
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లె టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లిలో తంబ్లలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై ప్రస్తుత తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జై చంద్రారెడ్డి వర్గీయులు దాడి చేశారు. మదనపల్లి-బెంగళూరు రోడ్డు చెప్పిలి గ్రామ సమీపంలో కర్రలు, రాడ్లతో జయచంద్రారెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో పెద్దమండెం మండలం, అవికే నాయక్ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నటరాజ్ నాయక్, అలియాస్ నాగరాజ నాయక్, తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేత సాగర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు శంకర్ యాదవ్ వర్గీయులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.