ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు | YSRCP Mancha Naga Malleswari Fires On Chandrababu Government Over MLA Koona Ravikumar Incident | Sakshi
Sakshi News home page

ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

Aug 17 2025 6:07 PM | Updated on Aug 17 2025 8:48 PM

YSRCP Mancha Naga Malleswari Fires On chandrababu government

సాక్షి,విశాఖ: మహిళల్ని వేధించేందుకే టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల టీడీపీ ఎమ్మెల్యేల దురాగతాలపై మంచ నాగ మల్లేశ్వరి స్పందించారు.

‘ఎమ్మెల్యే కూన రవి కుమార్ మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించారు. పనులు కావాలంటే తమ కోరికలు తీర్చాలని మహిళలను టీడీపీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. దళిత మహిళ ఉద్యోగిని అని చూడకుండా అందరి ముందు అవమానించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వల్ల ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను లైంగికంగా వేధించారు.

ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు. టీడీపీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగిన హోం మంత్రి స్పందించలేదు.చేతగాని హోం మంత్రి రాజీనామా చేయాలి’అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement