breaking news
-
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్‌పై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు...వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు. -
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్‌లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. -
‘కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే’
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ హయాంలోనే హంద్రీ-నీవా పుంగనూరు వరకు పూర్తయ్యాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ భరత్. హంద్రీ-నీవా పేరుతో కుప్పం ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి తన ఖాతాలో వేసుకుంటున్నారు. కుప్పానికి నీరు రావటానికి కారణమైన హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించిన నేత వైఎస్సార్.ఆ తర్వాత కాలువల నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.రూ.293 కోట్ల కాంట్రాక్టును రూ.576 కోట్లకు పెంచి అవినీతి చేశారు.అయినా పూర్తి స్థాయిలో పనులు కూడా చేయలేదు.జగన్ సీఎం అయ్యాక మిగతా పనులు పూర్తి చేశారు.రామకుప్పం దగ్గర ఈ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి ప్రచారం చేసుకుంటున్నారు.చంద్రబాబులాగ జగన్‌కు ప్రచార పిచ్చి లేదు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి నీరిచ్చిన ఘనత జగన్‌దేనని స్పష్టం చేశారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా పవనూ: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు. -
పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. .. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
అనితమ్మా.. ముందు ముందు చాలా ఉంది!
కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య అక్కడక్కడా విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతుండడం తెలిసిందే. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసేన నేతల నుంచి వార్నింగ్ రావడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.సాక్షి, అనకాపల్లి: కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య ఏపీలో పలు నియోజకవర్గాల్లో విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసైనికులు వార్నింగ్ ఇచ్చారు.పాయకరావుపేటలో అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ చిచ్చు రాజుకుంది. హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలో జనసేన ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఫోటో లేకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అనితకు టార్గెట్ చేస్తూ నిన్నటి నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. ‘‘అనితమ్మా.. ఈరోజుతో అయిపోయిందనుకుంటే అది మీ భ్రమ. ఇది అలా అయిపోయేది కాదు. ముందు ముందు చాలా ఎన్నికలు ఉన్నాయి’’ అంటూ వార్నింగ్ పోస్టులు చేస్తున్నారు. అదే సమయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కొందరు నేతలు బహిరంగంగానే అనితకు సూచిస్తున్నారు. పాయకరావుపేట సీటును అనితకు గెడ్డం బుజ్జి త్యాగం చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.కూటమి అధికారం చేపట్టాక చాలా చోట్ల టీడీపీ వాళ్ల ఆధిపత్యమే కొనసాగడాన్ని జనసైనికులు భరించలేకపోతున్నారు. ఒక్క పాయకరావుపేటలోనే కాదు.. చాలాచోట్ల టీడీపీ జనసేనల మధ్య ఇలాంటి వైరమే కొనసాగుతోంది. -
‘లక్షల కోట్లు అప్పులు చేస్తూ దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వలేరా?’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. ‘దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది. అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగించారు. దేశ చరిత్రలో ఏనాడైనా ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరిగిందా?, చంద్రబాబు మాత్రమే ఏకంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించి తన కర్కశత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేరా?, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా?, ఉన్నవాటిని కూడా తొలగించి వారి ఉసురు తీస్తున్నారు. దివ్యాంగుల్లో కూడా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వటం ఏంటి?, నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. అలాంటి వారికి కూడా ఎలా పెన్షన్లు తొలగించారు?, గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లను కాదనటం ఆ డాక్టర్లను అవమానించటం కాదా?, వికలాంగులను తీసుకుని వస్తున్న మా పార్టీ నేత ఉషశ్రీ చరణ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు హెలికాప్టర్ లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా?, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించకపోతే ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
వైఎస్ జగన్‌పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోంది: భూమన
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు. -
‘ఏపీలో విద్య, వైద్యం పక్కకు పోయి.. మద్యం మాత్రం దొరుకుతుంది’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఏపీలో విద్య, వైద్యం సంగతి పక్కకు పోతే మద్యం మాత్రం ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. మద్యం పాలసీతో పేదల జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై విరుకుపడ్డారు. ‘ ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది.కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు తెచ్చారు. సాధారణ ప్రజలు తాగి రోడ్డున పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు విస్తృతంగా మద్యం పంపిణీ చేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. వీధివీధినా మద్యం షాపులే దర్శనమిస్తున్నాయి. చివరికి కిల్లీ కొట్లు, పచారీ షాపుల్లోనూ బెల్టుషాపులు పెట్టించారుమద్యం మహమ్మారి పేద, మధ్య తరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు ఇచ్చి అక్కడే ఫుల్లుగా తాగమని లైసెన్స్ ఇచ్చారు. పేద కుటుంబాలను నాశనం చేయటమేనా చంద్రబాబు విజనరీ అంటే?, చంద్రబాబు అంటేనే మాయా ప్రపంచమని నిరూపిస్తున్నారు. 4,380 పర్మిట్ రూంలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం అమ్ముతున్నారు. మద్యం మీద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమంతా చంద్రబాబు జేబులోకి వెళ్తోంది. జగన్ హయాంలో మద్యం ఆదాయం రాష్ట్ర ఖజానాకి చేరింది. చంద్రబాబు ప్రివలేజ్ ఫీజు పేరుతో రూ.1100 కోట్లు తమ నేతలకు దోచి పెట్టారు. కొత్తగా మరో 3,736 బార్లు టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు. కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సిన షాపులను కూడా టీడీపీ వారికే కట్టబెట్టారు. చేసిన స్కాం బయట పడకుండా ఉండేందుకు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు’ అని టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పుట్టపర్తిలో రెడ్‌బుక్.. ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లిన ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్‌తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్‌నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్‌లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్‌లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్‌లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ముఠా బార్ల దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్.. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. ‘మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు. బిజినెస్ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. నేడు, రేపు సిండికేట్ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడచివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దరఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తున్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్‌కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్ వేశారు.మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్ బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్ దక్కించుకోవాలని కూడా సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్ దక్కిన తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్ గురి పెట్టింది. బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచారం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ⇒ 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై ఉన్నారు.⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్‌కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. -
ఈ అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్‌పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్‌కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్‌కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. -
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్‌లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్‌పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్‌ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. -
‘తిరుపతిలో భూ ఆక్రమణలు.. బాబు, బీఆర్ నాయుడికి బాధ్యత లేదా?’
సాక్షి, తిరుపతి: తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో భూ భాగోతానికి తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం. ఆలయ భూములను టూరిజానికి కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపాం. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?.టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. ఇది పూర్తిగా ధర్మం మీద దాడి. వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా?. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్ టూరిజానికి ఇవ్వడమేంటి?. మరెక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవొచ్చు కదా?. టీటీడీ బోర్డు మీటింగ్‌లో మా అభ్యంతరాలను తిరస్కరించారు. మే నెల ఏడో తేదీన జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆగ మేఘాలపై సమావేశం నిర్వహించారు. అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని టూరిజంకు బదలాయించారు. 05.08.25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 07.08.25 జీవో ఇచ్చారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు. ఆ విలువైన 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలని చూస్తున్నారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా. మంత్రి రాసలీలలు గురించి మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు. నేను ఏ ఒక్క విషయం వక్రీకరించలేదు. టీడీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.అనంతపురంలో ఉద్రిక్తత..ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్‌పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్‌పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్‌ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. -
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
‘నాకు లేని ల్యాప్‌టాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్‌ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్‌లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
‘అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు హుషారుగా ఉన్నారు’
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం. ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు.