breaking news
-
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
‘నాకు లేని ల్యాప్‌టాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్‌ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్‌లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
‘అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు హుషారుగా ఉన్నారు’
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం. ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు. -
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్‌ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
కూన రవి శారీరకంగా.. మానసికంగా వేధించాడు: ప్రిన్సిపాల్ సౌమ్య
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ రెజిటీ సౌమ్య తెలిపారు. శనివారం ఆమె మీడియా ముందుకు వచ్చారు. కూన రవి వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వేధింపులపై సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని సౌమ్య డిమాండ్ చేశారు. 2013 నుంచి ప్రిన్సిపాల్‌గా తాను పనిచేస్తున్నానని ఇంతవరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదన్నారు.‘‘రెండు నెలులుగా వేధింపులకు గురవుతున్నా.. వేధింపుల్లో భాగంగానే నన్ను బదిలీ చేశారు. ఎంత మానసిక ఒత్తిడి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. నేను సాధారణ మహిళను.. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే నాపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలి. ఎంక్వయిరీ చేయకుండా ఎలా నాపై ఆరోపణలు చేస్తారు?’’ అంటూ సౌమ్య ప్రశ్నించారు.‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుకే విచారణ చేయించాలని ధైర్యంగా చెప్తున్నా. స్కూల్‌కు నేను సరిగా వెళ్ళననని ఎమ్మెల్యే కూన రవికుమార్ అబద్ధం చెబుతున్నారు. నా స్కూల్ అటెండెన్స్ సీఎస్ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశానుఅదికూడా చూడండి. ప్రతీ రోజు పెట్టే ఫుడ్ కూడా మెనూ ప్రకారం పెడుతున్నా.. అది ప్రతి రోజు ఫొటోలు కూడా మాపై అధికారులకు పెట్టాను. పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేశానని నాపై ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయించారు. ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు. ఎస్ఎంసీ చైర్మన్ పరం నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు స్కూల్‌కి వచ్చి క్లాస్ రూమ్‌ల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు...ఎమ్మెల్యే నా ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా వివాహం గురించి కూడా తప్పుగా మాట్లాడారు. నా భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోవడానికి నన్ను మోసం చేశారు. అతను ఇప్పుడు వేరే మహిళను పెళ్లి కూడా చేసుకున్నారు. రాత్రిపూట ఒక ఎమ్మెల్యే మహిళలకు వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఏంటి?. పొందూరులో ఓసారి రాత్రి 10 గంటల వరకు కూడా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. నా సర్వీస్‌లో ఇంతవరకు ఎలాంటి తప్పు చేయలేదు ఈ రెండు నెలల నుంచే నేను వేధింపులకు గురవుతున్నా. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడినా నాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు...కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. అక్కడ పని చేస్తున్న వారు ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత సామాజిక వర్గం కావడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నేను స్కూల్‌కు వెళ్లాను. సెలవు రోజుల్లో (శనివారం రక్షా బంధన్) నాకు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టారు...rjd ఆర్ఐడీ విచారణ జరగకుండా నన్ను ఎందుకు బదిలీ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేకి రాత్రి కదా వీడియో కాల్ వద్దు.. ఆడియో కాల్ చేయమని అడిగాను. లేదు వీడియో కాల్లోకి రావాలని ఒత్తిడి చేశారు. నా కులం విషయంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో రవి కుమార్ నన్ను దూషించారు..సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ స్పందించి నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు జరిగిన అన్యాయంపై మాత్రమే మాట్లాడాను.గ వేధింపులపై జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశాను. కలెక్టర్‌ను ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు’’ అని సౌమ్య తెలిపారు. -
స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్‌కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు. -
తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్‌లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్‌కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్‌ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఐ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు. The passing of CPI leader and former MP Comrade Suravaram Sudhakar Reddy Garu is deeply saddening. His contributions to politics and the Communist movement will always be remembered.My heartfelt condolences to his family. May his soul rest in peace. pic.twitter.com/k5ssa78oMZ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
‘సొంతపార్టీ అధికార ప్రతినిధి ఆవేదనపై చంద్రబాబు స్పందించాలి’
తిరుపతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులు చేస్తున్న చీకటి బాగోతాలపై తెలుగదేశం అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలపై సీఎం స్పందించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్ళలో వారితో రాసలీలలకు పాల్పడుతున్న సదరు మంత్రిపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే, వారిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. పెద్దపెద్ద హోటళ్ళలో బస చేసే సదరు మంత్రి, తన పక్క రూంలను బుక్ చేసుకుంటూ, ఆ గదుల్లో మద్యం సేవించి, మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశాలపై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశంను సుధాకర్ రెడ్డి బహిరంగ పరిచారు. ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే హైదరాబాద్‌లో రాసలీలలకు పాల్పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఒక పత్రికలోనే దీనిపై పెద్ద ఎత్తున కథనం కూడా ప్రచురితం అయ్యింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తిరుపతికి తరచుగా వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, నైతిక అంశాలను మాట్లాడి వెడుతుంటాడు. అలాంటి మంత్రి గురించే టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్ట్ ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే కీలకమైన పదవులు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ, జనసేనకు చెందిన వారందరికీ తెలుసునని ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇటువంటి అరాచకానికి సదరు మంత్రివర్యులు ఒడిగట్టడం దారుణం. అదే మంత్రి తిరుపతి పవిత్రతను కాపాడతానంటూ మాట్లాడుతుంటారు. అటువంటి మచ్చపడిన మంత్రివర్యులపైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్‌లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్‌లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్‌కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
‘ఈ అరాచకాలకు చంద్రబాబే రాజగురువు’
తాడేపల్లి : టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్‌గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు. ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు. ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్‌ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం. అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్‌ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్‌కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
‘నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని’
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.వైఎస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్‌ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను 9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్‌లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. -
మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి.. బాబు సర్కార్‌పై సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎంతటి నీచ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటేనే వారి వేధింపులను అర్థం చేసుకోవచ్చు.అధికారుల ద్వారా కమీషన్లు గుంజుకోవాలని చూడటం సిగ్గుచేటు. ఆ తప్పుడు పని చేయలేనంటూ ఆ అధికారి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?.అసలు రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చంద్రబాబు చేయలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. వ్యవసాయ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల సమస్యలను పట్టించుకోవటం లేదు. రైతులు రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు.రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ.200 అదనంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. యూరియా, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతుల చెంతకే చేర్చాం. ఐదేళ్లలో ఏనాడూ యూరియా కొరత రాలేదు.కానీ నేడు రైతులను కూటమి ప్రభుత్వం సంక్షోభమలోకి నెట్టేసింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో సగం కూడా ఏపీకి రాలేదు.అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండానే చేసినట్టుగా చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి కింద సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా రూ.7,800 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకున్నారు. బీమా కోసం వైఎస్ జగన్ ప్రతి ఏటా ప్రభుత్వం తరపునే ఖర్చు చేశారు. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోనందునే 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది?. ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?.వరదలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు యూరియాను వెంటనే అందించాలి. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. చంద్రబాబుకు కొత్తపథకాల ఆలోచన ఎప్పుడూ రాదు. అన్నీ వైఎస్ జగన్ పథకాలే చంద్రబాబు కాపీ కొట్టాడు. వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. రైతులకు రైతు భరోసా అందించిన ఘటన వైఎస్ జగన్‌దే. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తానని మోసం చేశారు’అని ధ్వజమెత్తారు. -
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్‌ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్‌లో బంధించి వేధించాడు. ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలను తెలుస్తుంది అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ైవైఎస్ జగన్‌ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బతీసింది. ఈసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న వారంతా కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరించారు. -
అవినీతి చేయడంలో..మంత్రులకు చంద్రబాబే ‘ఇన్స్పిరేషన్’
సాక్షి,శ్రీకాకుళం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో అవినీతిలో ఆయన కేబినెట్లోని మంత్రులు కూడా పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల అవినీతిని తట్టుకోలేక పారిపోతున్న అధికారులను వెంటాడి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించలేదనే కారణంతోనే ఆగ్రోస్ జీఎం రాజమోహన్ని ఈ ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినీతి కేసులున్న జూనియర్ అధికారిని నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిజాయితీగా పనిచేసే అధికారులకు కనీస గౌరవం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన అవినీతికి సహకరించలేదనే కారణంతో సీనియర్ అధికారి ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమైపోతుంది.వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం నెరిపి తనకు మేలు జరిగేలా చేయాలని మంత్రి పేషీ నుంచి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కానీ దానికి ఆయన అంగీకరించకుండా సెలవుపై వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులన్న జూనియర్ అధికారిని తీసుకొచ్చి నియమించడం చూస్తుంటే అవినీతికి ఈ ప్రభుత్వం ఏవిధంగా పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెప్పింది. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాల్సిందిపోయి కమీషన్ల ద్వారా జేబులు ఎలా నింపుకోవాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేసుకోవడం సిగ్గుచేటు.ఆగ్రోస్ జీఎం రాజమోహన్ బదిలీ వెనుక ఏం కారణాలున్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా వేధించి ఉండకపోతే సీఎస్‌కి లేఖ రాసి మరీ ఆయన వెళ్లిపోతారు? సమర్థవంతమైన నిజాయితీగల అధికారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజలకు మేలు చేయాలనుకున్న అధికారులను వేధించి ట్రాన్సఫర్లతో సన్మానిస్తారా? జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం, అవినీతికి ప్రేరేపిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.ఉచిత పంటల బీమాను ఎత్తేశారు:వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసింది. గత వైఎస్ జగన్ పాలనలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం చెల్లించిన బీమా వల్ల వారికి పెద్దగా నష్టం లేకపోయేది. కానీ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వరి, అరటి, మామిడి, మిర్చి, పొగాకు రైతులు తాము కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల్ని ఈ ప్రభుత్వం వంచించింది. కేంద్రం అందించే సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు ఇస్తామని మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలుగా రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తూ వస్తోంది. కూటమి నాయకుల అవినీతి వ్యవహారాలను వైఎస్సార్సీపీ ప్రస్తావించినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక గత ప్రభుత్వం అంటూ ఏడాదిగా మాపై బురదజల్లుతూనే ఉన్నారు. పొద్దస్తమానం వైఎస్ జగన్ పేరు తల్చుకోకుండా కూటమి నాయకులకు రోజు కూడా గడవడం లేదు. -
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్‌రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్‌లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్‌ను మెసేజ్‌లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
ఏపీ కేబినెట్ భేటీలో.. టీడీపీ ఎమ్మెల్యేల బూతులపై చర్చ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా.. కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగినవి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో.. అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు.