
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్ ట్వీట్‌తో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. మంత్రి లోకేష్.. దొంగ ఓటర్లకు సంబంధించి పోలింగ్ వీడియోను షేర్ చేసి.. ప్రజాస్వామ్యం గెలిచిందని కామెంట్స్ చేశారు. అయితే, ఫొటోలో ఉన్న వారంతా దొంగ ఓట్లరే కావడం, స్థానికులు లేకపోవడంతో అసలు బండారం మరోసారి బహిర్గతమైంది.
మంత్రి నారా లోకేష్ పోస్టు చేసిన వీడియోలో దొంగ ఓటర్లు ఉండటం గమనార్హం. జమ్మలమడుగు నుంచి వచ్చి ఓటు వేసిన దొంగ ఓటర్లు అందులో ఉన్నారు. లోకేష్ పోస్టులో దొంగ ఓటు వేసిన వారిలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్. జమ్మలమడుగుకు చెందిన కొత్తపల్లి రాజగోపాల్. జమ్మలమడుగుకు చెందిన జనార్థన్ రెడ్డి, పాతకోట శివారెడ్డి సహా పలువురు స్థానికేతరులు ఉన్నారు.
ఇక, మొన్న కలెక్టర్.. నేడు లోకేష్ సాక్షిగా బాగోతం బట్టబయలు కావడం గమనార్హం. అయితే, దొంగ ఓట్లను వైఎస్ జగన్ మీడియా సమావేశంలో బయటపెట్టడంతో కలెక్టర్ ట్విట్టర్‌లో ఉన్న ఫొటో డిలీట్ చేశారు. దీంతో, తప్పును తుడిచేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. బహిరంగ సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, వైఎస్ జగన్ సవాల్ చేసినా టీడీపీ స్పందించలేదు. వైఎస్ జగన్ సవాల్‌కు టీడీపీ తోక ముడిచింది.
#FreedomAfter30Years
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం... భయపెట్టి… pic.twitter.com/leziLcQ1RY— Lokesh Nara (@naralokesh) August 12, 2025