కోదాడలో దొంగ ఓటు..!

Fake Votes In Kodada Polling Center - Sakshi

సాక్షి, కోదాడఅర్బన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో పట్టణంలో బా లుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ బూత్‌లో దొంగ ఓటు పోలైంది. పట్టణంలోని 1వ వా ర్డుకు చెందిన షేక్‌ సైదులు అనంతగిరి రోడ్డులోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు చెందిన ఓటు బాలుర ఉన్నతపాఠశాలలోని 170/ 90 పోలింగ్‌ బూత్‌లో 436 సిరియల్‌ నంబర్‌లో ఉంది. అతను వేరే ఊరుకు కూలి నిమిత్తం వెళ్లి ఓటు వేసేందుకు ఉదయం 9గంటలకు కోదాడకు చేరుకున్నాడు. తన తమ్మడు మైకు నాగులు వద్ద ఉన్న పోల్‌ చిట్టీని తీసుకుని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసేందుకు వెళ్లాడు. తాను క్యూలైన్‌లో వెళ్లి పోలింగ్‌ అధికారికి తన ఓటరు చిట్టి ఇవ్వగా సీరియల్‌ నంబర్‌ను పరిశీలించిన పోలింగ్‌ సిబ్బంది అప్పటికే ఈ ఓటు వేశారని తెలపడంతో ఆవాక్కయ్యా డు. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న తన తమ్ముడు మైకు నాగులు తన అన్న ఓటు వేసేందుకు ఇప్పుడే వస్తే ఇప్పటికే మరెవరో ఓటు వేయడం ఏమిటని పోలింగ్‌ సిబ్బందిని నిలదీశాడు.

వారు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తిన ఏజెంట్లు షేక్‌ సైదులేనని నిర్ధారించడంతో తాము ఆయనతో ఓటు వేయించడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు షేక్‌ సైదులు తన ఓటు వేరే వారు వేస్తే ఎలా అని, తనకు చాలెంజ్‌ ఓటు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేయడంతో పోలింగ్‌ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. పోలింగ్‌ అథికారులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమస్యను వివరించి ఆయన అనుమతితో సైదులకు చాలెంజ్‌ ఓటు ఇవ్వడంతో అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

చాలెంజింగ్‌ ఓటు
తుంగతుర్తి : అధికారుల తప్పిదంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఓటు వేయకుండా వినియోగించుకున్నట్లు ఓటరు లిస్ట్‌లో ఉంది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కలెంచర్ల సతీష్‌ గురువారం ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ  తన ఓటరు స్లిప్‌ను అధికారులకు చూపగా అప్పటికే ఆ విద్యార్థి ఓటు ఈడీసీలో (పోస్టల్‌ బ్యాలెట్‌) ద్వారా ఉపయోగించుకున్నట్లు ఓటరు లిస్టు ఉందని చెప్పారు. దీంతో ఓటే వేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్‌ పాండు నాయక్‌  స్పందించి పోలిం గ్‌ కేంద్రానికి వెళ్లి ఆ విద్యార్థితో రాతపూర్వకంగా లేఖ రాయించుకుని ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top