
తాడేపల్లి : టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు.
ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్‌గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు.
ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి.
అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు.
ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్‌ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం.

అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్‌ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్‌కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు.