breaking news
Fake voters
-
దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టిన నారా లోకేష్!
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్ ట్వీట్‌తో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. మంత్రి లోకేష్.. దొంగ ఓటర్లకు సంబంధించి పోలింగ్ వీడియోను షేర్ చేసి.. ప్రజాస్వామ్యం గెలిచిందని కామెంట్స్ చేశారు. అయితే, ఫొటోలో ఉన్న వారంతా దొంగ ఓట్లరే కావడం, స్థానికులు లేకపోవడంతో అసలు బండారం మరోసారి బహిర్గతమైంది.మంత్రి నారా లోకేష్ పోస్టు చేసిన వీడియోలో దొంగ ఓటర్లు ఉండటం గమనార్హం. జమ్మలమడుగు నుంచి వచ్చి ఓటు వేసిన దొంగ ఓటర్లు అందులో ఉన్నారు. లోకేష్ పోస్టులో దొంగ ఓటు వేసిన వారిలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్. జమ్మలమడుగుకు చెందిన కొత్తపల్లి రాజగోపాల్. జమ్మలమడుగుకు చెందిన జనార్థన్ రెడ్డి, పాతకోట శివారెడ్డి సహా పలువురు స్థానికేతరులు ఉన్నారు.ఇక, మొన్న కలెక్టర్.. నేడు లోకేష్ సాక్షిగా బాగోతం బట్టబయలు కావడం గమనార్హం. అయితే, దొంగ ఓట్లను వైఎస్ జగన్ మీడియా సమావేశంలో బయటపెట్టడంతో కలెక్టర్ ట్విట్టర్లో ఉన్న ఫొటో డిలీట్ చేశారు. దీంతో, తప్పును తుడిచేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. బహిరంగ సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, వైఎస్ జగన్ సవాల్ చేసినా టీడీపీ స్పందించలేదు. వైఎస్ జగన్ సవాల్‌కు టీడీపీ తోక ముడిచింది. #FreedomAfter30Years పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం... భయపెట్టి… pic.twitter.com/leziLcQ1RY— Lokesh Nara (@naralokesh) August 12, 2025 -
ప్రజాస్వామ్యం ఖూనీ
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి. -
Pulivendula: కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు బయటపడ్డ ఆధారాలు
-
పోలీస్ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్
అధికారమదమెక్కిన ‘పచ్చ’గూండాల సాక్షిగా.. పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలే పౌరులపై జులుం చేస్తుంటే.. ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే.. ఓటు స్వామ్యం చిన్నబోయింది. తెల్లారకముందే.. చిరు చీకట్లు వీడకముందే ఖాకీ.. ఖద్దరు ద్వయం ఏకమై.. దౌర్జన్యకాండ రాసింది. గడప దాటొద్దంటూ.. ఏజెంట్లు రాకూడదంటూ.. ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువల్ని నిలువునా పాతరేసింది. ఒక ఎన్నిక.. వంద కుట్రలు... గంతలు కట్టిన ‘నిఘా కళ్ల’తో.. గల్లంతైన పోలింగు కేంద్రాలతో.. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి.. దొంగ ఓటర్ల వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గు పడింది. కూటమి నేతల అరాచకాలు.. పరాకాష్టకు చేరిన వేళ.. ‘బ్యాలెట్ బాక్స్’సైతం మౌనంగా రోదించింది. ఈ మాత్రం ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రం మారింది.. పోలీసు తీరు మారింది.. ఎల్లో గూండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతైంది.. చివరికి ‘దొంగ ఓటే’ బ్యాలెట్టులో నిక్షిప్తమైంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఐసిస్, తాలిబన్, హమాస్ తీవ్రవాదులు.. పిండారీలు, థగ్గులు వంటి బందిపోట్లు కలగలిసినా తమ ముందు దిగదుడుపేనని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పెదబాబు, చినబాబు సారథ్యంలోని టీడీపీ కాలకేయులు చాటిచెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని తమ అంతర్గత సర్వేల్లో తేలడంతో పెదబాబు, చినబాబు నిస్సిగ్గుగా బరితెగించారు. ఎలాగైనా సరే.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి దిశా నిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంత మంది పోలీసు అధికారులను పెదబాబు, చినబాబు జత చేశారు. దీంతో మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలీసులే ముందుండి అరాచకంస్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిలను పోలీసులు నిర్బంధించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ బూత్‌లు ఉంటే, ఏ ఒక్క బూత్‌లోకి కూడా వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలింగ్ బూత్‌కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న ఓటర్లను పోలీసులే అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళా ఓటర్లు కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. తమ కళ్లెదుటే స్లిప్పులను ఓటర్ల నుంచి టీడీపీ గూండాలు లాక్కుని దౌర్జన్యం చేసినా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, నాయకులపై టీడీపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం రాత్రికే జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్ బూత్ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకుని, అక్కడే తిష్టవేశారు. పోలింగ్ బూత్‌లను హైజాక్ చేసి.. మంగళవారం ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేశారు. చివరకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి.. అతని జనరల్ ఏజెంట్ ఎం.బాలరామిరెడ్డిని ఓటు వేయనివ్వకపోగా.. వారి ఓట్లను కూడా దొంగగా వేసుకున్నారంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951 అక్టోబర్ 25న తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే 74 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ అంత దుర్మార్గంగా మరో ఎన్నిక జరగలేదని ఎన్నికల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకే ఈ ఉప ఎన్నిక కళంకంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు అత్యంత దుర్మార్గంగా పోలింగ్ ⇒ పులివెందుల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డి ఇంటి చుట్టూ మంగళవారం తెల్లవారుజామునే 200 మందికిపైగా జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన టీడీపీ గూండాలు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే తిష్ట వేసి పార్టీ చేసుకున్నారు. హేమంతరెడ్డిని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ⇒ పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ.. ఎక్కడా వైఎస్సార్సీపీ ఏజెంటు కూర్చునేందుకు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దౌర్జన్యానికి, వారిపై గ్రామస్తులు తిరుగుబాటు చేయకుండా పోలీసులు పహారా కాశారు. ⇒ రాగిమానుపల్లె, అచ్చవెళ్లి, ఎర్రిపల్లె, యర్రబల్లె–1, యర్రబల్లె–2, ఈ.కొత్తపల్లె పంచాయతీల పరిధిలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఏ ఒక్కచోట కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి పోలింగ్ ఏజెంటును కూర్చోనివ్వలేదు. హేమంతరెడ్డి సొంతూరు తుమ్మలపల్లి, బాలరామిరెడ్డి సొంతూరు నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు వందల మంది పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేశారు. పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అడ్డగించారు. వస్తే దాడి చేస్తామని హెచ్చరికలు పంపారు. పోలీసులను రక్షణ కల్పించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ⇒ పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా కూర్చునేందుకు పోలీసులు, టీడీపీ గూండాలు అనుమతించలేదని తెలిసి మహిళలు సాహసం చేశారు. తాము పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటామని ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగాభవానీ వెళ్లారు. టీడీపీ రౌడీలు అడ్డగించినా లెక్కచేయకుండా పోలింగ్ బూత్‌లోకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుతగిలి బెదరగొట్టి వెనక్కు పంపారు. ⇒ నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచ్చినా పోలీసులు అదే రీతిలో బెదరగొట్టారు. ‘ఎవ్వరూ ఏజెంటుగా లేకపోతే, మీరొచ్చి ఏమి చేద్దామని? నోరు మూసుకొని పోండి’ అంటూ టీడీపీ రౌడీ మూక బెదిరించింది. విశ్వ ప్రయత్నం చేసినా పోలీసులు సహకరించక పోవడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.రాజ్యమేలిన రౌడీయిజంపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ రౌడీయిజం రాజ్యమేలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు వెంకటరమణ, ఉలసయ్య, చాంద్‌బాషా నేతృత్వంలో భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి, కడప వైపు తీసుకెళా్లరు. ‘పోలీసులకు సహకరిస్తాం, హౌస్ అరెస్టు చేసుకోండి, ఎక్కడికీ వెళ్లను, పైగా జ్వరం వస్తోంది’ అని చెప్పినా పోలీసులు అత్యంత కిరాతకంగా లాక్కువెళ్లి వాహనంలోకి బలవంతంగా తోశారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడం.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డితోపాటు కీలక నేతలను పోలీçÜులు గృహ నిర్బంధం చేయడంతో పెదబాబు, చినబాబు పన్నిన కుట్ర అమలుకు మార్గం సుగమమైంది. పోలీసుల ఏకపక్ష చర్యల కారణంగా కేడర్ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేకపోయింది. మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలు ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకున్నారు.ఎక్కడికక్కడ ఓటర్ల అడ్డగింతస్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెగబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను పోలీసుల పహారాలో టీడీపీ రౌడీమూకలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఓటర్ల నుంచి ఓటరు స్లిప్పులు లాక్కుని వారిని వెనక్కి పంపించేశారు.అవే ఓటరు స్లిప్పులను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ రౌడీలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించారు. టీడీపీ వర్గీయులైన వారిని మాత్రమే ఓటు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ముందస్తు పథకం ప్రకారం క్యూలైన్లలో టీడీపీ గూండాలను బారులు తీరేలా చేసి.. పూర్తిగా ఏకపక్షంగా సైక్లింగ్ చేసుకుంటూ.. దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేసుకున్నారు.పోలింగ్ బూత్‌ల వద్దనున్న బీఎల్ఓల నుంచి ఓటర్ల వివరాలు తీసుకుని.. కడప పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్‌రెడ్డి పీఏ సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి స్లిప్‌లు రాయిస్తూ దొంగ ఓట్లను ప్రోత్సహించారు. ఎర్రిబల్లిలో టీడీపీ నేత పుత్తా లక్ష్మిరెడ్డి, కమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి, జమ్మలమడుగు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున, సర్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువు శివారెడ్డి, చిన్నదండ్లూరు రామచంద్రయ్య, కల్వటాల రాజన్న, కంబాలదిన్నె కుళాయి, బీమగుండం రాజగోపాల్, నవాబుపేల మర్రి ప్రకాశం, రామస్వామిరెడ్డి, ద్వారకచర్ల జనార్ధన్‌రెడ్డి.. కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ వర్గీయులంతా 15 పోలింగ్ బూత్‌ల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేశారు.ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు మీడియానూ వదలలేదు. ఏకపక్ష పోలింగ్‌పై ఎలాంటి కవరేజ్ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో ‘రికార్డు చేయవద్దని చెబుతుంటే అర్థం కాలేదా..’ అని గద్దిస్తూ కర్నూలు నుంచి వచ్చిన ఎన్టీవీ ప్రతినిధి కెమెరాను యర్రబల్లెలో ధ్వంసం చేశారు. ‘సాక్షి’ ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ.. భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. పచ్చ మూకల రౌడీయిజంతో మంగళవారం పులివెందుల మండలం అట్టుడికింది. -
Pulivendula: దొంగ ఓట్లు... ఇదే సాక్ష్యం
-
బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు. -
శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు
‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్ఆర్ఐలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి. ఆ ఎమ్మెల్యే నల్లతాచు సాక్షి టాస్క్‌ఫోర్స్: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు. అగ్రిటెక్ మాటున నకిలీ మందులు గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్ఆర్ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి. ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది. మైనింగ్,విజిలెన్స్ అధికారులపైనా దాడులు ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. కేసులు ‘అనంత’ం ► మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు. ► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ), రెడ్ విత్ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. ► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
బండి సంజయ్‌కు పేర్ని నాని కౌంటర్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలంగాణలో పదవి కోల్పోయిన ఓ వ్యక్తి ఏపీకి వచ్చి మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర కొందరు జీతానికి పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. బోగస్ ఓట్లను తొలగించాలి.. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. ఇక, సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు లేకుండా, బోగస్, ఇన్వాలీడ్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలని కోరాం. గత 15 రోజులుగా రామోజీరావు, రాధాకృష్ణ, టీడీపీ కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఏదో చేస్తోందంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా?. 59 లక్షల ఓట్లు 2019కి ముందు డబుల్ ఉన్నాయని ఫిర్యాదు చేశాం. అప్పుడు రామోజీ కళ్లు ఏమయ్యాయి?.. వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు రాష్ట్రల్లో ఒకే వ్యక్తికి అధిక ఓట్లు ఉన్నాయి. అందుకే ఓటరు కార్డుకి ఆధార్‌ని అనుసంధానం చేయాలని కోరాం. ఒకే మనిషికి 2,3 ఓట్లు ఉన్నాయి.. వాటిని సరి చేయాలన్నాము. ఒకే ఇంట్లో 50 నుండి 1000 వరకు ఓట్లు ఉన్నవాటిని సరి చేయమని కోరాం. ఇవన్నీ అక్రమాలు 2019 ఓటర్ల జాబితాలోనే ఉన్నాయి. అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. కానీ, సరిచేయలేదు. విజయవాడ సెంట్రల్లో ఒకే ఇంట్లో 510 ఓట్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో నమోదు చేశారు. చంద్రబాబు పత్రికలు కథనాలు రాసిన అన్ని ఓటర్లు పాత ప్రభుత్వంలో నమోదైనవే. చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు దృత రాష్ట్రుడు అయిపోయాడా?. బండి సంజయ్‌కు కౌంటర్.. తెలంగాణ నుండి పదవి పోయిన బండి సంజయ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూపీలో బీజేపీ చేసినట్టు మేము చేస్తున్నాం అని ఆ బీజేపీ నేత అనుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర జీతానికి కొందరు పనిచేస్తున్నారు. మేము దొంగ ఓట్ల ను చేరిస్తే ఓటర్ల సంఖ్య ఎందుకు పెరగలేదు అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్ -
టీడీపీ దొంగ ఓట్ల అక్రమాలు
-
ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం!
Aadhaar - Voter ID Linking న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. నకిలీ ఓట్లను గుర్తించడమే లక్ష్యంగా ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించడానికే ప్రతిపాదన బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రశంగ సమయంలో మంత్రి పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించేవారంతా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. ఐతే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎమ్ఐఎమ్, ఆర్ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలకు పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లు ద్వారా స్వతంత్ర, రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందనీ, ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానిస్తే భవిష్యత్తులో అనేక ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని వాదించారు. ఐతే అధికార బీజేపీకి పార్లమెంటు ఉభయసభల్లోనూ తగిన బలం ఉంది. అధికార ప్రతిపక్షాల వాదప్రతివాదనల మధ్య నేడు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం బోగస్ ఓట్లను గుర్తించడమేకాకుండా, ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒకే వ్యక్తి ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వం ప్రతిపాధించింది. మరోనిబంధన ఏంటంటే ప్రతీ ఏట నాలుగు తేదీల్లో మాత్రమే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాగా విపక్ష నేతల ఆందోళనలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల సంస్కరణ బిల్లు దేశ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని రచించనుందని చెప్పవచ్చు. చదవండి: ‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు' -
కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి టెన్షన్ రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ పార్టీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు. ఇలాగైనా పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో డబ్బులు, మందు పంపిణీ పూర్తిచేయడంతో పాటు దొంగ ఓట్లు వేయించి లబ్ధిపొందాలని ప్రలోభాలకు తెరలేపారు. నిజానికి.. కుప్పంలో పనులు దొరక్క అనేకమంది బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. వారిలో సుమారు 35 వేల మందికి అటు కుప్పంలోనూ.. ఇటు బెంగళూరులోనూ ఓటు హక్కు ఉంది. అలాగే, వీరికి అక్కడ ఇక్కడ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. పింఛను, బియ్యం రెండుచోట్లా తీసుకుంటున్నారు. దీంతో వీరిలో అధిక శాతం మందిని టీడీపీ నేతలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తుండడంతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత చంద్రమౌళి గుర్తించారు. పక్కా వివరాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో 25 వేల ఓట్లను తొలగించారు. మరో 10వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించలేదు. వారందరినీ టీడీపీ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పిలిపిస్తున్నట్లు సమాచారం. దొంగ ఓటర్లకు ప్రత్యేక శిక్షణ బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి మరో 5 వేల మందితో దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు రవాణా సదుపాయాలుఏర్పాటుచేశారు. ఇలా వచ్చేవారి కోసం కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డులు, స్లిప్పులు సిద్ధంచేసినట్లు సమాచారం. వాటితో సోమవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాక ఏం చేయాలో టీడీపీ నేతలు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లు చేరుకున్నాక.. వారిని ఎవరైనా గుర్తిస్తే వైఎస్సార్సీపీ వారు పంపించారని చెప్పమని తర్ఫీదు ఇచ్చారు. ఎవరూ అడ్డుకోకపోతే సైకిల్ గుర్తుకు ఓటేయమంటున్నారు. వలంటీర్లకు బెదిరింపులు టీడీపీ నేతలు వలంటీర్ల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ తన అనుచరులతో శుక్రవారం రాత్రి ఓ మహిళా వలంటీర్ ఇంటికి వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించారు. శనివారం మరో ముగ్గురు మహిళా వలంటీర్ల నివాసాలకు టీడీపీ నేతలు వెళ్లి బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. కొత్తదారుల్లో నగదు పంపిణీ ఇక ఎన్నికల్లో డబ్బులు పంపిణీని ఇప్పటివరకూ నేరుగా ఇళ్లకు వెళ్లి ఇవ్వడమే చూశాం. కానీ, కుప్పంలో టీడీపీ నేతలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న చిల్లర దుకాణాలు, చిన్నచిన్న బంకులు, మెడికల్ షాపులు, టీ బంకులను కేంద్రాలుగా ఎంచుకున్నారు. టీడీపీ అభ్యర్థులు ఈ దుకాణాల్లో డబ్బులు, పేర్లు, కోడ్ నంబర్లు స్లిప్పై వేసి ఇస్తారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లకు ఓ నంబర్ కోడ్‌తో ఉన్న స్లిప్ ఇస్తారు. దానిని వారు చెప్పిన దుకాణంలో ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ తరహా డబ్బుల పంపిణీ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు అన్ని వార్డులకు రెబల్ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయించారు. వీరంతా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా రెబల్ అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటిస్తారు. వీరిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదు. దీనిని టీడీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేలు టీడీపీ అభ్యర్థి తరఫు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి రూ.50,500 స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే.. ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగిన వారికి పెద్దమొత్తంలో డబ్బులు లేదా బహుమతులు ఇవ్వటానికి టీడీపీ అన్ని ఏర్పాట్లుచేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. -
కోదాడలో దొంగ ఓటు..!
సాక్షి, కోదాడఅర్బన్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో పట్టణంలో బా లుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ బూత్‌లో దొంగ ఓటు పోలైంది. పట్టణంలోని 1వ వా ర్డుకు చెందిన షేక్ సైదులు అనంతగిరి రోడ్డులోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు చెందిన ఓటు బాలుర ఉన్నతపాఠశాలలోని 170/ 90 పోలింగ్ బూత్‌లో 436 సిరియల్ నంబర్లో ఉంది. అతను వేరే ఊరుకు కూలి నిమిత్తం వెళ్లి ఓటు వేసేందుకు ఉదయం 9గంటలకు కోదాడకు చేరుకున్నాడు. తన తమ్మడు మైకు నాగులు వద్ద ఉన్న పోల్ చిట్టీని తీసుకుని పోలింగ్ బూత్ ఓటు వేసేందుకు వెళ్లాడు. తాను క్యూలైన్లో వెళ్లి పోలింగ్ అధికారికి తన ఓటరు చిట్టి ఇవ్వగా సీరియల్ నంబర్‌ను పరిశీలించిన పోలింగ్ సిబ్బంది అప్పటికే ఈ ఓటు వేశారని తెలపడంతో ఆవాక్కయ్యా డు. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న తన తమ్ముడు మైకు నాగులు తన అన్న ఓటు వేసేందుకు ఇప్పుడే వస్తే ఇప్పటికే మరెవరో ఓటు వేయడం ఏమిటని పోలింగ్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తిన ఏజెంట్లు షేక్ సైదులేనని నిర్ధారించడంతో తాము ఆయనతో ఓటు వేయించడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు షేక్ సైదులు తన ఓటు వేరే వారు వేస్తే ఎలా అని, తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో పోలింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. పోలింగ్ అథికారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమస్యను వివరించి ఆయన అనుమతితో సైదులకు చాలెంజ్ ఓటు ఇవ్వడంతో అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చాలెంజింగ్ ఓటు తుంగతుర్తి : అధికారుల తప్పిదంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఓటు వేయకుండా వినియోగించుకున్నట్లు ఓటరు లిస్ట్‌లో ఉంది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కలెంచర్ల సతీష్ గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన ఓటరు స్లిప్‌ను అధికారులకు చూపగా అప్పటికే ఆ విద్యార్థి ఓటు ఈడీసీలో (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఉపయోగించుకున్నట్లు ఓటరు లిస్టు ఉందని చెప్పారు. దీంతో ఓటే వేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ పాండు నాయక్ స్పందించి పోలిం గ్ కేంద్రానికి వెళ్లి ఆ విద్యార్థితో రాతపూర్వకంగా లేఖ రాయించుకుని ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. -
ఫామ్-7 దరఖాస్తులపై ఈసీ విచారణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్-7 దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదుల నేపథ్యంలో ఫామ్-7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం గురువారం విచారణ చేపట్టింది. 8 లక్షల 76 వేల ఫామ్-7 దరఖాస్తులు ఎన్నికల సంఘం వద్దకు రాగా, 45 వేల మంది సిబ్బందితో నిరంతరంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకు 1,61,005 దరఖాస్తుల పరిశీలన జరిగింది. వీటిలో 5309 మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. దాదాపు 1,55,696 నకిలీ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరో నాలుగైదు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి జేకే ద్వివేది ఫామ్-7పై స్పష్టత నిచ్చారు. ఫామ్-7 దరఖాస్తు మాత్రమేనని, ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. నకిలీ దరఖాస్తులపై పోలీసుల కేసులు ప్రారంభం కాగానే దరఖాస్తులు ఆగిపోయాయని వెల్లడించారు. కాగా 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7ను ఉపయోగించారని, ’చూస్తుంటే రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమో'నని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొనం గమనార్హం. -
ఫామ్-7పై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఈవో ద్వివేది
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పని చేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి జేకే ద్వివేది స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ...‘ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా తొలగించలేదు. ఫామ్-7 దరఖాస్తు మాత్రమే. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదు. నకిలీ దరఖాస్తులపై పోలీసుల కేసులు ప్రారంభం కాగానే దరఖాస్తులు ఆగిపోయాయి. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదు. పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫామ్-7పై అభ్యంతరాలు చెబుతున్నారు. బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడ ఓట్లు తొలగించారో విమర్శించేవారు నిరూపించాలి. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉంది. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువమందికి ఓటు హక్కు లేదని గుర్తించాం. ఎన్నికల సంఘంపై అనుమానపడాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఫామ్-7పై ఏపీ సీఈవో ద్వివేది స్పష్టత ఇచ్చారు. ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం ఫామ్-7 దరఖాస్తులు ఇవ్వడం తప్పు కాదు ఫామ్-7 ఇచ్చిన దరఖాస్తులన్ని విచారిస్తాం ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం ఇప్పటివరకు 10 వేల ఓట్లు మాత్రమే తొలగించాం ఫామ్-7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను మాత్రమే తొలగించేందుకు అనుమతి ఇచ్చాం ఫామ్-7 దరఖాస్తులు ఎన్ని ఇచ్చినా నష్టం లేదు తప్పుడు ఫిర్యాదులుపై కేసులు నమోదు చేయగానే దరఖాస్తులు తగ్గిపోయాయి కాగా 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7ను ఉపయోగించారని, ’చూస్తుంటే రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమో'నని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
టీడీపీకి గట్టి షాక్.. రంగంలోకి సైబర్ పోలీసులు!
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నిన అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగగా... ఎన్నికల సంఘం సహా ఆధార్ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. కాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డేటా బ్రీచింగ్కు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన ‘సేవామిత్ర’ అనే యాప్ ద్వారా టీడీపీ ఆంధ్ర ప్రజల సమాచారాన్ని దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. ఆధార్, ఎలక్షన్ కమిషన్ వివరాల ఆధారంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్(ఎస్సార్డీహెచ్)లో నిక్షిప్తమైన డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘సేవామిత్ర’ ద్వారా ఓటర్ల ఐడీ నంబర్లు, పేర్లు, సామాజికవర్గం, కలర్ ఫొటోలు, వారికి సంబంధించిన బూత్ లెవల్ సమాచారం, కుటుంబ వివరాలు, పొందుతున్న ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను సేకరించి టీడీపీ కార్యకర్తలు.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలో ఐటీ గ్రిడ్ ప్రజల వ్యక్తిగత వివరాలు ఎలా సేకరించిందన్న అంశంపై సైబర్ పోలీసులు దృష్టి సారించారు. ఈ విషయం గురించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ... డేటా బ్రీచ్‌కు సంబంధించి ఫిర్యాదు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. -
ఓట్ల దొంగలను వదిలేసి గ్రామస్థులపై పోలీసుల దాడి
సాక్షి, తిరుపతి: సర్వే పేరుతో సంచరిస్తున్న ఓట్ల దొంగలను అడ్డుకునేవారిపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెంలో సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్న వారిని పట్టించిన గ్రామస్తుల ఇళ్లలోకి శుక్రవారం అర్థరాత్రి పోలీసులు చొరబడి తలుపులు పగలకొట్టి దాడులకు దిగారు. నకిలీ సర్వే బృందాన్ని పట్టించిన యువకుడిని బట్టలు ఊడదీసి దారుణంగా చితకబాదారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధులైన బాధితుడి తల్లిదండ్రులను సైతం కొట్టారు. అనంతరం ఆ యువకుడిని అర్థనగ్నంగానే జీపులోకి గెంటేసి కొడుతూ రహస్య ప్రాంతానికి తరలించి వేధించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమీప గ్రామాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పోలీసులు నిష్క్రమించారు. అనంతరం పోలీసుల దెబ్బలతో స్పృహ కోల్పోయిన యువకుడి తల్లిదండ్రులను గ్రామస్థులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం ఓట్ల దొంగలను అడ్డుకున్న గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేసి హింసించడం పట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులతో కలసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ధర్నాకు దిగారు. దీంతో దిగివచ్చిన పోలీసులు హడావుడిగా ముగ్గురు బాధిత యువకులను పాకాల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల దాష్టీకాన్ని ఈ సందర్భంగా బాధితులు న్యాయమూర్తికి కన్నీళ్లతో విన్నవించారు. ‘తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఇళ్లపై దాడులు చేస్తారా?’ అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వెంటనే వారిని వదిలేయాలని ఆదేశించారు. దీంతో కోర్టు ప్రాంగణంలోనే వారిని వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు. స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వేణుగోపాల్‌రెడ్డి ఇంట్లో విరిగిన తలుపు, చెల్లాచెదరుగా వస్తువులు ఆ ట్యాబ్‌లో ఏముంది? ‘గ్రామస్థులు స్వాధీనం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు పంపిన ట్యాబ్‌లో ఏముంది? పోలీసులు అర్థరాత్రి వేళ ఎందుకంత హడావుడిగా చొరబడ్డారు? ఇళ్ల తలుపులను బద్ధలుగొట్టి ట్యాబ్ కోసం బీభత్సం సృష్టించేంత అవసరం ఏం వచ్చింది?..’ అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నియోజకవర్గంలో తొలగించిన 14 వేల ఓట్లకు పైగా దొంగ దరఖాస్తుల గుట్టు అందులో ఉందా? అందుకేనా పోలీసులు అంత ఆదుర్దాగా వచ్చారు? వారికి జిల్లా స్థాయి పోలీస్ బాస్ వంతపాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఎన్నికల సంఘం ఈ ట్యాబ్ గుట్టు విప్పితే ఓట్ల గల్లంతు వెనుక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి.. ‘అధికార పార్టీకి కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్న కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. లేదంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే అవకాశం ఉండదు. ఓట్ల దొంగలను వదిలేసి పట్టించిన వారిపై దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కోర్టు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను వదలి పెట్టాలని ఆదేశించింది. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసుల తీరు పోలీస్ వ్యవస్థకే మచ్చ లాంటిది. వీటన్నింటిని కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి వివక్ష చూపిస్తున్న పోలీస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. మా కార్యకర్తలను వేధించాలని ప్రయత్నిస్తే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. న్యాయస్థానం, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం’ – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి ఎమ్మెల్యే) -
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
-
సర్వేరాయుళ్లకు టీడీపీ అండ!
విజయనగరం, రామభద్రపురం: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగిస్తున్నారని ఓటర్లు ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీనికి సంబంధించి రామభద్రపురం మండలంలో సర్వేరాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. ఓట్లు తొలగించే విధానం ఇదీ అంటూ డెమో కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. టీడీపి నాయకులే ఈ భాగోతానికంతటికీ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని సర్వేరాయుడును స్థానిక టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు శ్రీరాంనగర్ కాలనీకి మంగళవారం తీసుకెళ్లి సర్వే వివరాలు అడిగారు. కాలనీకి చెందిన వారు కొందరు ఆ దొంగ ఓటర్ల సర్వే వ్యక్తి దగ్గర ఉన్న ట్యాబ్‌ను లాక్కొని సర్వేను తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీకి ముఖ్యనాయుకులై ఉండి ఈ పని చేయడం మంచిది కాదని ఆ నాయకుడిని నిలదీశారు. తాను కూడా టీడీపీకి చెందిన వ్యక్తిని అని సర్వే చేయడం మన కోసమే కదా అని సర్వేరాయుడు వారితో చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని కాలనీ వాసులు చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చుతూ ఇంటింటికీ తిరుగుతున్న సర్వే రాయుళ్లను టీడీపీ నాయకులు రక్షణ కల్పించి దగ్గరుండి తీసుకువెళ్లారు. వారిని స్థానిక టీడీపీ కార్యాలయంలో భద్రత కల్పిస్తూ కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగిస్తున్నారన్న బలమైన ఆరోపణలకు ఇదే తార్కాణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఆత్మలకూ ఓటు!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆత్మ’లు ఓటేయడానికి వస్తాయేమో.ఆశ్చర్యంగా ఉందా.. నిజమే. ఘనత వహిస్తున్న అధికార పార్టీ కుటిలత్వంతో జిల్లాలో ఆత్మలకూ ఓటు హక్కు కల్పించారు. బతికున్న వారి ఓట్లు ఎక్కడున్నాయో తెలియదు కానీ కాలం చేసిన వారి ఓట్లు మాత్రం పదిలంగానే ఉన్నాయి. అధికార పార్టీ ఓట్లూ భద్రంగానే ఉన్నా... ప్రతిపక్షం ఓట్లు మాత్రం గల్లంతవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికి కొంత మంది అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నెల్లూరు(పొగతోట): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అ«ధికార పార్టీ కుట్రలు పన్నుతోంది. అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు అధికారులను పావులుగా వాడుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించే కుటిల చర్యలు చేపడుతోంది. ఓటర్ల జాబితాను అనుకూలంగా సిద్ధం చేస్తోంది. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులకు ఓటు హక్కు కల్పించారు. ఇంత వరకు వారికి ఐడీ కార్డులు రాలేదు. కార్డుల కోసం ప్రజలు మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో నివసిస్తున్న వారికీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి. జిల్లాకు చెందిన చక్రవర్తి కుటుంబం తెలంగాణలో నివాసం ఉంటోంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రవర్తి కుటుంబమంతా ఓటు హక్కు వినియోగించుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఓటు హక్కు పొందారు. పంచాయతీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉదయగిరి, ఎస్ఆర్పురం, డక్కిలి, బోగోలు, అల్లూరు మండలాల్లో మరణించిన వారి ఓట్లు ఇప్పటికీ తొలగించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 లక్షల ఓట్లు తొలగించారు.. జిల్లాలో గతేడాది సుమారు 2 లక్షలకుపైగా ఓట్లు తొలగించారు. తొలగించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో వారిలో కొంత మందికి ఓటు హక్కు లభించింది. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 22,06,652 మంది ఓటర్లు ఉన్నారు. 2017లో జిల్లాలో 20,44,122 ఓటర్లు ఉండగా.. 2018లో 20,09,464 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించారు. ఈ విషయంపై ‘సాక్షి’ అనేకపర్యాయాలు కథనాలు ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న ఓటర్ల జాబితాల్లో ఓటు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో ఓటు నమోదు కాలేదు. జాబితాలో పేర్లు ఉన్నా.. ఇంత వరకు ఓటరు ఐడీ కార్డులు మంజూరు కాలేదు. ఆన్లైన్లో పరిశీలిస్తే డిపార్ట్మెంట్ పెండింగ్ అని సమాధానం వస్తోంది. అధికార పార్టీకి సంబంధించిన వారికి గ్రామాల్లో.. పట్టణాల్లో రెండు చోట్ల ఓట్లు కల్పించుకున్నారు. ఇటువంటి ఓట్లు జిల్లా వ్యాప్తంగా 40 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారు ఉదయం నగరంలో.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఓటు వేయించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు కులాల వారీగా ఓట్లు చీల్చి తొలగించారు. నగరంలోని ఓటర్ల జాబితా గందరగోళంగా ఉంది. కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు ఉన్నాయి. సమీపంలోని పోలింగ్ బూత్‌లో ఓటు ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. అందుకు విరుద్ధంగా నగరంలోని ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. భర్త ఓటు బాలాజీనగరలో ఉంటే భార్య ఓటు నవాబుపేటలో ఉంది. నగరంలోని ఓటర్ల జాబితాను ఆ విధంగా సిద్ధం చేశారు. ఓటు హక్కు ఉన్న వారందరికీ కార్డులు మంజూరు చేస్తాం. కొత్తగా వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను పరిశీలించాం. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాం. ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు పంపించాం. ఎన్నికల కమిషన్ ఓటర్ల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది. ఆన్లైన్లో వస్తే ఓటర్లకు ఐడీ కార్డులు మంజూరవుతాయి. మీసేవ కేంద్రాల నుంచి ఓటరు ఐడీ కార్డుల పొందవచ్చు. ఎస్వీ నాగేశ్వరరావు, డీఆర్వో -
ఏపీలో అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు. ఆ తరువాత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ఓ ఓటరుకు 351 ఏళ్ల వయసు ఉన్నట్టుగా జాబితాలో నమోదు చేశారని, 18 సంవత్సరాలలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఇంటి నంబర్లు లేకుండా కూడా పలువురి ఓట్లను నమోదు చేశారని తెలిపారు. నకిలీ ఓట్లను తాము 12 రకాల పద్ధతుల ద్వారా గుర్తించామని తెలిపారు. ఒకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇటువంటి ఓటర్లు 9,552 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నంబరు, జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 52,180 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,224 ఉన్నారని, ఇతర వివరాలు ఒకేలా ఉండి తండ్రి లేదా భర్త పేరు మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,78,868 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు ముందుకు, వెనుకకు మారిన నకిలీ ఓటర్లు (ఉదాహరణకు వరలక్ష్మి కొండేటి– కొండేటి వరలక్ష్మి) వంటివి 1,69,448 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు ఒకే విధంగా ఉండి, ఇతర వివరాలు వేరే విధంగా ఉన్న ఓటర్లు 25,17,630 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి ఇంటి నంబరులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 4,49,126 ఉన్నారని, ఓటరు పేరు పలకడానికి ఒక రకంగా, ఒకటి రెండు అక్షరాల మార్పులతో ఉండే నకిలీవి 2,36,626 ఉన్నాయని వివరించారు. ఇంటి నంబరు తప్పు ఉన్న ఓటర్లు 2,15,119 ఉన్నారని చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. -
నకిలీ ఓట్లను తొలగించండి
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో అధికారులను లోబరుచుకుని ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్పించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఏపీ ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో 54,63,579 నకిలీ ఓట్లు ఉన్నట్లు ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్(వాస్ట్) అనే సంస్థ గుర్తించిందని తెలిపారు. ఓటర్ల పేర్లలో చిన్నచిన్న మార్పులు చేసి నకిలీ ఓట్లను చేర్చారని విమర్శించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాలను రూపొందించాలని కోరారు. తెలంగాణలోని ఓటర్లలో 20,07,395 మంది ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒక్కరికి ఒకే ఓటు ఉండాలని అన్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఏకంగా 78,156 ఓట్లు ఉన్నట్లు పార్టీ ‘వాస్ట్’ సంస్థ గుర్తించిందని వెల్లడించారు. ఒకే నెంబరు ఓటరు ఐడీ కార్డుతో రెండు ఓట్లు ఉన్న వ్యక్తులు 9,552 మంది ఉన్నారని, ఒక్క అక్షరం మార్పుతో ఒకే పేరు కలిగిన వ్యక్తులు 19,45,586 మంది ఉన్నారని తెలిపారు. ఏపీలో ఓటర్ల జాబితాలు తప్పులతడకలుగా మారాయని అన్నారు. ఓటర్ల జాబితాల్లో తప్పులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) హామీ ఇచ్చారని అంబటి రాంబాబు తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. సమయం ఇస్తే.. ‘వాస్ట్’ సంస్థ వచ్చి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సీఈవోకు వివరించినట్లు తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సీఈవోను కోరామని చెప్పారు. ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ట ద్వివేదీ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఒటర్ల జాబితాలో తప్పులు ఉంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘బాబో’య్.. దొంగ ఓట్ల దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అవినీతి అక్రమాలతో నిండా మునిగిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు ప్రతిచోటా ప్రజాభిమానాన్ని పాలకులు కోల్పోయారు. ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్న టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఏదో ఒకటి చేసి మళ్లీ తామే అధికారంలో ఉండాలన్న యావతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కాలి. ఏదో ఒకటి చేసి మరోసారి గద్దెనెక్కాలనే దుర్బుద్ధితో సామ,దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఈక్రమంలో తమకు అనుకూల ఓట్లును పదిలంగా ఉంచి, విపక్షాల ఓట్లను తొలగించారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. అది చాలదన్నట్టుగా దొంగ ఓట్లను చేర్పించి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. నకిలీ ఓట్ల బాగోతం నకిలీ ఓట్లను అనేక రకాలుగా చేర్చారు. తమకొచ్చిన బోగస్ ఆలోచనలన్నీ పక్కాగా అమలు పరిచారు. ఈ అక్రమాలన్నీ ‘ఓటర్ అనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్) సంస్థ చేసిన అధ్యయనంలో తేలాయి. దాదాపు పది రకా లుగా నకిలీ ఓట్లు చేర్పించినట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఆ సంస్థ జరిపిన పరిశీలనలో ఈ జిల్లా కు సంబంధించిన అనేక నకిలీ ఓట్లను గుర్తించిన విషయం బహిర్గతం కావడంతో చర్చనీ యాంశమయింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలువెలుగు చూశాయి. మచ్చుకు కొన్ని.. ♦ తొండంగి మండలం 148 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబర్లు 24,76లో మణి తలపంటి పేరుతో రెండు ఓట్లు ఉన్నాయి. బూత్ నంబరు 146లో సీరియల్ నంబరు45, 462లో నాగలక్ష్మి నట్టే పేరుతో రెండు ఓట్లున్నాయి. ♦ కోటనందూరు మండలంలో బూత్ నంబరు 1లో సీరియల్ నంబర్లు 378,379,987లో జేకే కీర్తి చింతకాయల పేరుతో నాలుగు ఓట్లు నమోదై ఉన్నాయి. ♦ కరప మండలంలో పోలింగ్ కేంద్రం 233లో, సీరియల్ నెంబర్ 712తో ఓటర్ ఐడీ ఐఎంజడ్ 0441592, డోర్ నెంబర్ 3–89, కృష్ణవేణి కొంపెళ్ల (46), భర్త సూర్యనారాయణ కామేశం పేరుతో ఓటు నమోదైంది. అదే పేరుతో మండపేట పోలింగ్ కేంద్రం 9లో సీరియల్ నెంబర్ 1051తో ఓటర్ ఐడీ ఐఎంజడ్ 0441592పై మరో ఓటు నమోదయింది. ♦ ఇలా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఒకే పేరుతో రెండేసి, మూడేసి, నాలుగేసి ఓట్లు నమోదయ్యాయి. ఆన్లైన్, ఆధార్, కంప్యూటరైజేషన్ వంటి సాంకేతికత పెరిగినా బోగస్ ఓట్లు చేరాయంటే అక్రమార్కులు ఎంత తెలివిగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా చూస్తే నకిలీ ఓట్లతో ఎంత తప్పుల తడకగా నిండి ఉందో స్పష్టమవుతోంది. అధికార పార్టీ యంత్రాంగం ఏదో విధంగా మళ్లీ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా తమకు అనుకూలమైన ఓటర్లను రెండు నియోజకవర్గాల జాబితాల్లో కొనసాగిస్తున్నట్టు సమాచారం. ♦ ఉదాహరణకు కాకినాడ రూరల్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి పేరుతో కాకినాడ టౌన్లోనో, వేరే ఊరులోనో నమోదు చేయించినట్లు ఓటర్ జాబితాలో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఒకే పేరుతో తండ్రి పేరుమార్చి నమోదు చేయడం, వేరే గ్రామంలో ఉండేవారి పేర్లు నమోదు చేయించడం, వయస్సురాకుండా ఓటు నమోదు తదితర వాటిని బోగస్ ఓట్లుగా గుర్తిస్తారు. ఓటర్ల జాబితాలను సరిచూస్తుంటే ఒకే వ్యక్తి వేర్వేరు చోట్ల నమోదైన వివరాలు ఎలా నమోదయ్యాయి...సాంకేతికత ఏమయిందని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు. ఓటు తొలగించారు ఓటు వచ్చాక పలు ఎన్నికల్లో వినియోగించాను. 2014 ఎన్నికల్లో ఓటు వేశాను. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఓటు తొలగించారు. అధికార పార్టీ నాయకుల ఓత్తిడి మేరకు అధికారులు ఇలా చేశారు. ఓటరు కార్డు ఉంది. ఓటు మాత్రం లేదు.– మానేశ్వరరావు బోదపు, తుని పట్టణం ఇది దారుణం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా జాబితాలో తొలగించారు. ఎప్పటి నుంచో తుని పట్టణంలో ఉన్నాను. చాలా ఎన్నికల్లో ఓటు వేశాను. ఇప్పుడు ఎందుకు తొలగించారో తెలియడం లేదు. బూత్ లెవెల్ అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.–శ్యామ్ సుందర్ డిశెట్టి, తుని పట్టణం -
తిరుపతిలో మళ్లీ బోగస్ ఓటర్లు!
తిరుపతి సెంట్రల్ : తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో పాలకపక్ష జోక్యం ఎక్కువైందా అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు. అధికారమే పరమావధిగా పాలకపక్షం బరి తెగిస్తోందని ఆరోపిస్తున్నాయి. అధికారులను అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. పైగా తమ సానుకూల ఓటర్లను పాలకపక్ష ప్రతినిధులు పనిగట్టుకుని తొలగిస్తున్నారని చెబుతున్నాయి. గత అనుభవాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నాయి. తాజా గా ప్రతిపక్షాలు నిర్వహించిన సర్వేలో 20 వేల ఓట్లపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో భారీగా బోగస్ ఓటర్లు గత ఎన్నికల సమయంలో 2.76 లక్షల ఓటర్లతో యంత్రాంగం జాబితాను రూపొందిం చింది. పోలింగ్ విషయానికి వచ్చే సరికి 50–55 శాతం దాటని పరిస్థితి. ఇది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయేది. బోగస్ ఓటర్లతో జాబితా తయా రు కావడమే ఇందుకు ప్రధాన కారణమని ఎట్టకేలకు ఎన్నికల సంఘం గుర్తించింది. తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు నాటి యంత్రాంగం పసిగట్టింది. ఫిర్యాదుల ఆధారంగా స్పందించింది. 2015–16లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్ కింద ఇంటింటికీ వెళ్లి పరిశీలించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో 2.76 లక్షల ఓట్లలో 70 వేల పై చిలుకు ఓట్లు బోగస్‌వేనని తేలిపోయింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు కావడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో బోగస్ ఓట్లను యంత్రాంగం జాబితా నుంచి తొలగించింది. ఆ తర్వాత ఓటర్ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే అంశాన్ని యంత్రాంగం పరిశీలించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అది అమల్లోకి రాలేదు. మళ్లీ 20 వేలకుపైగా ఓట్లపై అభ్యంతరాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ బోగస్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు సమాచారం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 256 పోలింగ్ కేంద్రాల పరిధిలో 20 వేలకు పైగా ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరణించిన 1,326 మందికి ఓటు హక్కు ఉండడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత జాబితాలోని 9, 491 మంది ఓటర్ల అడ్రస్‌లను గుర్తించడం యం త్రాంగానికీ సాధ్యపడడం లేదు. గతంలో సదరు ఓటర్లు తప్పుడు అడ్రస్‌లను సమర్పించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 1,463 ఓటర్ల పేర్లు రెండేసి సార్లు లేదంటే అంత కు మించి జాబితాలో నమోదు కావడం గమనా ర్హం. అదనంగా మరో 8, 504 మంది ఓటర్లు ఇత ర అడ్రస్‌లకు మారినట్టు చెబుతున్నా ప్రస్తుతం వారంతా నియోజకవర్గ పరిధిలోనే నివాసముంటన్నదీ లేనిదీ గుర్తించాల్సి ఉంది. ఒకే అడ్రస్‌పై పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదు కావడం, ఖాళీ స్థలా లనే నివాస ప్రాంతాలుగా చూపి ఓటర్లుగా చేర డం వంటి పరిస్థితులు తలెత్తాయి. జాబితా సవరించాలనివైఎస్సార్ సీపీ డిమాండ్ బోగస్ ఓట్లను తక్షణమే తొలగించి జాబితా ను సవరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది. అవసరమైతే కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించింది. న్యాయ పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని హెచ్చరిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనపై తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ చంద్రమోహన్ స్పందిస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందేలా చర్యలు చేపడుతామని చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే సార్వత్రిక ఎన్నికల నాటికి అభ్యంతరాల ఆధారంగా ఓటర్ల జాబితాను సవరిస్తామని స్పష్టం చేశారు. -
అ‘ధర్మవరం’
ధర్మవరం: ‘ఓటు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు! ప్రజాక్షేత్రంలోకి వెళితే తిరస్కరణ తప్పదు’ అని భావించిన ధర్మవరం అధికార పార్టీ నేతలు.. ఈ సారి ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. నకిలీ ఓటర్లను సృష్టించి మరోసారి గద్దెనెక్కేందుకు అనైతిక పనులకు తెరలేపారు. ఇందులో భాగంగానే తమ మాట వినని బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)లపై కక్ష సాధింపులు మొదలు పెట్టారు. వారికి పని రాదంటూ పొగపెట్టి సాగనంపసాగారు. బీఎల్వోలుగా చిరుద్యోగులు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల పరిధిలో మొత్తం 285 పోలింగ్ బూత్‌లున్నాయి. వీటి పరిధిలో మొత్తం 285 మంది బీఎల్ఓలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు బూత్‌లెవల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. నూతన ఓటర్లను గుర్తించి, ఓటరు జాబితాలో వారిని చేర్చడం. గ్రామంలో లేని వారిని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించడం చేస్తుంటారు. వేధింపులతో వైదొలిగిస్తూ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బూత్ లెవల్ ఆఫీసర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు, గ్రామాలు వదిలి వెళ్లిన వారి పేర్లను జాబితాలో కొనసాగించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. అదే సమయంలో తమకు ఓటు వేయని వారిని జాబితా నుంచి తొలగించేందుకు బీఎల్వోలపై ఒత్తిళ్లు తీసుకెళ్లసాగారు. తమమాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. ధిక్కరించిన వారిపై వేధింపులు మొదలు పెట్టారు. చివరకు బలవంతంగా వారిని ఉన్నతాధికారుల ఎదుట హాజరు పరిచి బీఎల్ఓగా పనిచేయడం తమకిష్టం లేదంటూ సంతకాలు పెట్టించుకుని, వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోసాగారు. ఇలా ధర్మవరం మున్సిపాలిటీలో వంద మంది బీఎల్వోలు ఉండగా వారిలో 12 మందితో తమకు పనిరాదనే సాకును బలవంతంగా వారితోనే చెప్పించి విధుల నుంచి తప్పించారు. నకిలీ ఓటర్ల చేర్పులకు టార్గెట్ ఓటర్ల చేర్పులు, తొలగింపు వ్యవహారంలో అధికారపార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. తమ మాట వినని బీఎల్వోలను, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ను ఇప్పటికే ఇక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. తిరిగి తమకు అనుకూలమైన వారిని ఆయా పోస్టులో కూర్చోబెట్టి నకిలీ ఓటర్లను చేర్చేందుకు వ్యూహం పన్నారు. ఒక్కొక్కరు వంద నుంచి, రెండు వందల ఓటర్లను చేర్చించాలని దిగువస్థాయి నాయకులకు «టార్గెట్లు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సదరు దిగువస్థాయి నాయకులు తమకు అనుకూలంగా ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారివి, ధర్మవరం పట్టణానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో బీఎల్‌వోలది కీలక పాత్ర.. వారు అనుకూలంగా వ్యవహరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగల్గుతారు. వారు వ్యతిరేకిస్తే తమ పని జరగదని భావించిన అధికార పార్టీ నేతలు ఈ తొలగింపుల పర్వానికి తెరలేపారు. -
60 లక్షల నకిలీ ఓటర్లు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 230 నియోజకవర్గాల్లో 60 లక్షల నకిలీ ఓటర్లను ప్రభుత్వం నమోదుచేసిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ నేతృత్వంలో ఈసీని ఆదివారం కలసిన కాంగ్రెస్ బృందం.. నకిలీ ఓటర్లకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించింది. ఈ 60 లక్షల పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నకిలీలను తొలగించేందుకు ప్రత్యేకమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేసింది. -
బాబోయ్... నకిలీ ఓటర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుత చట్టసభ పదవీకాలం ఈ ఏడాది మే 22వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ఓటు హక్కు కలిగే రోజుగా పరిగణించి 18 ఏళ్లు నిండిన వారిద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్లుగా ఓటర్ల జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితాను గత నెల 20వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాలో 40 లక్షల వరకు నకిలీ ఓటర్లు ఉన్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఆనాడే విమర్శించారు. అలాగే నకిలీ ఓటర్లను తొలగించాల్సిందిగా డీఎంకే నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించగా, కొందరు కోర్టులో పిటిషన్లు వేసారు. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకై గత నెల 31, ఈనెల 6వ తేదీన ప్రత్యేక శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో సుమారు 8 లక్షల మంది ఓటర్లు పలు అంశాల్లో మార్పులు, చేర్పులపై దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 75వేల మంది అనేక చోట్ల తమకు ఓటు ఉన్నదని, వాటిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2009 నుండి తమిళనాడులో నివసించే వారి జాబితాను పోల్చిచూస్తూ నకలీ ఓటర్ల ఏరివేతకు పూనుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సోమవారం చెప్పారు. గత జాబితాతో పోల్చుకుంటే చనిపోయిన లక్షమంది ఓటర్ల పేర్లు చెన్నై జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. నకిలీ ఓటర్ల తొలగింపుకు అనేక చర్యలను చేపట్టామని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు చనిపోయిన ఓటర్ల జాబితాను అందజేశామని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు సైతం ఈ పేర్ల జాబితాను అందజేస్తామని అన్నారు. నేతలు ఆ జాబితాను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద సుమారు 6 లక్షల మంది నకిలీ (చనిపోయిన వారు) ఓటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలు: ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ నేతృత్వంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారు. చెన్నైలోని రిప్పన్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. -
నకిలీ ఓటర్లకు చెక్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానానికి విఘాతం కలిగించే నకిలీ ఓటర్లకు చెక్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్‌లఖానీ ఆదేశించారు. ఓటర్ల జాబితాలోని నకిలీ ఓటర్లను వెంటనే తొలగింపునకు ప్రజలు, పార్టీ నేతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులకు ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా తరగతులను నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన అధికారులు జిల్లా స్థాయిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణనిస్తారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు శిక్షణ ముగిసినందున ఉన్నతాధికారులందరితో రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ నాలుగు విడతలుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారనే గతంలో ప్రకటించి ఉన్నారు. ఈ మేరకు మూడు దశల్లో సమావేశాలు ముగిసిపోగా చివరి సమావేశాన్ని చెన్నై రాజాఅన్నామలైపురంలో గురువారం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో చురుకుగా వ్యవహరించడం, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా రక్షణ కల్పించడం, మూడేళ్ల కాలపరిమితి దాటిన అధికారులను బదీలీ చేయడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్‌లఖానీ మీడియాతో మాట్లాడుతూ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు అందాయని అన్నారు. ఒకే ఓటరు పేరు రెండుచోట్ల ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా తొలగిస్తామని తెలిపారు. మృతి చెందిన వారి పేర్లను ఆన్లైన్ ద్వారానే తొలగిస్తున్నామని చెప్పారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే చర్యలు చేపట్టుతున్నామని అన్నారు. నకిలీ ఓటర్ల తొలగింపునకు ప్రజలు, పార్టీ నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నేతల ప్రచారానికి, వాహనాల అనుమతి, ఎన్నికల ఖర్చును నమోదు చేసేందుకు సరికొత్త విద్యుత్ యంత్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ యంత్రం వినియోగానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరివున్నామని తెలిపారు. ఈ యంత్రం వినియోగంపై గురువారం నిర్వహించిన సమావేశంలో అధికారులకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, విళుపురం, తిరువన్నామలై, వేలూరు, కృష్ణగిరి..ఈ 8 జిల్లాల నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులు, డీఆర్వోలు హాజరయ్యారు. -
ఓట్లు తొలిగింపు అవాస్తవం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అర్హులైన వారి ఓట్లు తొలగించినట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేయవచ్చని మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, ఆధార్ అనుసంధానం ద్వారా 89,085 నకిలీ ఓటర్లను గుర్తించామని చెప్పారు. నకిలీ ఓటర్లను మాత్రమే తాము తొలగించామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టంచేశారు. -
ఈసీ కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీరంగం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో నకీలీ ఓటర్లున్నారని ఆరోపణలు వచ్చినందున కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఆదేశించారు. అనేక సవరణలతో ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, ముఖ్యంగా ఉప ఎన్నికలు జరుగుతున్న శ్రీరం గం నియోజకవర్గ పరిధిలో 9 వేల మంది నకిలీ ఓటర్లు చేరిపోయారని డీఎంకే తరపున ఆ పార్టీ నేత ఆర్ఎస్ భారతి ఈనెల 19న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించింది. నకిలీ ఓటర్ల పేర్లను ఫొటోలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. నకిలీ ఓటర్ల జాబితా సైతం సిద్ధం అవుతోంది. అయితే ఒకే ఊరును అనేక పేర్లతో పిలుస్తున్న కారణంగా నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ఉప ఎన్నిక జరిగే శ్రీరంగంను తిరువరంగం అని కూడా సంబోధించడంతో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, న్యాయశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఊరిపేర్లను గుర్తించేందుకు ఒక బృందం సిద్ధమైంది. ఒక ఊరిని ఇలాగే పిలవాలి, రాతల్లో సైతం ఇలాగే పేర్కొనేలా ఉత్తర్వులను ఈ బృందం జారీ చేస్తుంది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టనున్నారని సందీప్ సక్సేనాను మీడియా ప్రశ్నించగా, డీఎంకే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తిరుచ్చిరాపల్లి జిల్లా క లెక్టర్‌ను ఆదేశించానని తెలిపారు. ఈ ఆదేశాల మేరకు శ్రీరంగం నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి కొత్త జాబితాను సిద్ధం చేయనున్నామని తెలిపారు. ఒకే ఓటరు పేరు రెండుచోట్ల ఉండడం, మరణించిన వారు, ఇంటి చిరునామా మారిన వారి పేర్లను తొలగించకుంటే వారికోసం వేరుగా మరో జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. శ్రీరంగంలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైనందున ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగా నకిలీ ఓటర్లను గుర్తించి శ్రీరంగం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లకు వారి వివరాలను పంపుతామన్నారు. నకిలీ ఓటర్లు ఓటువేయకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఒకే ఊరికి రెండు మూడు పేర్లు ఉన్నందున తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని, అధికారికంగా ఊరిపేర్ల ఖరారు తరువాత మరింత మంది నకిలీ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అలాగే ఈనెల 18వ తేదీ వరకు ఓటర్లుగా చేరిన వారికి కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. పరిశీలకునిగా శ్రీధర్ ధోరా శ్రీరంగంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పరిశీలకునిగా శ్రీధర్ దోరాను నియమించామని, ఆయన 18వ తేదీ నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఏమైనా ఫిర్యాదులు చేయదలుచుకుంటే 9438917128 నెంబరుకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. ప్రధాన పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సింగ్ అనే ఐఆర్ఐ అధికారిని నియమించారని, ఈనెల 27న సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే శ్రీరంగంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు చెక్‌పోస్టులతో నిఘా పెట్టినట్లు చెప్పారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపుతామని తెలిపారు.