయా డిపోలను పూర్తిగా నష్టాల ఊబిలోకి నెడుతున్నాయి. అదే విధం గా సర్వీసుల్లో సమయపాలన పాటించకపోవ డం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సుల ను తీసుకోవడం, నిర్వహ ణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. నెక్ రీజియన్‌లో మొత్తం తొమ్మిది డిపోలకు కలిపి రోజుకు రూ. 49.45 లక్షల మేర నష్టం వస్తోంది. మరోవైపు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నష్టాలకు సవాలక్ష కారణాలు... నెక్ రీజియన్ పరిధిలోని విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్‌కోట, సాలూరు, పార్వతీపురం డిపోలు, శ్రీకాకుళం జిల్లాలో ని శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, పలాస, టెక్కలి డిపోలున్నాయి. ఈ డిపోల్లో 839 సర్వీసుల్లో 908 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 213 అద్దెబస్సులున్నాయి. మిగిలిన సర్వీసులన్నింటిలో సంస్థ సొంత బస్సులు నడుస్తున్నాయి. అన్ని డిపోల్లో ఆ యా కేటగిరీల్లో మొత్తం 4,411 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు రోజుకు 6.65 లక్షల మంది కి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నా రు. రీజయన్‌లోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజు కు 2.75 లక్షల కిలోమీటర్లమేర తిరుగుతున్నాయి. కనీసం 5 కిలోమీటర్లకు ఒక లీటరు చొప్పున తీసుకున్నా రోజుకు సుమారు 55 వేల లీటర్ల డీజిల్ విని యోగమవుతోంది. తాజాగా ఉన్న లీటరుకు రూ.60 ధర వేసుకున్నా డీజిల్ కొనుగోలు కోసం రోజుకు సుమారు రూ.33 కోట్ల వరకూ వెచ్చించాలి. రోజులో నిర్వహించిన సర్వీసులల్లో కిలోమీటరుకు దాదాపు రూ. 33 ఆదాయం రావాల్సి ఉండగా,కేవలం రూ.21 లు మాత్రమే వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ కంపెనీతో జరుపుకొన్న ఒప్పం దం మేరకు ప్రతి నెల లీటరుకు 60 పైసల ధర పెం చాల్సి ఉంది. ఈ రూపంలో నెలదాటిన ప్రతిసారీ డీజిల్ పెరగడం మూలంగా ఏడాదికి సుమారు మూ డు లక్షల రూపాయలు అధనపు భారం పడుతోంది. మరోవైపు ప్రైవేటు వాహనాల జోరు ఆర్టీసీకి మరిం త ఇబ్బందిగా మారింది. దీంతో నెక్ పరిధిలో రోజు కు సరాసరిన రూ.49.65 లక్షలమేరకు నష్టం వస్తోంది. ప్రైవేటు వాహనాల జోరు నెక్ పరిధిలోని రెండు జిల్లాలో ఏప్రిల్ నెలఖరు లెక్క ల మేరకు ప్రైవేటు వాహనాలు 10,077 వరకు ఉన్నా యి. వీటిలో డీలక్స్ సర్వీసులపై ప్రభావం చూపే హైదరాబాద్, విజయవాడ వంటి దూరప్రాంతాల రాకపోకలు సాగించే బస్సులు 10 వరకు మాత్రమే ఉ న్నాయి. కానీ పల్లెవెలుగు బస్సులపై రూట్లలో తిరిగే మాక్సీ క్యాబ్స్, జీపులు 2,260 వరకు ఉన్నాయి. అదే విధంగా ఆటోలు అత్యధికంగా 7,809 వరకు ఉన్నా యి. ప్రైవేటు వాహనాలు డిపోలు, బస్టాండ్ల ముం దుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అకారణంగా బస్సు సర్వీసుల రద్దు సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజు ల కిందట కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తిరుగుతుం డంతో ఓ.ఆర్.తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు.