
సాక్షి,డోన్: ఉద్యోగాల పేరుతో డోన్ జనసేన ఇన్‌చార్జ్ గడ్డం బ్రహ్మం నిరుద్యోగులకు టోకరా వేశారు. గురుకుల పాఠశాలలో ఉద్యోగాలిస్తామని డబ్బు వసూలు చేశారు. అయితే, ఉద్యోగం కోసం బాధితుల నుంచి గడ్డం బ్రహ్మం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మొహం చాటేశాడు. తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. తమకు ఇస్తామన్న ఉద్యోగంలో వేరేవాళ్లు ఉండటంతో గడ్డం బ్రహ్మం చేతిలో తాము మోసపోయామంటూ బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగమే కాదు.. బెల్ట్‌షాపులు ఇప్పిస్తానని పలువురు వద్ద నుంచి జనసేన నేత బ్రహ్మం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.