
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.
..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు.
..ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు
..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్‌కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.