
అనంతపురం: కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి చంద్రబాబు ప్రభుత్వం 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియర్ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో 400 పరిశ్రమలు మూతబడ్డాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం-అభివృద్ధి జరిగిందని గౌతంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ .జరిగిందని, వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ పాల్పడ్డారని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనైతికమని గౌతంరెడ్డి ధ్వజమెత్తారు.