ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య | 10th student commit suicide in prakasam district | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

Mar 18 2016 10:57 AM | Updated on Nov 9 2018 4:36 PM

ప్రకాశం జిల్లా కొరిసిపాడు మండలం మేదరమెట్లలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

మేదరమెట్ల : ప్రకాశం జిల్లా కొరిసిపాడు మండలం మేదరమెట్లలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక సెయింట్ ఆర్నాల్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతున్న చీమకుర్తి ప్రసన్న(15) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ హస్టల్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థిని స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement