మహిళలను మోసం చేయడం సూపర్ హిటా?: వరుదు కల్యాణి | Varudu Kalyani Fires On Chandrababu Naidu Govt Fraud In Name Of Free Bus Scheme, More Details Inside | Sakshi
Sakshi News home page

మహిళలను మోసం చేయడం సూపర్ హిటా?: వరుదు కల్యాణి

Aug 16 2025 3:18 PM | Updated on Aug 16 2025 4:24 PM

Varudu Kalyani Fires On Chandrababu Govt Fraud In Name Of Free Buses

సాక్షి, విశాఖపట్నం: ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్‌ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా..?. చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్‌గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

‘‘పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి. పది 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా..?. తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం, విజయవాడ నో ఫ్రీ బస్.. రెండున్నర కోట్ల మంది మహిళను మోసం చేశారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు’’ అంటూ వరుదు కల్యాణి కళ్యాణి వ్యాఖ్యానించారు.

‘‘లోకేష్‌ మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్నకు రాఖీలు కట్టారా?. మీ ఇంటి శుభకార్యాల్లో మీ మేనత్తలను మీ నాన్నా పిలిసారా?. హెరిటేజ్‌లో ఎంత వాటా మీ నాన్న మీ మేనత్తలకు ఇచ్చారు?. మహిళా గౌరవం గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా?. పవన్ కళ్యాణ్ తల్లిని పది కోట్లు ఖర్చు చేసి లోకేష్ తిట్టించలేదా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement