
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.