20న పదో తరగతి ఫలితాలు విడుదల | 10th results release of the on the 20th | Sakshi
Sakshi News home page

20న పదో తరగతి ఫలితాలు విడుదల

May 12 2015 4:07 AM | Updated on Sep 3 2017 1:51 AM

టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు .....

26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా

విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు.

ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement