
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పించారు.
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్ల మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QyLN6VXHR4
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 13, 2025