breaking news
results of the test
-
20న పదో తరగతి ఫలితాలు విడుదల
26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్
తిరుచానూరు : ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాల్లో పేద రైతు కొడుకు... రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన నల్లపూసల శంకర్‌రెడ్డి, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 తెచ్చుకుని, స్టేట్ ఫస్ట్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి శంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తపరిచాడు.