13 మంది తమిళ కూలీల అరెస్ట్ | 13 tamil labours arrested in porumamilla | Sakshi
Sakshi News home page

13 మంది తమిళ కూలీల అరెస్ట్

Sep 23 2015 4:01 PM | Updated on Sep 3 2017 9:51 AM

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది తమిళ కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

పోరుమామిళ్ల (వైఎస్సార్‌జిల్లా): అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది తమిళ కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల అటవీ పరిధిలోని ఇటుకులపాడు గ్రామ సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీలు ఎదురు పడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో ఒక కూలీ పరారుకాగా.. 13 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారూ రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement