breaking news
-
లిక్కర్ స్కామ్ చంద్రబాబు కట్టుకథే
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబునాయుడు అల్లిన కట్టుకథే లిక్కర్ కుంభకోణమని, ఆ కథ ఆధారంగానే సిట్ అధికారులు సరైన ఆధారాలు లేకపోయినా విచారణ చేస్తూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. లిక్కర్ అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సోమవారం ములాఖత్ అయ్యారు.అనంతరం అనంత సెంట్రల్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అధైర్య పరచేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. జైల్లో మిథున్‌రెడ్డికి అన్ని వసతులూ కల్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నా.. పాటించడం లేదన్నారు. బాబును ఎదుర్కొన్నందుకే: కేతిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో లేని స్కామ్‌ను తీసుకొచ్చి నిరాధారంగా ఎంపీ మిథున్‌రెడ్డిని జైల్లో ఉంచారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తన చిన్నాన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు మూడు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలిచి్చనా వారు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌ను నమ్మితే, పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాపులకు అర్థమవుతోందన్నారు. -
టీడీపీలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు
విజయవాడ: టీడీపీలో ఇప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు మరింత అగ్గి రాజేస్తుంది. ఒక ఖైదీ పెరోల్ కోసం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేయడం ఇప్పుడు అధికార కూటమి పార్టీలో కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర బయటపడింది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంలో టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు వ్యవహారాన్ని హోంశాఖ అధికారులు బయటపెట్టారు. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ పై విచారణ నివేదిక ఇవ్వనున్నారు హోంశాఖ కార్యదర్శి.డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంవో విచారణకు ఆదేశించగా ఎమ్మెల్యేల వ్యవహారం బహిర్గతమైంది. హోంమంత్రి ఫైల్ సర్క్యులేట్ చేసినట్టు శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వెల్లడించిన నేపథ్యంలో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే అని నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబును డైలమాలో పడేసింది. అధికారులపై నెట్టేసే యత్నం ఎల్లో మీడియా చేసినా అంతటి ఘనకార్యం చేసింది టీడీపీ ఎమ్మెల్యేనని బయటపడటంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. -
‘ఆ వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవం’
తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి చానల్ సహా ఇతర చానల్స్‌పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు.ఈరోజు(సోమవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత సాక్షి చానల్ మీద కేసు వేయించారు. సాక్షి చానల్, కొన్ని ప్రైవేట్ చాన్సల్స్ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారు. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగింనేది వాస్తవం కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఆగుతుందా?, అడ్డదిడ్డంగా తవ్వి కట్టలు వేయడం వల్ల కొండవీటి వాగు పొలాల మీద పడింది. హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఈ వాస్తవాలతో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. అమరావతిపై మాకు అసూయ లేదు. అమరావతిపై రూ. 52 వేల కోట్లు అప్పు చేశారు. అమరావతి రైతులకు చంద్రబాబు ఏమైనా సహాయం చేశాడా?, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఆయన మీదే కేసులు పెట్టాలి. రూ. 220 కోట్లతో కొండవీటి వాగుపై లిఫ్ట్ పెట్టారు.. అది నిరుపయోగం అయ్యింది’ అని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి నీట మునిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారుఇక మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్, జూనియర్ ఎన్టీఆర్‌పై తప్పుడు మాటలు మాట్లాడిన మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌లపై చర్యలేవని ప్రశ్నిచాచు. వారిపై ఎందుకు కేసులు పెట్టరు.. ఎందుకు సస్పెండ్ చేయరని అంబటి నిలదీశారు. -
వంగవీటి రంగా హత్యపై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను ప్రభుత్వంతోనే చంపించారని అన్నారాయన. ఆరుగోలనులో సోమవారం రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి మాట్లాడుతూ.. తనకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు. అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతోనే ఆయన్ని చంపించారు అని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఆ కామెంట్లపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలో నిరహార దీక్షలో ఉన్న రంగాను 1988 డిసెంబర్ 26న కొందరు దుండగులు స్వామిమాలలో వచ్చి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత విజయవాడలో తీవ్ర అల్లర్లు చెలరేగగా.. 40 రోజులపాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆయన హత్య రాజకీయ, కుల, సామాజిక నేపథ్యంతోనే జరిగిందనే చర్చా ఇప్పటికీ నడుస్తోంది. -
టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా.. నావల్ల కావట్లే!
శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య.. బలవనర్మణానికి ప్రయత్నించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ‘‘టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా. గత మూడు రోజులుగా నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆస్పత్రి బెడ్ మీద కన్నీళ్లు పెట్టున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఆమెపై నెగెటివ్‌గా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు వాళ్ల సంబంధిత అకౌంట్లలో ఆ పోస్టులు చేయిస్తున్నారని ఆమె అంటోంది. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. మూడు రోజుల నుంచి బాధితురాలు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య మీడియా ముఖంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆమె అన్నారు. ఎమ్యెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నావల్ల కావడం లేదంటూ.. మీటింగుల పేరుతో రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తనపై అవినీతి ఆరోపణలు చేసి ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేశారని మండిపడిందామే. ఇదే విషయంపై SC కమిషన్‌కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే రవి ఆ ఆరోపణలను ఖండించారు. ఆమెపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. సౌమ్యపై టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయగా.. తీవ్ర మనస్థాపంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. -
జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం: పోలీసులు
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం. -
బాబు, రాహుల్ హాట్‌లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
‘కూటమి పాలనలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు’
తాడేపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అడుగడుగునా అకృత్యాలు పెచ్చుమీరాయనివైఎస్సార్సీపీ నేత, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార మదం, అహంకారంతో కూటమి పార్టీల నేతలే ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం అత్యంత దారుణమని మండిపడ్డారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తేల్చి చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...మహిళా ఉపాధ్యాయులకే రక్షణ కరువుశ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను మానసికంగా వేధించడం అత్యంత దుర్మార్గం. బాధిత ప్రిన్సిపాల్ ఎంత వేదనకు గురి అయితే బయటకు వచ్చి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అర్ధరాత్రి వీడియో కాల్స్ తో సహా ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కన్నీరు పెట్టుకుంటూ బాధిత ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు.గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దాష్టీకం, వేధింపులు పై అధికార టీడీపీకు చెందిన బాధిత మహిళే నేరుగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రకాలుగా సాక్షాత్తూ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?.ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార్లతో సమక్షలు చేస్తున్న చంద్రబాబు... మహిళలపై ఈ స్ధాయిలో వేధింపులు, దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు భయం లేదు? కీచకుల్లా వ్యవహరిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు సర్వసాధారణం అయిపోయాయి. స్కూల్లు, కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులు గురువుతున్నారు. అధికార మదం, అహంకారంలో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ తో ఎమ్మెల్యే అర్ధరాత్రి వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? స్కూల్లో సీటు కావాలంటే.. ఎమ్మెల్యేగా రిఫరెన్స్ చేయవచ్చు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ సమయంతో సంబంధం లేకుండా మహిళా టీచర్ ని అర్ధరాత్రి వరకు మీ ఆఫీసులో కూర్చోబెట్టాల్సిన పని ఏమిటి? అర్ధరాత్రి వీడియో కాల్ చేయడమేంటి? ఇది ఏ రకమైన సంస్కృతి? ఎమ్మెల్యే స్ధానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో కాల్ వివరాలు బాధితురాలు మీడియాకు చూపిస్తుందంటే ఏ స్ధాయిలో హింసకు గురి చేస్తున్నారో అర్దం అవుతుంది. తోటి ఉపాధ్యాయులు ముందు బాధితురాలు రోదిస్తున్నా... ఆమెను తిట్టడం ఏ రకమైన దాష్టీకం.దిశ యాప్ రద్దుతో రక్షణ లేని ఆడబిడ్డలు:మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిశ యాప్ ను ప్రవేశపెట్టాం. ఆపదలో ఉన్న బాధితురాలు దిశ యాప్ కు పోన్ చేసినా, ఫోన్ ను అటూ ఇటూ ఊపినా వెంటనే పోలీసులు వచ్చి ఆదుకునేవారు. తగిన సహాయం చేసేవారు. అలాంటి దిశ యాప్ ను ఈ ప్రభుత్వం మరుగున పెట్టింది. ఇవాళ ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేడు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. దిశ యాప్ ను తుంగలో తొక్కి పనిచేయని యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ పరిపాలన చూసి మహిళలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.ఇవీ అధికార పార్టీ నేతల అరాచకాలుకూటమి ప్రభుత్వం రాగానే అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం చేసిన దాష్టీకాన్ని అందరం చూశాం. అధికార పార్టీకే చెందిన ఓ బాధిత మహిళ ఆయన వేధింపులకు తాళలేక ఈ రాష్ట్రంలో రక్షణ లేదని ఏకంగా హైదారాబాద్ వెళ్లి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ రాష్ట్రంలో తన కష్టం చెప్పుకుంటే ప్రాణహాని కలుగుతుందన్న భయంతో పక్కరాష్ట్రానికి వెళ్లి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న దగ్గర నుంచి మహిళలమీద ఈ దాష్టికాలు మొదలయ్యాయి. ఆ రోజు లక్ష్మి పార్వతిని నెపంగా చూపి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. అదే సంస్కృతిని ఆ పార్టీ నాయకులు ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే వాటిని చంద్రబాబు ఆపడం లేదు సరికదా కనీసం ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు.రాష్ట్రంలో అడుగడుగునా మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నారు. వారిపై ప్రతిచోట టీడీపీ నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులు నుంచి తిరుపతి అరుంధతి కాలనీలో టీడీపీ నాయకుడు ఉదయ్... స్థానిక మహిళమీద లైంగిక వేధింపులుకుపాల్పడ్డారు. అదే విధంగా మరో టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం కుమారుడు అభినవ్ ప్రేమ పేరుతో బాలికను తీసుకెళ్లి మోసగించి... నాలుగు తర్వాత విడిచిపెట్టాడు. బాధిత బాలిక తల్లి వేదనతో ఆత్మహత్యాయత్నం చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు.రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కూడా స్థానికంగా ఓ బాలికను మోసగించి గర్భవతిని చేశాడు. సదరు బాధిత బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చినా సంబంధం లేదంటూ బుకాయిస్తే.. స్ఠానిక టీడీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చాలని చూడ్డం అత్యంత దారుణం.అనంతరపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామానికి సమీపంలోని రామగిరిలో ఓ దళిత బాలికపై అధికార పార్టీకి చెందిన 14 మంది పదే,పదే అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో షేక్ మీరా అనే వ్యక్తి అర్ధరాత్రి ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేస్తే విషయం బయటకు వచ్చింది. పల్నాడు జిల్లాలో బొడ్డు వెంకేటశ్వరరావు అనే టీడీపీ నాయకుడు .. ఓ అంగన్వాడీ టీచరును కులం పేరుతో దూషించి ఆమెను వేధింపులు గురిచేశాడు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో లక్ష్మీ, వరలక్ష్మీ అనే ఇద్దరు మహిళల దుస్తులు చింపి, వారి జుత్తుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ మీడియాలో నీతులు చెబుతాడు. కిరణ్ రాయల్ అరాచకాలపై లక్ష్మీరెడ్డి అనే బాధిత మహిళ అన్ని ఆధారాలతో మీడియాకు వివరాలిచ్చింది. కిరణ్ రాయల్ తనను ఏ రకంగా ఆర్ధికంగా దోచుకున్నాడో ఆధారాలతో చెప్పింది. కానీ అతడిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి నాయకులుగా మీరు ఇన్ ఛార్జ్ బాధ్యత ఇస్తారు?బిల్లులు పాస్ అవ్వాలన్నా, పనులు జరగాలన్నా, అవసరాలు తీరాలంటే మహిళల మీద ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసల టీడీపీ కార్యకర్త.. కోటిపల్లి రాజు..9వ తరగతి బాలికమీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భవతి కావడంతో విషయం బయటకు వచ్చింది. ఇదే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో ఇద్దరు విద్యార్థినులు మీద టీడీపీ చెందిన యువకులు గ్యాంగ్ రేప్ చేస్తే.. ఎలాంటి చర్యలు లేవు. కేవలం సెటిల్మెంట్లు, పంచాయితీలు చేయడం లేదంటే నిందితులను వేరే ఊరుకు తరలించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇది ఇవాళ వచ్చిన సంస్కృతి కాదు. 2014లో కూడా మనం చూశాం...ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి జరిగితే.. చంద్రబాబునాయుడు ఇలాగే సెటిల్మెంట్ చేశారు.సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం- ఆడబిడ్డల కష్టాలుమహిళలకు రేషన్ కార్డు నుంచి ఏం కావాలన్నా, ఏం దరఖాస్తు చేసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల దగ్గరకి వెళ్లాల్సిన ఖర్మ పట్టించారు. గతంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం కావాలన్నా గుమ్మం దగ్గరకే అందేవి. అర్హత ఉంటే ఈ సంక్షేమపథకం వస్తుందని నేరుగా ఇంటికే వెళ్లి చెప్పేవారు. వారికి కావాల్సిన పత్రాలు తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసేవారు. ఎలాంటి సమస్య ఉన్నా తీరేది. ఏ నాయకులను ఆశ్రయించకుండా, ఎవరికీ కప్పం కట్టకుండా అన్ని పనులు అయ్యేవి. ఈ ప్రభుత్వంలో భర్త చనిపోయిన ఒంటరి మహిళా ఆరోతరగతి చదువుతున్న కూతురికి సీటు కావాలని అడిగితే కూడా అత్యంత నీచంగా లైంగికంగా వేధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోని సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇప్పుడు నాయకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలోవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా మహిళల అకౌంట్ లో జమ చేస్తే వారికి ఆర్ధిక స్వావలంబన ఉండేది. నేడు అవన్నీ పూర్తిగా అటకెక్కాయి. నేడు మహిళలకు అవేవీ అందకపోగా.. మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.మహిళల తరపున వైఎస్సార్సీపీ ఆందోళన:ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళా హోమంత్రిగా అనిత కానీ, ప్రశ్నిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు ?. ప్రశ్నిస్తానన్న నాయుకుడికి బాధిత మహిళలు వాట్సప్ లో తమ ఆవేదనను పంపిస్తున్నారు. కానీ ఉపముఖ్యమంత్రికి సినిమాలకే టైం సరిపోవడం లేదు. ఇలాంటి వీడియోలు చూడ్డానికి ఏం టైం సరిపోతుంది. హోంమంత్రి అనిత తన బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. నిరంతరం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే ఆమెకు టైం అంతా వెచ్చిస్తోంది. హోం శాఖ బాధ్యతలు తప్ప అన్ని పనులు చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకం భ్రమరావతిలో బిజీగా ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చంద్రబాబు కళ్లు మూసుకుని పాలన సాగిస్తున్నారు. ఈ రకమైన అరాచకపాలనపైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాన్ని తెలియజేస్తూ ఆందోళన చేస్తామని మేయర్ భాగ్యలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి,విశాఖ: మహిళల్ని వేధించేందుకే టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల టీడీపీ ఎమ్మెల్యేల దురాగతాలపై మంచ నాగ మల్లేశ్వరి స్పందించారు.‘ఎమ్మెల్యే కూన రవి కుమార్ మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించారు. పనులు కావాలంటే తమ కోరికలు తీర్చాలని మహిళలను టీడీపీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. దళిత మహిళ ఉద్యోగిని అని చూడకుండా అందరి ముందు అవమానించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వల్ల ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను లైంగికంగా వేధించారు.ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు. టీడీపీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగిన హోం మంత్రి స్పందించలేదు.చేతగాని హోం మంత్రి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. -
జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్‌గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్‌లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు -
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్‌గా మారింది.ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్‌కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్‌ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. -
మహిళలను మోసం చేయడం సూపర్ హిటా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్‌ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా..?. చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్‌గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.‘‘పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి. పది 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా..?. తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం, విజయవాడ నో ఫ్రీ బస్.. రెండున్నర కోట్ల మంది మహిళను మోసం చేశారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు’’ అంటూ వరుదు కల్యాణి కళ్యాణి వ్యాఖ్యానించారు.‘‘లోకేష్ మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్నకు రాఖీలు కట్టారా?. మీ ఇంటి శుభకార్యాల్లో మీ మేనత్తలను మీ నాన్నా పిలిసారా?. హెరిటేజ్‌లో ఎంత వాటా మీ నాన్న మీ మేనత్తలకు ఇచ్చారు?. మహిళా గౌరవం గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా?. పవన్ కళ్యాణ్ తల్లిని పది కోట్లు ఖర్చు చేసి లోకేష్ తిట్టించలేదా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. -
వాజపేయి వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి. ఈ సందర్భంగా వాజపేయికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారు. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9xx6tDtAJM— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
మైమరచిన పచ్చమీడియా!
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు మోసాలు ఇవిగో..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే... చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలోనూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేశారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజంను మళ్లీ బయటపెట్టుకున్నాడు. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్... హిట్ ఎలా అయ్యిందో చెప్పాలి.తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైఎస్సార్సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైఎస్సార్సీపీ వెంటపడితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా?పోలవరాన్ని సర్వ నాశనం చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్ధాలు అడుతున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది.2027 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటూ అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం కాంట్రాక్ట్‌ల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు దృష్టి పెట్టాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ మా ప్రభుత్వంపై మాట్లాడారు. ఇదే చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో రూ.6 లక్షల కోట్లు అంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేని కోసం ఈ అప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.అవినీతి సొమ్ము కోసమే సింగపూర్ జపంటీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడి పెడుతుందని అబద్ధం చెప్పాడు. సింగపూర్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో అవినీతి ఒప్పందాలు చేసుకుని, జేబులు నింపుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన ఆనాటి సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళాడు. దీనితో చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సీఎంగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి, తిరిగి తన దందాను కొనసాగించాలని చూస్తే, వారు తిరస్కరించారు. దీనికి వైఎస్సార్సీపీ కారణమంటూ మాపైన ఏడుస్తున్నాడు.రాజధానిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. 52 వేల ఎకరాలను పూర్తి చేయడంకుండా మరో 43 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రాజధాని పనుల్లో కాంట్రాక్ట్‌లు ఇవ్వడం, దానికి గానూ ముందుగానే మెబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి, అందులోంచి ఎనిమిది శాతం కమిషన్‌గా తీసుకోవడం చేస్తున్నాడు. వీటన్నింటినీ నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు. సూట్ కేసులు సర్దడమే లోకేష్ పని.ఇంత దుర్మార్గమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్‌లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. అక్కడి ఓటర్లను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా, పక్క గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పబ్లిక్‌గా పోలీసుల రక్షణలో రిగ్గింగ్ చేయించారు. ఆధారాలతో సహా బయటపెట్టాం. పదివేల మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లోని గ్రామాల్లో తిరిగి చూస్తే, ఏ ఇంటిలోని ఓటరు వేలిమీద మీకు సిరా మార్క్ కనిపించదు.కారణమేంటంటే, వారి ఓటును కూడా టీడీపీ వారే వేసుకున్నారు. దానిలో స్లిప్‌లు దొరికాయని, ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని దానిలో రాసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ స్లిప్ వేసింది జిల్లా కలెక్టరా లేక డీఐజీ కోయ ప్రవీణా తేలాలి. మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..చంద్రబాబుకు కూడా సోదరీమణులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకు రాఖీలు కట్టిన సందర్భం ఉందా? కనీసం అమరావతిలో కొత్త ఇంటి శంకుస్థాపనకు అయినా వారిని పిలిచి ఒక్క చీరె అయినా పెట్టారా? తన మేనత్తల గురించి కనీసం మాట్లాడలేని లోకేష్ దానిని మరిచిపోయి వైఎస్ జగన్ సోదరిమణుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు తన సోదరుడిని ఎంత బాగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. ముందు వాటి గురించి తెలుసుకుని లోకేష్ మాట్లాడితే బాగుంటుంది.ఎన్నికలు అయిపోయిన తరువాత కౌంటింగ్‌కు మధ్యలో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ హాట్లైన్లో ఉన్నారన్న వైయస్ జగన్ మాటల్లో తప్పేముందీ? చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు కాదా? ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా? తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, రాహూల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా? ఎవరినైనా సరే మోసం చేయగల వ్యక్తి చంద్రబాబు. బీజేపీని మోసం చేసి కాంగ్రెస్‌తోనూ, కాంగ్రెస్‌ను మోసం చేసి బీజేపీతోనూ కలిశాడు. ఆయనకు ఒక సిద్దాంతం అంటూ లేదు. -
ఎమ్మెల్యే నసీర్‌కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లె టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లె టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లిలో తంబ్లలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై ప్రస్తుత తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జై చంద్రారెడ్డి వర్గీయులు దాడి చేశారు. మదనపల్లి-బెంగళూరు రోడ్డు చెప్పిలి గ్రామ సమీపంలో కర్రలు, రాడ్లతో జయచంద్రారెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దమండెం మండలం, అవికే నాయక్ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నటరాజ్ నాయక్, అలియాస్ నాగరాజ నాయక్, తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేత సాగర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు శంకర్ యాదవ్ వర్గీయులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: సతీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.‘‘గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ అవినాష్‌రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్‌ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
టీడీపీ నేతల వేధింపులు.. శ్రావణి చివరి ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేతల వేధింపులకు గర్భిణి బలైంది. ఉరేసుకుని గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది. శ్రావణి భర్త శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. భర్త వేధిస్తున్నాడంటూ శ్రావణి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోకుండా పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోవడంతో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తన చావుకు కారణం టీడీపీ ప్రభుత్వం, పోలీసులే అంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో బాధితురాలి చివరి ఆడియో వైరల్‌గా మారింది. భర్త శ్రీనివాస్‌తో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ శర్మాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం పోలీసులు, టీడీపీ నేతలపై విచారణ జరపనున్నారు. -
బాబు వంటి నల్లదొరల పాలనలో స్వాతంత్ర్యం కనుమరుగు: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జనరల్ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లతో చీటింగ్.. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగు అయిందని మండిపడ్డారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోందన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నేడు ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతోంది. ఉపిరి ఆడక ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తే.. ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు?. వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు?. బ్రిటీష్ పాలకుల నుంచి మహాత్ముడు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను తీసుకువచ్చారు. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగైంది. అబద్దాలు, ఆశలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు.నేడు పద్నాలుగు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై అణచివేతకు తెగబడుతున్నారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులపై బ్రిటీష్ వారు కూడా ఇంతలా బాధించలేదు. కానీ చంద్రబాబు పాలనలో బ్రిటీష్ వారిని మించి వేధింపులు ఉన్నాయి. ప్రశ్నించే ప్రతీ గొంతును పాశవికంగా కూటమి ప్రభుత్వం నొక్కేస్తోంది. ఇటువంటి నిరంకుశ పాలనలో స్వాతంత్ర్యం ఉందని స్వాతంత్య్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి? అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అమలువుతుందా?. నాకు అసలు ఓటర్లు వద్దు.. దొంగ ఓటర్లే కావాలని చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది. పులివెందులలో జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చుకుని దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా ఒక్కొక్కరిపై 30 కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే విధానం మంచిదా?. పులివెందులలో జరిగిన ఎన్నికను ఎన్నిక అంటారా? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఆ ఎన్నిక చూసిన తర్వాత ప్రజాస్వామ్య వాదులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రాక్షసులు కూడా అంత హీనంగా ప్రవర్తించరు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులయ్యారు. రక్షణగా లేకపోగా.. ప్రజల మీదే పులివెందులలో దాడి చేశారు. నా ఓటు నేను వేసుకోవాలి నాకు రక్షణగా ఉండండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ప్రజల పట్ల వాళ్లకు ఉండాల్సిన బాధ్యతను విస్మరించారు. తెలుగు దేశం పార్టీని గెలిపించడానికి పోలీసులు వంద సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపారు.ఈ దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్‌పై గౌరవం పూర్తిగా పోయింది. ఎన్నికల కమిషన్‌కి ఎవరు అనుకూలం అయితే వారే పాలకులు అవుతారని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా కొద్దిగా బలహీనపరిచి.. కుప్పకూలేలా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చింది వైఎస్ జగన్. అటువంటి నాయకుడిని తిరిగి మనం మళ్లీ తెచ్చుకోవాలి.. అప్పుడే రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందగలుగుతారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కూలదోయాల్సిన అవసరం ఏర్పడింది’ అని అన్నారు. -
కుర్చీ కోసం జేసీ అతిధి సింగ్‌పై ఎమ్మెల్యే మాధవిరెడ్డి చిందులు
సాక్షి,వైఎస్సార్: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వీరంగం సృష్టించారు. తనకు కుర్చీ వేయలేదంటూ ఐఏఎస్ అధికారి అతిధి సింగ్‌పై చిందులు తొక్కారు.కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. జాయింట్ కలెక్టర్ (జేసీ) అతిధి సింగ్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్‌పైకి ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. అయినప్పటికీ తనకు కుర్చీ వేయలేదని, స్టేజ్‌పైకి ఆహ్వానించలేదని జేసీని గుడ్లు ఉరిమి చూశారు.అయితే ఇదంతా గమనించిన కలెక్టర్.. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీంతో ఆమెను అక్కడే కూర్చోవాలని కోరారు. కూర్చునేందుకు ఒప్పుకోలేదు. తనకు కుర్చీ వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. అర గంటపైగా నిల్చొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.