టన్ను రేషన్ బియ్యం స్వాధీనం | 1050 kilos ration rice captured | Sakshi
Sakshi News home page

టన్ను రేషన్ బియ్యం స్వాధీనం

Aug 10 2015 9:17 PM | Updated on Sep 3 2017 7:10 AM

విశాఖపట్టణం నగరం గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి టన్నుకు పైగా చౌక బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

గాజువాక: విశాఖపట్టణం నగరం గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి టన్నుకు పైగా చౌక బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గాజువాక ప్రాంతంలోని ఓ ఇంట్లో మొత్తం 21 సంచుల్లో 50 కిలోల చొప్పున ఉన్న 1050 కిలోల బియ్యాన్ని వాహనంలోకి ఎక్కిస్తుండగా గస్తీ పోలీసులు గుర్తించారు. ఆ బియ్యాన్ని సీజ్ చేసి, అందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, అధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన కారణంగా బిజీగా ఉండటంతో మంగళవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement