ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు.