కుంభమేళాకు వెళ్లొచ్చిన పూజారి కరోనాతో మృతి | Kumbh Mela: Temple Priest Died In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కుంభమేళాకు వెళ్లొచ్చిన పూజారి కరోనాతో మృతి

Apr 29 2021 6:05 PM | Updated on Apr 29 2021 6:28 PM

Kumbh Mela: Temple Priest Died In YSR Kadapa - Sakshi

కుంభమేళాకు వచ్చిన అనంతరం పూజారికి కరోనా సోకి మృత్యువాత. వారం రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత

వైఎస్సార్‌ కడప: దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేళా అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందింది. తాజాగా కుంభమేళాకు వెళ్లివచ్చిన పూజారి కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కరోనాతో మృతిచెందారు.

కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కరోనా సోకింది. వారం రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేళాకు వెళ్లి వచ్చిన చాలా మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది.
 

చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి

చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

Advertisement
 
Advertisement
Advertisement