breaking news
-
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్‌లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్‌లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్‌లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖ: రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీపడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రుషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు రుషికొండ పర్యాటక ప్రాంతంగా మారింది. చంద్రబాబు హైదరాబాద్‌లో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడతే అది పూరి గుడిసె.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీమ్ ఇల్లు. వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే అవి మాత్రం ప్యాలెస్. రుషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. అందుకే రుషికొండ భవనాలు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేశారు. కట్ చేసిన ప్రాంతంలో పవన్ ఫోటో షూట్ చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుంది. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారు. వాటి దుస్థితి చూడండి. అవి పవన్‌కు కనిపించడం లేదా?. ఏరోజైనా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా?. ఎన్నికల్లో రుషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు. పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్డ్ చేయడానికే రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారు. రుషికొండలో పవన్, నాదెండ్ల మనోహర్ ఫోటో షూట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.స్టీల్ ప్లాంట్ కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పవన్ కళ్యాణ్ తెరలేపారు. విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఈవెంట్ల కోసం విశాఖ, పేమెంట్లు కోసం అమరావతి వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చేతగాని వ్యక్తులు ఎవరో పవన్‌ను చూస్తే తెలుస్తుంది. వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. వారి గురించి చంద్రబాబు, పవన్ ఒక మాట మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మా వైఖరి మారలేదు. మొదటి నుంచి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. స్టీల్ ప్లాంట్‌పై మా వైఖరి ఒకటే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు. వైఎస్ జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు, పవన్, లోకేష్ వైజాగ్ వస్తున్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్‌పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తప్పుడు హామీలు, అబద్ధాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల అవస్థలు కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్‌పై గతంలో పవన్ కల్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏం అయ్యాయి? అని ప్రశ్నించారు. -
మాపై పవన్ ఆరోపణలు సరికాదు: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్‌కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్‌కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్ స్కాంను సృష్టించి.. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక నెపంతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైఎస్ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. -
శింగనమలలో ఉద్రిక్తత.. బండారు శ్రావణికి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. సేవ్ టీడీపీ పేరుతో పచ్చ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ పచ్చ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సేవ్ టీడీపీ పేరుతో శింగనమల టూమెన్ కమిటీ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఎల్లో మీడియా సృష్టి అది.. బాబూ చూసుకోవాలి కదా!
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్తా కధనం వచ్చింది. అంతవరకు సంతోషమే. అదే రోజు, ఆ మరుసటి రోజు వచ్చిన కొన్ని వార్తలు చూస్తే ఆవేదన కలుగుతుంది. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, పెన్షన్ కోసం దివ్యాంగులు నానా అగచాట్లు పడుతున్న వైనంపై సచిత్ర కథనాలు వచ్చాయి. నిజంగా ఈ పరిస్థితి బాధాకరమే. అంతేకాదు.. పెన్షన్‌కు అనర్హులు అంటూ నోటీసు రావడంతో ఆందోళనకు గురైన దివ్యాంగ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం మరింత కలచివేస్తుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకొన్న దయనీయ పరిస్థితికి ఇది దర్పణం పడుతుందనుకోవాలి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెన్షన్ దారుల విషయంలో, యూరియా సరఫరాపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారట. అలాగే అమరావతి మునిగిందని చెబుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది మరింత విచారకరమని చెప్పాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై, లేదా ఇబ్బందులపై వార్తలు వస్తే వాటిని సరిచేసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ గా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ రెండు అంశాలకు సంబంధించి ఎల్లో మీడియా కూడా తమ జిల్లా పత్రికలలో పెన్షన్ దారులు పడుతున్న పాట్లు, యూరియా ఇక్కట్లు, అమరావతిలో వరద మొదలైన అంశాలపై కథనాలు ఇచ్చాయి.రాష్ట్రస్థాయిలో మాత్రం వాటిని కప్పిపుచ్చి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అన్న వ్యాఖ్యకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల మొత్తాన్ని వారి వైకల్యాన్ని బట్టి ఆరువేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నికల హామీగా ఇచ్చాయి. ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచినట్లు పెంచి, అనర్హుల పేరుతో చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పార్ధసారధి తదితరులు దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయని, పెన్షన్దారులలో దొంగలు ఉన్నారని ఆరోపిస్తూ స్పీచ్‌లు ఇచ్చారు. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఈ పెద్దలు కొందరు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యంపై నోటీసులు వచ్చినవారికి వచ్చే నెల పెన్షన్ రాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఎవరైనా కోరి అంగవైకల్యం తెచ్చుకుంటారా? అలా అని చెప్పుకుంటారా?. కానీ, దురదృష్టవశాత్తు పాలకులు దివ్యాంగులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. వారి పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు.దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళనకు దిగుతున్నారు. వారు తమ వైకల్యాన్ని టీవీల ముందు చూపుతున్న వైనం ఆవేదన కలిగిస్తుంది. అయినా ఎల్లో మీడియా మానవత్వం లేకుండా పెన్షన్లపై ఫేక్ రచ్చ అంటూ వార్తలు రాసి చంద్రబాబును సంతోషపెడుతోంది. నిజానికి ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారానికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలలో పలచన అవుతుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ విషం అని ఈ మీడియా రాసింది. దివ్యాంగుల ఫించన్ల తొలగింపుపై అసత్యాలు అని సత్యదూరమైన వార్తలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఎల్లో మీడియా ప్రభుత్వంతో కుమ్కక్కైంది. ఇప్పుడు నిత్యం కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు చేస్తున్న ఆందోళన అబద్దమా?.శ్రీకాకుళంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా?. పోనీ ఎల్లో మీడియా పెన్షన్‌దారులకు జరుగుతున్న అన్యాయంపై రాయలేదా?. అంటే వారు తమ జిల్లా పత్రికలలో రాస్తున్నారు. ఉదాహరణకు ఆగస్టు 21న ఇదే ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా పత్రికలో అర్హులకు అన్యాయం అని హెడ్డింగ్ పెట్టి ఒక పేజీడు వార్తలు రాసింది. అంటే ప్రభుత్వంపై వారు విషం చిమ్మినట్లేనని ఒప్పుకుంటారా?. లేక నిజమే రాశారా?. అలాగే చిత్తూరు జిల్లా ఎడిషన్‌లో వీరే రాసిన మరో వార్త ఏమిటంటే కొందరి పాపం.. వీరికి శాపం అని ఈ మొత్తం నెపాన్ని అధికారులు, డాక్టర్లపై నెట్టేసే యత్నం చేశారు. మంచానికే పరిమితమైన ఒక వ్యక్తికి నెలకు నాలుగు వేలే ఇస్తున్నారని ఇదే ఎల్లో మీడియా వారు ఫోటోతో సహా ప్రచురించారు. రెండు కాళ్లు పనిచేయకున్నా పూర్తిగా పెన్షన్ రద్దు చేశారని కూడా ఫోటోతో కూడిన మరో వార్తను ప్రచురించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి పత్రిక రాసినా, వైఎస్సార్సీపీ విమర్శలు చేసినా, అవి ఫేక్ ప్రచారం అయితే మరి ఇదే విషయాన్ని ఎల్లో మీడియా రాస్తోంది కదా?. దానిని ఏమంటారు. రాష్ట్ర స్థాయిలో ఒకరకంగా, జిల్లాలలో మరో రకంగా రాస్తున్న టీడీపీ మీడియా ఫేక్ అవుతుందా? లేదా?. అన్నది వారే ఆలోచించుకోవాలి. సాక్షిలో వచ్చిన కధనాలు కాని, వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాని నిజం కాకపోతే ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్లను యధాతధంగా ఉంచుతామని ఎల్లో మీడియాకు ఎందుకు లీక్ ఇచ్చారో చెప్పాలి. అంగవైకల్యంపై సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై కేసులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో బెదిరించడంతో వారు తమ వద్దకు వచ్చినవారికి ఎలాంటి అంగవైకల్యం ఉన్నా అనర్హులుగా ప్రకటించేశారట. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా!.ఇదే సందర్భంలో గతంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడానికి ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ను వాడుకున్న విషయాన్ని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇక యూరియా సరఫరాపై కూడా ఇలాగే ఎల్లో మీడియా చేస్తోంది. రైతులు నిత్యం యూరియా కోసం క్యూలు కట్టి ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారని ఎల్లో మీడియా రాసింది. మరో వైపు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిఘా పెట్టాలని కూడా ఆయన ఆదేశించారట. యూరియా సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అదేమీ లేదన్నట్లు దుష్ప్రచారంగా కొట్టిపారేస్తే ఏమి ప్రయోజనం!. చెప్పులను కూడా క్యూలో ఉంచి రైతులు ఒక టైమ్ అంటూ లేకుండా ఎదురుచూపులు చూస్తున్న సన్నివేశాలు రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. పలు చోట్ల సొసైటీలలో, రైతు సేవా కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమస్య ఉంటే దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాకుండా ఎలా మాయ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా డప్పులు వాయిస్తోంది.అమరావతి విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద మోటార్లతో వరద నీరు తోడే పనిలో కనిపిస్తుంటారు. మంత్రి నారాయణ వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నామని చెబుతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వరద ఏమీ లేనట్లు మాట్లాడి అమరావతి మునగలేదని బుకాయిస్తుంటారు. టీడీపీ మీడియా అయిన ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికలలో సైతం అమరావతి ప్రాంతంలో వరదవల్ల ఆయా గ్రామాలలో ప్రజలు పడిన పాట్లను వివరిస్తూ వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు కోపం ఎంతసేపు సాక్షిపై, వైఎస్సార్‌సీపీపైనే ఉంటుంది. ఏమి చేస్తాం. ఆయన ధోరణే అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విపక్షం ఆధారాలు లేకుండా విమర్శలు చేసే అవకాశం ఉందా?.టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా తప్ప మరే ఇతర మీడియా అయినా నిజం లేని వార్తలను సృష్టించే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలపై వార్తలు వస్తే వెంటనే సంబంధిత శాఖలతో ఖండన లేదా వివరణ ఇవ్వాలని చెప్పేవారు. కాని ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే స్వయంగా ఆయనే సమస్యలపై అక్షర సత్యాలు రాస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులను వేధిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు తనకు తాను ఎంత బలహీనుడుగా మారుతున్నారో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీ జాతకాలు నా దగ్గరున్నాయి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్‌ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.చంద్రబాబు ఆదేశాలతోనే...!వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్‌ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి.. ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ మహిళలందరినీ నమ్మించి.. గత ఏడాది జూన్ నుంచే వాటిని అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి.. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తకుండా వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి.. హామీలకు కోతలు పెడుతున్నారు.. ఇది మోసం కాదా? దగా కాదా? అంటూ నిలదీశారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్ –7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచారు. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు. ⇒ ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?⇒ చంద్రబాబు గారూ.. మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014–19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరకు వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. ⇒ మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు.⇒ చంద్రబాబు గారూ.. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బ తీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?⇒ మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చాం. అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం.ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్త శుద్ధికి నిదర్శనం.⇒ మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ! -
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్‌లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. .@ncbn గారూ మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2025 -
నా వద్దే టోల్ వసూలు చేస్తారా? రెచ్చిపోయిన టీడీపీ నేత
సాక్షి, కర్నూలు: అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నందవరం మండలం హాలహర్వి (NH 167) టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి దాడికి దిగారు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్ గేట్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత.. దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.కాగా, శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం(ఆగస్టు 27) చిలమత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.ప్రెస్‌మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించారు. -
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు...అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు...అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు...తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘చంద్రబాబూ.. మూల్యం చెల్లించుకోక తప్పదు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అభూత కల్పనలతో లిక్కర్ స్కాం కేసు తయారు చేశారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్‌తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పుడు జైలు వద్ద పవన్ కళ్యాణ్ మాటలు కోటల దాటాయి. ఇప్పుడు ఆయన గడప కూడా దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జైల్లో మిథున్ రెడ్డిని హింస పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా సెంట్రల్ జైలు వద్ద భారీ గేడ్లు కట్టారు’’ అంటూ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు.. మనీ ట్రైల్ ఎలా జరిగిందో 90 రోజులైనా నిరూపించలేకపోయారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు ఇచ్చారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు. -
అది హిందువుల దురదృష్టం.. BR నాయుడికి భూమన కౌంటర్
తిరుపతి, సాక్షి: అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి నిలదీశారు. గురువారం తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు?. అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు?. నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. పైగా అడినందుకు బూతులు తిడుతున్నారు. బీఆర్ నాయుడి వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం అని భూమన అన్నారు. అలాగే తనపై బీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణలపైనా భూమన స్పందించారు. బీఆర్ నాయుడు.. తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్. ఆయనో దోపిడీదారుడు.. పైరవీకారుడు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు భయపడం. నాపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం. జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్ నాయుడు అనేక అక్రమాలు చేశారు. అతని అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం అని భూమన అన్నారు. ‘‘బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారు. క్విడ్‌ప్రో కింద బీఆర్ నాయుడికి ఆ పదవి వచ్చింది. ఆ పదవి శాశ్వతం కాదనే విషయం బీఆర్ నాయుడు గుర్తుంచుకోవాలి’’ అని భూమన హెచ్చరించారు. -
నిజాలు అలా చెబుతారా?.. మంత్రి రాసలీలలపై టీడీపీ నేతకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీలల గురించి బహిరంగంగా చెప్పిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విరుచుకుపడినట్లు తెలిసింది. మంగళవారం సుధాకర్‌రెడ్డిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిపించిన క్రమశిక్షణ సంఘం నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా.. ‘మీరు మాట్లాడిన నిజాలు తీసుకొచ్చే నష్టం ఎంతో తెలుసా? ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రత్యర్థులకు రాజకీయ అస్రాలు ఇచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల టీడీపీ అనుకూల చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర మంత్రి ఒకరు తిరుపతికి వచ్చిన సమయంలో స్టార్ హోటళ్లలో రాసలీలల్లో మునిగితేలతారని ఆయన చెప్పారు. మంత్రికి తమ లాంటి పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం లేదని, రాసలీలలకే సమయం సరిపోతోందంటూ.. తిరుపతిలో మంత్రి చేసే అసాంఘిక కార్యకలాపాలను వివరించారు.మండల అధ్యక్ష, ఇతర పార్టీ పదవుల్ని సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా ప్రచారమవడంతో ఉలిక్కిపడిన టీడీపీ అధిష్టానం రాసలీలల మంత్రిని ప్రశ్నించకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన నేత సుధాకర్‌రెడ్డిని టార్గెట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండటంతో.. ఆ మంత్రి కూడా సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే క్రమశిక్షణ సంఘం నేతలు సుధాకర్‌రెడ్డిని పిలిపించుకుని వివరణ కోరారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలేనని, మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవకుండా వేరే వ్యవహారాలు నడుపుతున్నారని సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది.‘మీరు మాట్లాడినవి నిజమే అయి ఉండవచ్చు. నిజాలన్నీ బయట మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీ వారికి అ్రస్తాలను అందిస్తారా?. అంతర్గతంగా ముఖ్య నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులపై అసహ్యం కలిగి, పారీ్టకి నష్టం జరుగుతోందనే ఆవేశంలో కొన్ని విషయాలు బయటపెట్టానని సుధాకర్‌రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన్ని క్రమశిక్షణ సంఘం నేతలు హెచ్చరించి పంపినట్లు తెలిసింది. అయితే సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని సదరు మంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. -
ని‘వేదన’లే..! డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు
బాపట్ల జిల్లా చీరాల ఈపూరుపాలేనికి చెందిన పిట్టు నాగేశ్వరమ్మ, పిట్టు వెంకట్రావులకు సర్వే నెంబర్ 746–2లో 1.55 ఎకరాలు, సర్వే నెంబర్ 746–3లో 1.46 ఎకరాల భూమి ఉంది. కొనుగోలు ద్వారా సంక్రమించిన ఈ భూమిని ప్రభుత్వం ఇటీవల జీరో (ఎవరికీ చెందనిది) ఖాతాలో చేర్చడంతో తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంతకాలం సక్రమంగానే ఉన్న తమ భూమి రికార్డులు మార్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అవసరానికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపిశెట్టిపల్లిలో టీడీపీ నేతల అండదండలతో గ్రామ కంఠం భూములను ఆక్రమించడంపై గ్రామస్థులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని, తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈనాం భూమిగా నమోదుతో.. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామం సర్వే నెంబర్లు 340/1, 340/2, 3లో మొత్తం 82 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రీ సర్వే తర్వాత ఎల్పీఎం నెంబర్లు ఇచ్చినప్పుడు 340/2, 3 సర్వే నెంబర్లలో ఉన్న రెండు సెంట్ల భూమిని సర్వీస్ ఈనాంగా తప్పుగా నమోదు చేశారు. దీంతో మొత్తం భూమంతా సర్వీస్ ఈనాంగా రికార్డుల్లో నమోదు కావడంతో ఫ్రీ హోల్డ్ చేసినట్లు చూపారు. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం 22 ఏ జాబితాలో పెట్టేసింది. దీంతో భూ యజమాని అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఫ్రీహోల్డ్‌గా తప్పుగా పేర్కొన్న 2 సెంట్లను మినహాయించి మిగిలిన 80 సెంట్ల జిరాయితీ భూమిని ఆంక్షల జాబితా నుంచి తొలగించాలని ఏడాదిగా బాధిత రైతు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ, స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. పీజీఆర్ఆర్ఎస్లో అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. ఫ్రీహోల్డ్ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ దీనిపై ఏమీ చేయలేమని సీసీఎల్ఏ అధికారులు చేతులెత్తేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు స్వయంగా తమ ఫిర్యాదును తీసుకున్నారంటే ఇక ఆ సమస్య కచ్చితంగా పరిష్కారమైనట్లేనని అర్జీదారులు కొండంత భరోసా పెట్టుకుంటారు! మరి అవే బుట్టదాఖలవుతున్నాయంటే ఇక సామాన్యుల గోడు తీర్చెదెవరు? రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు, టీడీపీ నేతల ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో ప్రభుత్వ పెద్దలే ముఖం చాటేస్తే ఇక బాధితులకు న్యాయం చేసేదెవరు? రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వెల్లువలా వస్తున్న అర్జీలపై ఆరా తీయకుండానే పరిష్కరించేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడంపై బాధితులు నివ్వెరపోతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లలో భూములకు సంబంధించి లక్షలాది ఫిర్యాదులు వస్తున్నా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోవడంలేదు. భూ సమస్య అంటేనే అధికారులు దాన్నో పెద్ద భూతంగా, సివిల్ పంచాయితీగా చూస్తుండడంతో భూ యజమానులు దిక్కు తోచక దళారుల బారిన పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బ్రోకర్ల అవతారం ఎత్తి పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలను సైతం రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేనో, అధికార పార్టీ నేతలో పురమాయిస్తే గానీ వినతిపత్రాలు సైతం తీసుకోవడంలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని కార్యాలయాల్లో జరుగుతున్న గ్రీవెన్స్ డే (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కేవలం మొక్కుబడి తంతుగా ముగుస్తోంది. అధికారులంతా విందు భోజనానికి వచ్చినట్లు కూర్చుని రశీదులు ఇప్పిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత సమస్య పరిష్కారమైపోయినట్లు బాధితులకు మెసేజ్‌లు రావడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి సమస్య అలాగే ఉంటోంది. అధికారులు మాత్రం అది ముగిసిపోయినట్లు నివేదిక ఇచ్చేస్తున్నారు. దీంతో బాధితులు ఎప్పటి మాదిరిగానే కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ సమస్యలు పరిష్కారం కాని రైతులు, భూ యజమానులు, బాధితులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. రికార్డుల్లో తప్పులు.. రైతులకు శాపాలు పలు చోట్ల భూమి ఒకరి పేరు మీద ఉంటే పట్టాదారు పాస్‌బుక్ ఇతరుల పేరు మీద రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే లేదా ఎల్పీఎం నెంబర్లలో తప్పులు, భూమి స్వభావంలో తప్పులు లాంటి వాటికైతే లెక్కే లేదు. జాయింట్ ఎల్పీఎంల సమస్య ఇటీవల తీవ్రం కావడంతో సబ్ డివిజన్ల ద్వారా చక్కదిద్దకుండా సబ్ డివిజన్ చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.50 నుంచి రూ.550కి ప్రభుత్వం పెంచేసింది. డబ్బులు కట్టకపోతే సబ్ డివిజన్ జరగడంలేదు. ఇలా రెవెన్యూలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయడంలేదు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద తమ ఆవేదనను వెల్లడిస్తున్న చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి గ్రామస్తులు సీఎం స్వయంగా తీసుకున్నా అంతే..!‘పీజీఆర్ఎస్’కు వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబే చాలాసార్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వారంలో రెండు మూడు రోజులు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటుండగా అందులో 70 నుంచి 80 శాతం భూముల సమస్యలే ఉంటున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర మంత్రులు తీసుకున్న వినతిపత్రాలు సైతం పరిష్కారానికి నోచుకోవడంలేదు. కొద్దిరోజుల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి ఐదు వేల వినతులు వచ్చినట్లు ప్రకటించారు. కానీ అందులో పది శాతం కూడా పరిష్కారం కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను చూసి సీఎం వాటిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పి రాకుండా ముఖం చాటేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు అర్జీలు అందగా అందులో మెజారిటీ రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూముల సమస్యల్లో దాదాపు అన్నింటినీ పరిష్కరించేసినట్లు ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు 15 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంగా పక్షం రోజుల్లోనే అవన్నీ పరిష్కారమైపోయినట్లు ప్రకటించేశారు. తిరగలేక విసిగిపోయాఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో 131/1ఏ, 132/ 2ఏ సర్వే నంబర్లలో నాకు 3.04 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. నా భూమిలో 0.44 సెంట్లను ఇతరులు ఆక్రమించుకుని కంచె వేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆరు సార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయా. – మేడా సత్యనారాయణ70 ఏళ్ల వయసులో నాకేంటీ తిప్పలు 1993లో ప్రభుత్వం 40 సెంట్ల భూమిని నా భార్య కొల్లి చిట్టమ్మ పేరుతో ఇచ్చింది. నా భార్య చనిపోవడంతో ఆ భూమికి నా పేరుతో పాస్‌బుక్ ఇవ్వాలని కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్లో రెండుసార్లు అర్జీ ఇచ్చా. 70 ఏళ్ల వయసులో తిప్పలు పడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. – కొల్లి ప్రకాశం, నాగంపల్లి, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. నాకు ఐదు ఎకరాల పొలం ఉండగా 2.47 ఎకరాలను రజని అనే వ్యక్తికి విక్రయించా. అనంతరం అతడి నుంచి దాన్ని కొనుగోలు చేసిన పాండు మొత్తం భూమి తనదేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. నాకు న్యాయం చేయమని భూమి పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా. సర్వే చేయాలని మొర పెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం పోలేదు. – రామచంద్రనాయుడు, ఊటుకూరు గ్రామం, రాజంపేట -
మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు దివ్యాంగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పెన్షన్లను రద్దు చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి దివ్యాంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులను సైతం లంచాలు తీసుకున్నారంటూ దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తూ మంగళవారం ‘ఎక్స్’లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీశారు.⇒ సీబీఎన్ గారూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని మీ పాలనా కాలంలో రోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలే కాదు.. అంతకు మించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమే కాదు.. తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటికీ కోతలు పెడుతున్నారు.⇒ చంద్రబాబుగారూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కానీ మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472 మాత్రమే. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?⇒ విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?⇒ దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్ల కోసం గతంలో ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశాం. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం.కానీ, మీరు వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారూ ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, మరి అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా?⇒ వీటి పరిస్థితి ఇలాఉంటే.. ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతి పెద్దమోసం. అది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ! -
చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వికలాంగుల పెన్షన్ కోతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమేకాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారు. చంద్రబాబూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్లకోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరుచేసి, 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం. కాని, మీరు వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారికి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు..@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025..చంద్రబాబూ.. ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాలకోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే, ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్దమోసం. ఇది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్.. ఎస్పీకి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా ఎస్పీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేయగా.. డీజేలకు అనుమతి కోరితే ఊరుకునేది లేదంటూ.. మీ అనుమతులు మాకు అక్కర్లేదంటూ శ్రీనివాసులురెడ్డి హుకుం జారీ చేశారు. డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా.. అలా తీసుకోవడం కుదరదంటూ ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వినాయక చవితి పందిళ్లు, డీజే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనసరి అని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటంటూ శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనలను కూడా అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఉత్సవ నిర్వాహకులు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ప్రకారం కావాల్సిన భద్రతను పోలీస్‌శాఖ కల్పిస్తోంది. కానీ అనుమతులు తీసుకోవాలంటే.. ఊరుకునేది లేదంటూ శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్ పెట్టారు. -
తమలపాకుతో కొట్టినట్లు.. నెమలీకతో మొట్టినట్లు..!
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.-సిమ్మాదిరప్పన్న -
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్‌పై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు...వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు. -
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్‌లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.