breaking news
-
బాబు గారికి పిచ్చి అన్నా స్పందించరా?
‘పీ-4 పిచ్చిలో చంద్రబాబు’’ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఒక కథనం శీర్షిక ఇది. ఇలాంటి కథనం ఏదైనా సాక్షిలోనో.. లేదా టీడీపీకి సంబంధం లేని ఏ ఇతర మీడియాలోనో వచ్చి ఉంటే ఆ పార్టీ, దాని మద్దతుదారులు అంతెత్తున లేచి ఉండేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని అంత మాట అంటారా అని మండిపడేవి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసులు పెట్టడానికి ప్రయత్నించి ఉండేవారు. కాని టీడీపీ మీడియా యజమానే అనడంతో వాళ్లెవరూ కిక్కురుమనలేకపోతున్నారు. కనీసం ఖండన కూడా ఇచ్చినట్లు కనిపించలేదు.చిత్రమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సందర్భంలోనూ ఈ ‘పీ-4’ అంశం గురించి చెప్పడం. అప్పుడు టీడీపీ మీడియా ఆహా, ఓహొ అంటూ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అద్భుతం అని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెగ ప్రచారం చేశాయి. ఏడాది కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ పిచ్చి పని చేసినా అది రైటే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామని ప్రకటించినా, విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం లులూ మాల్‌కు ఇచ్చేస్తున్నా టీడీపీ మీడియా అలా చేయడం తప్పు అని ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైందో.. చిత్తశుద్దితోనే రాశారా? లేక ఏదైనా తేడా వచ్చి రాశారా? లేక బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో రాశారా? లేక ప్రజలలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రాశారా? అన్నది తెలియదు కాని ‘పీ-4’ గురించి రాసిన కథనంలో చంద్రబాబు ‘పీ-4 పిచ్చిలో ఉన్నారని అంటున్నారు. శీర్షికలో పిచ్చి అని రాసి చంద్రబాబును తప్పుపట్టినా, మేటర్‌లో మాత్రం తప్పు సలహాదారులు, అధికారులపై నెట్టే యత్నం చేశారు. ఆ సందర్భంలో కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకున్నారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తుంటారట. ఆచరణ సాధ్యం కాని ‘పీ-4’ వంటి ఆలోచనలంటే ఆయనకు మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లోను పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారట. ఇప్పుడు ఇలా రాశారు కాని, టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఇదే మీడియా అబ్బో ఇంకేముంది..జగన్‌పై శరాలు సిద్ధం అంటూ తెగ పొగిడింది. అది ఆచరణ సాధ్యమేనని ఈ మీడియాతో పాటు ఇతర టీడీపీ మీడియా సంస్థనలు కూడా హోరెత్తించాయి కదా! అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సలహాదారులలో ఈ మీడియా అధినేత కూడా ఉంటారని చెబుతారు. కాని ఇప్పుడు సడన్‌గా చంద్రబాబులో ఫలానా అవలక్షణం ఉందని ఆయనే చెబుతున్నారు. అదే టైమ్‌లో పుణ్యానికి పోతే, పాపం ఎదురైనట్లు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇందులో చంద్రబాబు చేసిన పుణ్యమేమిటో తెలియదు. ‘పీ-4’ కొత్త పల్లవి అందుకున్నారని రాశారే తప్ప ఎన్నికల ప్రణాళికలోనే దీనిని పెట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడేమో అది దిక్కుమాలిన సలహా అని అంటున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఈ మీడియా కూడా నమ్మడం లేదు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ ముద్దు పేర్లు పెట్టి, కొంతమందికి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఈ మీడియా యజమాని చెబుతున్నారు. ఇలాంటి సమాచారంతో కూడిన వార్తను సాక్షిలో వస్తే, టీడీపీ సోషల్ మీడియా తెగ విమర్శించింది. ఇదంతా అక్కసుతో కూడిన విమర్శలని ఆరోపించింది. మరి ఇప్పుడు స్వయంగా టీడీపీ మీడియానే ఆ విషయం రాస్తే నోరు విప్పలేకపోయింది. పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? పూర్తిగా నివారించడం మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియడం లేదట. దాతలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్భందం చేయడం ఏమిటని ఆ మీడియా ప్రశ్నించింది. కోటి మంది పేద కుటుంబాలు ఉంటే 11 లక్షల కుటుంబాలనే ఎంపిక చేశారని, దీనివల్ల మిగిలిన వారు టీడీపీకి దూరం కారా అన్నది ఈ మీడియా యజమాని బాధ. చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారని, దానివల్ల మిగిలిన పేద కుటుంబాలు కినుక వహించవా అని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారట, ఇప్పటికే ఎంపికైన కుటుంబాలలో 26 శాతం అనర్హమైనవని కూడా అధికారులు చెబుతున్నారట.ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ అమలు కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పిలిచి గంటల కొద్ది చర్చలు జరుపుతుండడాన్ని కూడా ఈ మీడియా ఆక్షేపించింది. ఈ సమావేశాలకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకున్నారని కూడా వెల్లడించారు. దత్తత తీసుకునే వారిని ఇంతమందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని ఈ మీడియా యజమాని అంగీకరించారు. ఇదే మాట సాక్షి మీడియా చెబితే ఇంతెత్తున ఎగిరిపడిన ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు. ‘పీ-4’ పథకం అమలు కమిటీ వైస్ ఛైర్మన్ కుటుంబరావును దీనికంతటికి బాధ్యుడు అన్నట్లుగా ఈ మీడియా యజమాని చెబుతున్నారు. తొలుత ముఖ్యమంత్రి ‘పీ-4’ పిచ్చిలో ఉన్నారని రాసిన ఈయన చివరికి దానినంతటిని ఒక సలహాదారుపై నెట్టేశారన్న మాట. ‘పీ-4’ వల్ల కూలీలు దొరకరని ఈయన సూత్రీకరిస్తున్నారు. అంటే ఎవరైనా నిజంగానే బాగుపడితే కూడా ఈయనకు నచ్చదు అనుకోవాలన్నమాట. అయితే టీడీపీతోసహా కూటమి ఎమ్మెల్యేలు కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రజలను పీడిస్తున్నారని ఈ టీడీపీ మీడియా అంగీకరించడం విశేషం. ఎమ్మెల్యేలకు కప్పం కడితేనే ఏ పని అయినా అవుతోందని, చివరికి పోలీస్ స్టేషన్లలో కేసు కట్టడానికి, రిజిస్ట్రేషన్లకు కూడా వీరు అనుమతి ఉండాలట. రాజధాని అమరావతి విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా ఉందని కూడా ఈయన చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఈ మీడియా ఒక నిజం రాసినా, ఇందులో వారికి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తున్నారు. గతంలో ఒక నేతపై కథనం రాస్తూ ఆయన చానా పైరవీలు చేస్తున్నారని, లోకేశ్ పేరుతో దందాలు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ స్టోరీ సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చింది. అయినా ఆయనకే ఎంపీ పదవి దక్కింది. ఆ తర్వాత ఈ మీడియా కలం, గళం మూతపడిపోయింది. దీని భావమేమి తిరుమలేశ! అని అంతా ప్రశ్నించుకున్నారు.ఇప్పుడు ఈ కథనం ఇవ్వడం ద్వారా ఎవరిని బెదిరించడానికి అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే జరుగుతుండడం ఆసక్తికరం! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నామినేషన్ నుంచి పోలింగ్ దాక ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ‘‘14 నెలల పాలనలో అన్నివిధాలా వంచించిన కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న భయం పట్టింది. అందుకే పోలీసుల అండతో దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. వారిని తరిమికొట్టడం ఖాయం’’ అని తేల్చిచెప్పారు.గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల, రాజంపేట నియోజకవర్గాల్లో ఒక్కో జెడ్పీటీసీ, కుప్పంలో ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని ఎంచుకుని మరీ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మహాగొప్పగా ప్రకటించిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై.. 13 నెలల టర్మ్ మాత్రమే ఉన్న జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తూ, నామినేషన్ల నుంచే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా రకరకాల తంతులు నిర్వహించారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాలు, అధికారులు తొత్తులుగా మారారని,, ఐఏఎస్‌లుగా రాష్ట్రంలో అత్యున్నత పదవులు వెలగబెట్టి, ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు సైతం తమ బాధ్యతలను విస్మరించారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుపుతున్నామని చెప్పడానికి, మీడియాకు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారని, కానీ పులివెందుల, ఒంటిమిట్టలో ఎవరినీ వెళ్లనివ్వకుండా, వాళ్లే ప్రయివేటు కెమెరాతో చిత్రీకరించారని పేర్ని అన్నారు. ‘‘ఈ వీడియోల్లో ఎక్కడా మహిళలు ఓటు వేసినట్లు కనిపించలేదు. అందరూ పురుషులే. అది కూడా జమ్మలమడుగు లేదా కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందినవారు.ఈ మూడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలకు ఓట్లు గుద్దుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పులివెందులలో విచిత్రం ఏమంటే సాయంత్రం 5–6 గంటల మధ్య ఓటు వేసిన మహిళలంతా వి.కొత్తపల్లెలో పోలింగ్ స్టేషన్ నం.13లో ఓటు హక్కు వినియోగించుకున్నవారే. అక్కడ ఒక పురుష ఓటరు కూడా లేడు. అధికార పార్టీ బరితెగింపునకు ఇదో నిదర్శనం. క్యూ లైన్లో లేకుండానే 3,684 మంది మహిళలు ఓటు వేశారు. బహుశా దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో! తండ్రికొడుకు ఇద్దరు దొంగలు పడ్డారని, ఇంత తంతు చేసి, మీరిచ్చిన లెక్కలతోనే దొరికిపోయారు’ అని అన్నారు. డ్రామా రక్తి కట్టేలా పోస్టులు.. డ్రామాను మరింత రక్తి కట్టించడానికి 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నాం థ్యాంక్స్ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో కొన్ని స్లిప్పుల పోస్టులు పెట్టారని, అంటే.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెబుతున్నారా? క్యూలైన్లో పురుషులు అదీ బయటివాళ్లు ఉంటే.. వారితో సమానంగా మహిళల ఓట్లు ఎలా వచ్చాయని పేర్ని నాని ప్రశి్నంచాచు. అంటే, జమ్మలమడుగు నుంచి వచ్చి దొంగఓట్లు వేసినవారు.. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని చెబుతూ పోస్టులు పెట్టారని ఎద్దేవా చేశారు. లోకేశ్... మీ పోస్ట్‌లోనే తెలుస్తోంది పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారని... అందులో ఉన్నది జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున్ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘ఇదీ వీళ్ల బండారం..! కలెక్టర్ పోస్ట్ పెట్టి తీసేస్తారు. మంత్రి దౌర్జన్యాల మీద, దొంగ ఓటర్ల మీద కేసులుండవు. ఓ సోదరి కుప్పంలో మీరు ఇలాగే చేశారని అంటోంది. కానీ, అక్కడ టీడీపీకి ఎంత ఖర్మ పట్టిందీ అంటే వాళ్ల చేతులతో వారే 680 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేశారు’’ అని తెలిపారు.వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానమేది బాబూ...? ఉప ఎన్నికల పోలింగ్‌లో ఏ జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు చూపిస్తూ సమాధానం ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చాలెంజ్ చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. ‘‘పోలింగ్ సరళి సీసీ టీవీ ఫుటేజీని, వెబ్ కాస్టింగ్ ను ప్రజల్లో పెట్టాలని వైఎస్ జగన్ అడిగితే, ఎందుకు భయం? వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్లో ఆయన ముందున్నవారు దొంగ ఓటర్లు.అంటే, కలెక్టర్ దగ్గరుండి దొంగ ఓటింగ్ చేయించారా? క్యూలైన్లలోని దాదాపు 90 శాతం దొంగ ఓటర్లే. వీటిపైనే వైఎస్ జగన్ ప్రశ్నించారు’’ అని తెలిపారు. దీంతో చంద్రబాబు స్క్రీన్ ప్లే మార్చారని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఒకే రౌండ్ లో పూర్తి చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ‘‘ఎక్కడ తప్పు పడతారోననే భయంతో, కోర్టులు ప్రారంభమయ్యేలోగా ఉప ఎన్నిక ఫలితాలు తేల్చాలని ఆదరాబాదరాగా ఆదేశాలిచ్చారు.ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉప ఎన్నికలు జరుపుతున్నామని డ్రామా మాటలు చెప్పిన వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్.. ఒక్క మీడియాను కూడా ఓటింగ్ ను చూపించేందుకు బూత్‌లలోకి అనుమతించలేదు. కిరాయికి మాట్లాడుకున్న ప్రైవేటు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌తో ఫొటోలు, వీడియోలు తీయించి విడుదల చేశారు’ అని చెప్పారు.డీఐజీ.. ఎవరి ఆనందం కోసం ఈ నిర్వాకం రాయచోటి ఎమ్మెల్యేనో, ఎన్నికలున్న ఒంటిమిట్టలో ఓటరు కాకపోయినా రాష్ట్ర మంత్రి ఎలా పోలింగ్ స్టేషన్ కు వెళ్తారని పేర్ని నాని నిలదీశారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కొట్టారని, మంత్రి మీద కేసు ఫైల్ చేశారో లేదో డీఐజీ కోయ ప్రవీణ్ సమాధానం చెప్పాలని పేర్ని నిలదీశారు. ‘ఇదంతా ఎన్నికల కమిషన్ కు కనబడ్డం లేదా? కేసు కట్టని అధికారులను సస్పెండ్ చేయరా? షోకాజ్ ఇవ్వరా? మీకు సిగ్గూ, శరం ఉందా ? పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న పనికి డీజీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పోలింగ్ బాగా నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకున్న జిల్లా కలెక్టర్.. వెంటనే ఎక్స్ఖాతాలోని పోస్టును ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు.సునీతమ్మా.. మీ తండ్రే పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారా?‘‘అసెంబ్లీఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎక్కడాలేని విధంగా పోలైన ఓట్ల కంటే ఏపీలో 12 శాతం ఓట్లు అదనంగా లెక్కించారు. మొదటినుంచి మేం ఇది చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే చెబుతున్నారు. టీడీపీ కూటమికి 164 సీట్లు రావడం మీద దేశమంతా అనుమానంతో ఉంది. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక లాంటిదే అని ప్రజలు అనుకుంటున్నారు’’ అని పేర్ని నాని అన్నారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని బతికించారంటున్న నర్రెడ్డి సునీతారెడ్డి.. ఈ నియోజకవర్గంలో ఆమె తండ్రి వైఎస్ వివేకానే చాన్నాళ్లు రాజకీయం చేశారని, అంటే ఆయనే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని చెబుతున్నారా?’’ అని ప్రశి్నంచారు. -
వైఎస్సార్సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదు: ప్రొ. నాగేశ్వర్
సాక్షి అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అలాంటిది ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీడీపీ గెలుపుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ గురువారం నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంపైన సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. భారీ ఎత్తున దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలీసుల అండతోనే టీడీపీ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. -
రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్‌ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది. ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్‌లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్‌ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.అభాసుపాలైన ఎస్ఈసీ..జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్‌తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు. ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. -
‘బిహార్ రాష్ట్ర తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక’
వైఎస్ఆర్ జిల్లా: బిహార్ రాష్టర తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందని జిల్లా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్న ఎంపిక చేసుకుని కొన్ని స్థానాలకే ఎన్నికలు జరిపారన్నారు. ‘ఆయుధాలను చూపి ప్రజలను బెదిరించి ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నికల్లో కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. అదే ఫోటోను నారా లోకేష్ ప్రజాస్వామ్యం గెలిచిందని ట్వీట్ చేసారు. అక్కడే అర్థం అయింది ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో?, ప్రజలను ఓటు వేసేందుకు వస్తుంటే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందీ?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు.ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించింది..? ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు.కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ల నుంచి స్లిప్‌లను లాక్కుని, పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తితే, ఆ పక్కనే కలెక్టర్, డీఐజీ, డీఏస్పీ, సీఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీనినేమంటారు? కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు. తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు.ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చు, జనం మంచిగా చెప్పునే పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిలో తప్పేముందీ? చంద్రబాబు చేసిన ఇటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన చరిత్రలో మచ్చపడిన నేతగా నిలిచిపోతాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనీసం పోటీ చేసిన అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వరా? పక్క నియోజకవర్గంకు చెందిన టీడీపీ నాయకులను తీసుకువచ్చి, క్యూలైన్లలో నిలబెట్టి వారితో ఓట్లు వేయించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. వీరంతా దొంగ ఓటర్లు అని మేం చెబితే వారిపై చర్యలు ఏవీ? పులివెందుల్లో జరిగింది రిగ్గింగ్.డీఐజీ కోయ ప్రవీణ్ తీరు దారుణం:కోయ ప్రవీణ్ డీఐజీ స్థాయి అధికారిగా వ్యవహరించిన తీరు దారుణం. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఒక అధికారి ఏకపక్షంగా వ్యవహరించే తీరు ఇదేనా? కడప పార్లమెంట్ సభ్యుడిని ఉదయం నుంచి నిర్భందంలోకి తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రిని మాత్రం పోలీస్ బందోబస్త్ మద్య సెగ్మెంట్లో విచ్చలవిడిగా తిరిగేందుకు అనుమతిస్తారు. ఇటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఇంత అభద్రతాభావం ఉందని అనుకోలేదు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎంపీ రాహూల్ గాంధీ దేశంలో జరిగిన ఓట్ల అక్రమాలపై మాట్లాడారు. దీనిలో ఏపీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. దానిపై కూడా ఆయన ఎందుకు ప్రస్తావించలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశాలను వైయస్ జగన్ ప్రశ్నించారు. -
‘20 లక్షల ఉద్యోగాలన్నారు.. 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’
అనంతపురం: కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి చంద్రబాబు ప్రభుత్వం 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియర్ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో 400 పరిశ్రమలు మూతబడ్డాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం-అభివృద్ధి జరిగిందని గౌతంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ .జరిగిందని, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ పాల్పడ్డారని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనైతికమని గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. -
‘ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్రలు లేవు’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్‌ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పషం చేశారు. -
దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టిన నారా లోకేష్!
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్ ట్వీట్‌తో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. మంత్రి లోకేష్.. దొంగ ఓటర్లకు సంబంధించి పోలింగ్ వీడియోను షేర్ చేసి.. ప్రజాస్వామ్యం గెలిచిందని కామెంట్స్ చేశారు. అయితే, ఫొటోలో ఉన్న వారంతా దొంగ ఓట్లరే కావడం, స్థానికులు లేకపోవడంతో అసలు బండారం మరోసారి బహిర్గతమైంది.మంత్రి నారా లోకేష్ పోస్టు చేసిన వీడియోలో దొంగ ఓటర్లు ఉండటం గమనార్హం. జమ్మలమడుగు నుంచి వచ్చి ఓటు వేసిన దొంగ ఓటర్లు అందులో ఉన్నారు. లోకేష్ పోస్టులో దొంగ ఓటు వేసిన వారిలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్. జమ్మలమడుగుకు చెందిన కొత్తపల్లి రాజగోపాల్. జమ్మలమడుగుకు చెందిన జనార్థన్ రెడ్డి, పాతకోట శివారెడ్డి సహా పలువురు స్థానికేతరులు ఉన్నారు.ఇక, మొన్న కలెక్టర్.. నేడు లోకేష్ సాక్షిగా బాగోతం బట్టబయలు కావడం గమనార్హం. అయితే, దొంగ ఓట్లను వైఎస్ జగన్ మీడియా సమావేశంలో బయటపెట్టడంతో కలెక్టర్ ట్విట్టర్లో ఉన్న ఫొటో డిలీట్ చేశారు. దీంతో, తప్పును తుడిచేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. బహిరంగ సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, వైఎస్ జగన్ సవాల్ చేసినా టీడీపీ స్పందించలేదు. వైఎస్ జగన్ సవాల్‌కు టీడీపీ తోక ముడిచింది. #FreedomAfter30Years పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం... భయపెట్టి… pic.twitter.com/leziLcQ1RY— Lokesh Nara (@naralokesh) August 12, 2025 -
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్‌బూత్‌ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్‌బూత్‌ల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్‌కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
బ్యాలెట్ బాక్సులనే మాయం చేశారు: ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్‌లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్‌కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారుఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు.దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్‌ల వద్ద యాక్టివ్‌గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.17 బూత్‌లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడుఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్‌కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్‌లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాంప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్‌ను బహిష్కరించాం. కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం. -
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. -
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్‌ను పొడిగించింది. -
‘పులివెందులలో పోలీసులు, వైఎస్సార్సీపీ మధ్య ఎన్నికలు జరిగాయి’
సాక్షి, విశాఖ: నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకులు. పులివెందులలో పోలీసులు, వైఎస్సార్సీపీ మధ్య ఎన్నికలు జరిగాయని అన్నారు. కూటమి సర్కార్‌ను గద్దె దింపే వరకు ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ప్రతీ రోజూ జగన్‌ను దళితులు తలుచుకుంటారు. దళితుల పక్షపాతి వైఎస్ జగన్. 20శాతం మంత్రి పదవులు దళితులకు జగన్ ఇచ్చారు. దళితులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు ఏ పథకాలు రావడం లేదు. దళితులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మోసానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. మోసానికి మరో పేరు చంద్రబాబు. ఎస్సీలు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ క్యాస్ట్ అని జగన్ నమ్మారు. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని బాబు, లోకేష్, పవన్ ఒక్కసారైనా సందర్శించారా?. టీడీపీ గూండాలతో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. సూర్య చంద్రులు ఏకమైనా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. గడిచిన ఎన్నికల్లో అన్ని కులాల కంటే వైఎస్సార్సీపీకి దళితులు అధికంగా ఓటేశారు. దళితులకు జగన్ అన్ని విధాలుగా న్యాయం చేశారు..టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ..‘దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నాడు. మిమ్మల్ని గద్దె దింపే వరకూ నిద్రపోయేది లేదు. డౌన్.. డౌన్ చంద్రబాబు అనే నినాదాలు ఊరు.. వాడా మొగాలి. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులే ముఖ్యమంత్రిగా ఉంటారు. పోలీసులకు, వైఎస్సార్సీపీకి మధ్య పులివెందుల ఎన్నిక జరిగింది. దళితుల ఆత్మగౌరవాన్ని 175 అడుగుల ఎత్తులో జగన్ నిలబెట్టారు. తెల్లవారింది మొదలు జగన్ గెలుపు కోసం పని చేస్తాం అని అన్నారు. -
ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన. -
బీటెక్ రవి, డీఐజీ కోయ ప్రవీణ్ ఎవరు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం.. ఒక్కో ఓటర్‌కు ఒక్కో రౌడీని దింపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు.పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ పార్టీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి ఒక్కో రౌడీ వచ్చారు. ప్రతీ పోలింగ్ బూత్‌కు 400 మందిని మోహరించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు. స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?. ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు.వాళ్లంతా ఎవరు?..మంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వ్యక్తులు పులివెందులకు వచ్చారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డి.. వారిని తీసుకొచ్చారు. ఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు.ఎర్రబల్లిలో ఓటర్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. కనంపల్లి సర్పంచ్‌ను పోలీసులు గన్‌తో బెదిరించారు. కనంపల్లిలో బీటెక్ రవి తమ్ముడు దౌర్జన్యం చేశాడు. కనంపల్లిలో ఓటు కోసం ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లే చెప్పారు. రీపోలింగ్‌లోనూ యథేచ్చగా దొంగ ఓట్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు. టీడీపీ వాళ్లు వందలాది మంది ఉన్నా పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారు. అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారు. ఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. కోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయి. టీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులు. బాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే! అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. క్యూ లైన్లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారు. -
అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?
సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావొచ్చు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్ నాటికి-కౌంటిగ్ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పించారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్ల మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QyLN6VXHR4— YS Jagan Mohan Reddy (@ysjagan) August 13, 2025 -
ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్ బహిష్కరిస్తున్నాం: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పులివెందుల: రెండు కేంద్రాల్లో రీపోలింగ్.. పచ్చ నేతల దొంగ ఓట్ల దందా
పులివెందుల ఎన్నికలు..రీపోలింగ్.. మళ్లీ దొంగ ఓట్ల దందా..పులివెందుల రీపోలింగ్‌లోనూ అదే దొంగ ఓట్ల పర్వంఈ.కొత్తపల్లి గ్రామంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ టీడీపీ నాయకుడుకమలాపురం మండలం నసంటపురం గ్రామానికి చెందిన గజ్జల నారాయణయాదవ్గా గుర్తింపుఅదే గ్రామంలో తిష్టవేసి ఉన్న కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు👉ఈసీ తీరును నిరసనగా.. రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉15 బూత్‌ల్లో రీపోలింగ్ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్పులివెందులలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీముందు వెబ్ కాస్ట్ రీలీజ్ చేసి దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాత మొత్తం 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం రీపోలింగ్ బహిష్కరణవెంటనే వెబ్ కాస్టింగ్ అభ్యర్థులకు ఇవ్వాలని, భారీ ఎత్తున అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్సార్సీపీదొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతే అన్ని పోలింగ్ బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు రెండు చోట్ల రీపోలింగ్ఈ.కొత్తపల్లి రీపోలింగ్ కేంద్రానికి 45 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న పోలింగ్ మెటీరియల్ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలుఇంత వరకు పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులుమరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న రీపోలింగ్ నేడు రెండు చోట్ల రీ-పోలింగ్అచ్చివెల్లి, ఈ.కొత్తపల్లిలో రీ పోలింగ్‌కు ఏర్పాట్లు14వ పోలింగ్ కేంద్రం ఈ.కొత్తపల్లిలో 1273 ఓటర్లుఉదయం 7 గంటలకు రీ-పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంత వరకు ప్రారంభం కాని పోలింగ్ఈ.కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ మెటీరియల్రీ-పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులు అచ్చవెల్లి రీ-పోలింగ్‌లో సైతం టీడీపీ నాయకుల హవాపోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ వద్ద టీడీపీ నాయకులు తిష్టచేతిలో వందకుపైగా స్లీప్స్తో పచ్చ పార్టీ నాయకులుఇంటి నుండి బయటకు రాని సామాన్య ఓటర్లు👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు.👉ఈ నేపథ్యంలో పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్‌కి ఆదేశించింది. నేడు 3 (అచివెల్లి), 14 (ఈ.కొత్తపల్లి) బూత్‌లలో పోలింగ్ జరగనుంది. అయితే, మొత్తం పోలింగ్ బూత్‌లలో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది👉ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ నేతలు. చివరికి ఏజెంట్లను సైతం బూత్ లోకి వెళ్లనివ్వకుండా అరాచకం. మొత్తం 15 బూత్‌లలో ఏ ఒక్క చోటా ప్రజాస్వామ్యయుతంగా జరగని ఎన్నికలు. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 15 కేంద్రాల్లో మళ్ళీ తాజాగా పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రిపోలింగ్ కోరితే పట్టించుకోని ఈసీ.👉రీ-పోలింగ్ మొత్తం కలిపి కేవలం 1765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్. ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు, అచివెల్లిలో 492 ఓట్లకు మాత్రమే పోలింగ్. 15 బూత్‌లలో 10,601 ఓట్లకు ఫ్రెష్ పోలింగ్ జరపాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు.