breaking news
-
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
సుపరిపాలన అంటే స్కామ్‌లు, దాడులేనా?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.‘‘రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు. -
ఉద్యోగాలిప్పిస్తానంటూ.. లక్షలు కాజేసిన జనసేన నేత
సాక్షి,డోన్: ఉద్యోగాల పేరుతో డోన్ జనసేన ఇన్చార్జ్ గడ్డం బ్రహ్మం నిరుద్యోగులకు టోకరా వేశారు. గురుకుల పాఠశాలలో ఉద్యోగాలిస్తామని డబ్బు వసూలు చేశారు. అయితే, ఉద్యోగం కోసం బాధితుల నుంచి గడ్డం బ్రహ్మం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మొహం చాటేశాడు. తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. తమకు ఇస్తామన్న ఉద్యోగంలో వేరేవాళ్లు ఉండటంతో గడ్డం బ్రహ్మం చేతిలో తాము మోసపోయామంటూ బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగమే కాదు.. బెల్ట్‌షాపులు ఇప్పిస్తానని పలువురు వద్ద నుంచి జనసేన నేత బ్రహ్మం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్‌ని తిట్టడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలిరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు.కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. -
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనలకు వైఎస్సార్సీపీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. -
‘ఉద్యోగుల హక్కులను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోంది’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపులు, ఐఆర్ బకాయిలపై కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు.రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉన్న పన్నెండో పీఆర్సీకి నేటికీ కమిషనర్‌ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజకీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్‌ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్‌నే నియమించలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న మధ్యంతర భృతి పైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు ఎంత అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డీఏ ఎరియర్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్‌ల్లో ఈ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరుఫున దీనిపై సీఎస్‌ను డిమాండ్ చేసినా, దానిపైనా ఎటువంటి స్పందన లేదు. పదకొండో పీఆర్స్ ఎరియర్స్‌తో పాటు, డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంది. డీఏల గురించి ఎక్కడా ఈ సమావేశంలో మాట్లాడలేదు. అసలు జేఎస్సీ ఎందుకు పెట్టారో చెప్పాలి. కేవలం టైంపాస్ కోసం, ఉద్యోగుల కళ్ళ నీళ్ళు తుడిచేందుకే ఈ సమావేశం నిర్వహించారా..? కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి:ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, పీఆర్సీ కనీసం 30 శాతంకు తగ్గకుండా చూడాలి. డీఏ బకాయిలను విడుదల చేయాలి. మధ్యంతర భృతిని చెల్లించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలు సరిగా నిర్వహించడం లేదు, బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రెండు నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తీసుకురావాలని, గత ప్రభుత్వం మూడు వేల మందిని రెగ్యులర్ చేసింది, మిగిలిన ఏడు వేల మందిని కూడా తక్షణం రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పదిశాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, 75 దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కనీసం ఒక్క దానిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ళ వరకు పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు.ఈ డిమాండ్లపై సీఎస్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానంటూ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం ఎంత వరకు సమంజసం..? కూటమి ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల తరుఫున ప్రభుత్వం మెడలు వంచైనా సరే, వారికి రావాల్సిన అన్నింటిని సాధించుకుంటాం. -
దెందులూరులో చింతమనేని అనుచరుల వీరంగం
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక.. దగ్గుపాటికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత బుధవారం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. దగ్గుపాటిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించడం గమనార్హం.చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారనే చర్చ నడిచింది. కచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. ఇలాందేమీ జరగకుండానే.. వారిద్దరి భేటీ ముగిసింది. అయితే, మంత్రి నారా లోకేష్‌కి దగ్గుపాటి సన్నిహితుడు అయిన కారణంగానే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో బూతుల ఎమ్మెల్యేకు చంద్రబాబు మద్దతు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో, మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి రేపటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం నడిబొడ్డున బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్‌కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..‘టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. -
బాబూ.. నిన్ను నమ్మేదెలా?
‘ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇదంతా కేవలం ఉపన్యాసం కోసం చేసిందేనని, చిత్తశుద్ధి లేనిదని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం ప్రచురితమైన రోజే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరిగిన దాష్టీకాల వార్తలూ ప్రముఖంగా వచ్చాయి. కొన్నింటిలో చంద్రబాబు సొంతపార్టీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇప్పటివరకూ చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇందుకు తగ్గట్టుగానే బాబుకు వత్తాసు పలికే మీడియా కూడా టీడీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుతూంటుంది. కానీ.. ఈ ఘటనలన్నీ ఇతర మాధ్యమాల్లో వస్తుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.టీడీపీ ఎమ్మెల్యేల ఇతర దందాల సంగతి పక్కనపెట్టినా.. వీరూ, వీరి అనుచరులు మహిళలపై చేస్తున్న వేధింపుల ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. సినిమా విడుదలకు తన అనుమతి కావాలన్న ఆ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం ఆయన శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. తనతో వీడియో కాల్‌లోనే మాట్లాడాలన్నది ఆయన హుకుం!. మాట వినకపోతే బదిలీ ఖాయమని సిబ్బంది ద్వారా బెదిరింపులకు దిగుతున్నట్లు ఈ కథనం చెబుతోంది.రాత్రి పది గంటల సమయంలోనూ పార్టీ ఆఫీసుకు రావాలని మహిళా ఉద్యోగులను పిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు భరించలేక ఆ దళిత మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ ఇతర మహిళా ఉద్యోగులను కూడా వేధించారని ఆమె అంటున్నారు. మరి ఇవన్నీ ఆడబిడ్డ జోలికి వెళ్లడమే కదా? మరి చంద్రబాబు తాట ఎంతవరకు తీశారు? కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు చేరవేయడానికి పనిచేసే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?.ఇక మరో ఎమ్మెల్యే ఉదంతం చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నట్లు పెదాలు కదుపుతున్న దృశ్యం సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యేకి టీడీపీకే చెందిన ఒక మహిళా నేతతో సంబంధం ఉందట. దీంతో ఆ మహిళా నేత భర్తే సంబంధిత వీడియోని ప్రచారంలో పెట్టారట. ఈ విషయాన్ని సూఫియా అనే మరో టీడీపీ నేత ఎమ్మెల్యేకి చెబితే తొలుత ఆమెను కామ్‌గా ఉండమని చెప్పారట. తదుపరి అక్రమ సంబంధం ఉన్న మహిళ కుటుంబంతో సెటిల్మెంట్ చేసుకుని, తదుపరి తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సూఫియా అంటున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీయకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన అత్యంత విషాద భరితం. శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే భర్త టీడీపీకి చెందిన వాడు కావడంతో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ వైస్ చైర్మన్ తదితరుల ఒత్తిడితో పోలీసులు ఆ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని శ్రావణి ఆరోపించారు. తన ఆత్మహత్యకు టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కారణమని ఆమె చెప్పిన ఆడియో వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అనే మహిళ హత్య కేసు గురించి గొంతెత్తి అరిచేవారు. ఎన్నికల తర్వాత ఆయనకు పదవి రావడంతో ఆ మాటే ఎత్తడం లేదు. ఆ మీదట సుగాలి ప్రీతి తల్లి నిరసన యాత్ర చేయాలని తలపెట్టినా అనుమతించడం లేదట. జగన్ పాలన సమయంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వలంటీర్లే కిడ్నాప్‌లకు పాల్పడ్డారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారం సాధించడానికి గాను మహిళలను అడ్డు పెట్టుకుని అంత ఘోరమైన ఆరోపణలు చేయవచ్చా? అది వారిని అవమానించినట్లా? కాదా?.2014-19 మధ్య కాలంలో కూడా మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగాయి. ముసునూరు మహిళా ఎమ్మార్వో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు ఆమెను తీవ్రంగా అవమానించిన ఘటన అప్పట్లో పెను సంచలనం. అయితే చంద్రబాబు ఎమ్మార్వోనే మందలించి రాజీ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు.. కొద్ది నెలల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక టీడీపీ మహిళా నేత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై నామమాత్రంగా చర్య తీసుకున్నా, ఆ తర్వాత ఆ కేసే లేకుండా రాజీ చేశారని వార్తలు వచ్చాయి.శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వినూత వ్యక్తిగత వీడియోల కేసు చివరికి వారి పీఏ హత్యకు దారి తీసింది. వినూత దంపతులు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే జరిగిందని ఆరోపించారు. అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వపరంగా చర్యలు శూన్యమే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్ వేదిక వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్‌కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.Third-Rate… Vulgar LeadersIn just the last few days, the Telugu Desam Party (TDP) has been rocked by a string of scandals involving its ministers and MLAs, raising serious questions about the government’s credibility and governance. The controversies range from brazen attacks…— YSR Congress Party (@YSRCParty) August 20, 2025..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్‌కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది. -
రెచ్చిపోయిన మరో టీడీపీ ఎమ్మెల్యే.. ఫారెస్ట్ వాహనాన్ని లాక్కుని..
సాక్షి, నంద్యాల జిల్లా: అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్నారు. ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. నారా లోకేష్ అండతో చెలరేగిపోతున్నారు. తాజాగా.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, అనుచరుల దాడిపై ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. -
‘విశాఖ ఉక్కుపై కుట్ర తగదు చంద్రబాబు’
సాక్షి,విజయనగరం: విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో పరిపాలన పూర్తి గా గాలికి వదిలేశారు. ఏ ఒక్క వర్గం సంతృప్తి గా లేదు. సూపర్ సిక్స్ అరకొరగా మొదలు పెట్టినా క్లారిటీ లేదు. తల్లికి వందనం పథకంలో ఏడు ఎనిమిది లక్షల మందికి కేంద్రం నుండి డబ్బులు రాలేదని అరకొరగా ఇచ్చారు.అన్న దాత సుఖీభవ అర్హులకు ఇవ్వలేదు. సాంకేతిక కారణం చెప్పి ఎగ్గొట్టారు.వితంతు పెన్షన్స్ ఇవ్వకుండా కారణాలు చెప్తున్నారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్స్ తీసేశారు. అబద్ధాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే సీఎం, మంత్రులపై చర్యలు తీసుకోవాలి. స్టీల్ ప్లాంటు లో 32 విభాగాలు ప్రైవేట్ పరం చేశారు.వైఎస్సార్సీపీకి ద్వంద వైఖరి లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే మా నినాదం.స్టీల్ ప్లాంట్ కి 14 వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చినప్పుడే మేము అనుమానం వుంది అని చెప్పాం. స్టీల్ ప్లాంట్ అప్పులు తీరాక ప్రైవేట్ చేయాలని పన్నాగం చేస్తున్నారు.సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు స్టీల్ ప్లాంట్ గురుంచి ఎందుకు మాట్లాడటం లేదు’అని ప్రశ్నించారు. -
టీవీ5 అబద్ధాలకు పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.బీఆర్ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్సీపీ నాయకులపై మీ చానెల్లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు. -
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జైళ్లు అడ్డంకి కాదు.. సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి(నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టిందని వైఎస్సార్సీపీ అంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. -
అమరావతి మునిగిపోయిందా?.. మంత్రి పర్యటనతో క్లారిటీ
సాక్షి, విజయవాడ: వరద నీళ్లలో మునిగిపోతే.. ‘అబ్బే అదేం లేదూ.. అవన్నీ ఫేక్ కథనాలే’ అంటూ కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానెల్స్‌లో, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా కళ్లెదుట నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నా.. ప్రశ్నించినందుకు కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ముంపునకు గురైందన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణే స్వయంగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది!!.ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగుతున్న నేపథ్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో.. ‘‘కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నింది. వెస్ట్ బైపాస్‌రోడ్డు నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఆ నిలిచిన నీరుపోవడానికి బైపాస్కు గండ్లు పెడుతున్నాం’’ అని అన్నారాయన.అదే సమయంలో.. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు, అత్యాధునిక డిజైన్ అంటూ మళ్లీ పాత పాటే వినిపించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం అని అర్థం. అంటే ఓవైపు ముంపు లేదని ఎల్లో బ్యాచ్ చెబుతుంటే.. మరోవైపు నీరు వెనక్కు తన్నిందని స్వయానా మంత్రే అంటున్నారు. ఈ లెక్కన అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్నట్లే కదా!. -
‘రౌడీషీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలే’
తాడేపల్లి : రౌడీ షీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారయదర్శి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. అతన్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చింది కూడా ఆ పార్టీ వారేనన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి..‘ రౌడీషీటర్ శ్రీకాంత్ కు జూనియర్ నయీంగా పేరుంది. టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదరకనే శ్రీకాంత్ వీడియోలు బయటకు వచ్చాయి. సుగాలి ప్రీతి కేసు తేల్చుతామన్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని మోసం చేశారు. ప్రీతి తల్లి ఆందోళనకు దిగితే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదేనా బాధిత మహిళల కుటుంబానికి మీరు చేసే న్యాయం?, ప్రభుత్వ అధోగతి పనులపై ప్రజా ఉద్యమానికి రెడీ అవుతున్నాం. ఎమ్మెల్యేలు చేస్తున్న అఘాయిత్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు?, ఎన్నాళ్లు ఇలా డైవర్షన్ రాజకీయలు చేస్తారు?, ఈనాడు పత్రిక తప్పుడు వార్తలు రాసే ముందు తమ చరిత్ర ఎలాంటిదో తెలుసుకోండి. ఆ పత్రిక రాసే కథనాలు చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.రౌడీషీటర్ పెరోల్ ఎపిసోడ్.. హోంమంత్రి అనిత తడబాటు -
రౌడీషీటర్ పెరోల్ ఎపిసోడ్.. హోంమంత్రి అనిత తడబాటు
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత తడబడ్డారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని హోం మంత్రి అనిత.. విచారణ జరుగుతుందంటూ సమాచారం దాట వేశారు. సంతకాలు ఎవరెవరు చేశారో చెప్పని హోంమంత్రి.. సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు.పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన వినిపించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ ప్రకటించిన హోంమంత్రి.. మీడియా ఆ విషయం వదిలెయ్యాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్‌కు చంద్రబాబు సర్కార్.. పెరోల్ ఇచ్చింది. టీడీపీ నేతల అండతోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటకొచ్చారు. పెరోల్లో మీ పాత్ర ఏంటంటూ హోంమంత్రి అనితను మీడియా ప్రశ్నించగా.. తన పాత్ర ఉందొ లేదో చెప్పకుండా.. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్‌మార్టం చేయండి అంటూ మాట దాటవేశారు.కాగా, హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు.ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్‌పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్‌ని రద్దు చేసింది. -
‘అవాస్తవాలు చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’
తూర్పుగోదావరి జిల్లా. మద్యం కేస్ పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, ఇందులో వాస్తవాలు లేవని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మిధున్ రెడ్డి కుటుంబాన్ని అవమాన పరచాలనే ఉద్దేశంతోనేఈ తతంగమంతా జరిగినట్టు అర్థం అవుతుందన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19వ తేదీ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో బొత్స సత్యనారాయణ కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వాలు వ్యవస్థను డైవర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం తగదు. రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చివరకు ధర్మం గెలుస్తుందిఈ నెల 25 మా నాయకుడు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతాయని సదుపాయాలు కల్పిస్తారని అంచనా వేయనవసరం లేదు. చట్టాన్ని ఒకసారి చేతిలోకి తీసుకుని వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. అది వారినే దహించి వేస్తుంది. అవాస్తవాలు చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న కాలంలో నిజానిజాలు బయటికి వస్తాయి. వ్యక్తులను అవమానపరిచి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని బొత్స ధ్వజమెత్తారు. -
మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్’ ప్రయోగం
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్‌కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్‌కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు. -
బనగానపల్లెలో మంత్రి అరాచకాలు.. కాటసాని రామిరెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల: జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. బనగానపల్లె వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మంత్రి కాంపౌండ్‌లోకి తీసుకెళ్లి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికిలో చంద్రమౌళిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు.మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నాడంటూ కాటసాని దుయ్యబట్టారు. జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడంలేదు. తాము ఫ్యాక్షన్‌కు చరమగీతం పాడి సాధారణ జీవితం సాగిస్తుంటే.. మాసిపోయిన ఫ్యాక్షన్‌ను మంత్రి బీసీ ప్రేరేపిస్తున్నారు. తమకు సహనం నశిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తామంటూ కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. -
రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి.. పెద్దారెడ్డిని అడ్డుకుని..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన్ని బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓవరాక్షన్‌కు దిగారు. అడ్డంగా రోడ్డుకు జీపులు పెట్టి మరీ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. దమ్ముంటే పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటూ జేసీ ప్రభాకర్ సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దారెడ్డి అడుగుపెట్టిన వెంటనే దాడులు చేయాలని జేసీ, ఆయన అనుచరులు ప్లాన్ వేశారని వైఎస్సార్సీపీ అంటోంది. ఉన్నత న్యాయస్థానం పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు అనుమతించినా.. పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై పార్టీ మండిపడుతోంది.తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా?: పెద్దారెడ్డిపోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు. నాపై పోలీసుల ఆంక్షలు దుర్మార్గం. నేను ఎక్కడికెళ్లినా పోలీసులు వెంట పడుతున్నారు. జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభాకర్‌రెడ్డి చేతిలో పోలీసులు బందీ అయ్యారు. తాడిపత్రి అరాచకాలపై సిట్ విచారణ జరపాలి’’ అని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. -
రాబందుల స్వైర విహారం.. ఏపీలో మహిళలకు రక్షణ కరువు
టీడీపీ రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళే హోం మంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో, పైగా ఆమె నియోజకవర్గంలో మహిళలపై దాష్టీకాలు జరుగుతుంటే పట్టనట్లు ఉంటున్నారని అన్నారామె. సాక్షి, తాడేపల్లి: రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏంటి? ఇప్పుడు జరుగుతున్న దారుణాలు ఏంటి?. రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళలకు రక్షణే లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకవాదులుగా మారిపోయారు. మహిళా ఉద్యోగుల పాలిట టీడీపీ ఎమ్మెల్యేలు రాక్షసులుగా మారారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?.. అధికారుల మీద అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరు ఇచ్చారు?. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య మీద ఎమ్మెల్యే రవికుమార్ దాష్టీకానికి దిగారు. రాత్రి సమయాల్లో కూడా తన ఆఫీసులో ఉంచటం ఏంటి?. అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం ఏంటి?. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అరాచకాలు తట్టుకోలేక సూఫియా అనే మహిళ ఆత్మ హత్యాయత్నం చేశారు. కూటమి నేతలు రాబందులుగా మారారు. పోలీసులకు మొరపెట్టుకున్నా.. వాళ్లు పట్టించుకోవటం లేదు. జరుగుతున్న దారుణాలు ఎల్లో మీడియాకు ఎందుకు కనపడటం లేదు?. ప్రశ్నించే సాక్షి మీద అక్రమ కేసులు, గొంతు నులుమే చర్యలు చేస్తారా?. సౌమ్య ఆత్మ హత్యాయత్నంపై హోంమంత్రి అనిత ఎందుకు మాట్లాడటం లేదు?. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. కూటమి ప్రభుత్వం బాధితుల తరపున ఏనాడూ నిలపడలేదు. పైగా అన్యాయం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు. మహిళల వ్యక్తిత్వ హననానికి కూటమి నేతలే ఆజ్యులు. చిన్నారులపై కూటమి కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం లేదు. జగన్ హయాంలో దిశా యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ వలన ఏం ప్రయోజనం చేకూరింది?. వైఎస్సార్సీపీ నేతలు పోరాటం చేస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా?. రాష్ట్రంలో మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందిదళిత మహిళల మీద జరిగే దారుణాలను అసలే పట్టించుకోవటం లేదు. మహిళలే కాదు, ఐపిఎస్ అధికారులు సైతం కూటమి ప్రభుత్వ వైఖరికి ఇబ్బంది పడుతున్నారు. దళితులను గంజాయి తాగేవారంటూ అవమానించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే మహిళలపై దాష్టీకాలు జరిగితే పట్టించుకోవడం లేదు’’ అని శ్యామల మండిపడ్డారు. -
లిక్కర్ స్కామ్ చంద్రబాబు కట్టుకథే
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబునాయుడు అల్లిన కట్టుకథే లిక్కర్ కుంభకోణమని, ఆ కథ ఆధారంగానే సిట్ అధికారులు సరైన ఆధారాలు లేకపోయినా విచారణ చేస్తూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. లిక్కర్ అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సోమవారం ములాఖత్ అయ్యారు.అనంతరం అనంత సెంట్రల్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అధైర్య పరచేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. జైల్లో మిథున్‌రెడ్డికి అన్ని వసతులూ కల్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నా.. పాటించడం లేదన్నారు. బాబును ఎదుర్కొన్నందుకే: కేతిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో లేని స్కామ్‌ను తీసుకొచ్చి నిరాధారంగా ఎంపీ మిథున్‌రెడ్డిని జైల్లో ఉంచారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తన చిన్నాన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు మూడు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలిచి్చనా వారు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌ను నమ్మితే, పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాపులకు అర్థమవుతోందన్నారు.