
విజయవాడ: టీడీపీలో ఇప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు మరింత అగ్గి రాజేస్తుంది. ఒక ఖైదీ పెరోల్ కోసం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేయడం ఇప్పుడు అధికార కూటమి పార్టీలో కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర బయటపడింది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంలో టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు వ్యవహారాన్ని హోంశాఖ అధికారులు బయటపెట్టారు. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ పై విచారణ నివేదిక ఇవ్వనున్నారు హోంశాఖ కార్యదర్శి.
డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంవో విచారణకు ఆదేశించగా ఎమ్మెల్యేల వ్యవహారం బహిర్గతమైంది. హోంమంత్రి ఫైల్ సర్క్యులేట్ చేసినట్టు శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వెల్లడించిన నేపథ్యంలో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే అని నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబును డైలమాలో పడేసింది. అధికారులపై నెట్టేసే యత్నం ఎల్లో మీడియా చేసినా అంతటి ఘనకార్యం చేసింది టీడీపీ ఎమ్మెల్యేనని బయటపడటంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.