పవన్‌ పత్తా లేకుండా పోయారు | Minister Ganta Srinivasa Rao Fires on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Jul 10 2018 1:33 PM | Updated on Mar 22 2019 5:33 PM

Minister Ganta Srinivasa Rao Fires on Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. పవన్‌కు ఆయన 25 ప్రశ్నలను సంధించారు. పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇస్తే.. దానిమీద పన్‌ నోరు మెదపడం లేదని, కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. మీ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి. మీ పొత్తు ఎవరితో అని పవన్‌ను ప్రశ్నించారు. ‘గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీరు సాయం చేశారు. దానిని అంగీకరిస్తున్నాం. కానీ మీరు లేనప్పుడు కూడా టీడీపీ గెలిచింది’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement