breaking news
-
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’
సాక్షి,శ్రీకాకుళం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.మెడికల్ కాలేజీను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా? లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి’అని ప్రశ్నించారు. -
పబ్లిక్ టాక్: ఆ దొంగలే ఎంతో నయం!
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే. ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. పబ్లిక్ టాక్ ఏంటంటే..ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.:::ఎం.రాజేశ్వరి -
‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్‌కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
లేబరోళ్లు, వేరే గ్రహం నుంచి వచ్చారు.. జనసేన మహిళా నేత నోటి దురుసు
సాక్షి, విజయనగరం: జనసేన కేడర్‌ను ఉద్దేశించి పార్టీ మహిళా నాయకురాలు రెచ్చిపోయారు. తమ పార్టీకి చెందిన జనసైనికులను దారుణంగా అవమానించారు. వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారు అంటూ తిట్టిన తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన నాయకురాలు పాలవలస యశస్వని ఆగ్రహంతో ఊగిపోయారు. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లోకేడర్, లేబరోళ్లు సంభోదించారు. అసలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలను అడిగి మరీ తన ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టించుకోవాల్సిన దుస్థితిలో పార్టీలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తనను పట్టించుకోవడం లేదన్నారు. కొందరు గోడ మీద పిల్లుల్లగా ఉన్నారు. ఇదే సమయంలో పదవులు వచ్చిన వాళ్లు ఒకలా.. పదవులు లేని వాళ్లు ఒకలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విజయనగరం వాళ్ళు వేరే గ్రహం నుండి వచ్చారు. వీళ్లంతా అదో రకం అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక, ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతిన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం.. బూట్లతో స్వామివారికి పట్టువస్త్రాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వ్రస్తాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు.ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువ్రస్తాలు తీసుకొచ్చారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగదని, సెలక్షన్ మాత్రమేనని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. గురువారం జిల్లాలోని పెనుమూరులో నిర్వహించిన మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ఉండదు. ఎన్నికలు జరిపించాలన్న చోట అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చూడండి. అప్పుడు ఏకగ్రీవంగా మనవాళ్లే ఎన్నికవుతారు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం. టీడీపీ అభ్యర్థులను భయపెడితే కాళ్లు, చేతులు తీసేందుకు సిద్ధంగా ఉండాలి. టీడీపీలో కొందరు వైఎస్సార్సీపీకి కోవర్టులుగా ఉన్నారు. వారిని ఒకచోట చేరిస్తే ఎండ్రకాయల్లా కొట్టుకుంటారు. అందుకే ఒక్కొక్కరిని ఏరి ఒక్కొక్క బొక్కలో పెడుతున్నా’ అని వ్యాఖ్యానించారు. -
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్‌లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్‌దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘రైతులు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారు’
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్‌కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్‌ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఏపీ కేబినెట్‌కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్‌కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్‌ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
బాబూ.. ఈ ఫొటో నకిలీ అని నిరూపించే దమ్ముందా?: వైఎస్సార్సీపీ సవాల్
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ— YSR Congress Party (@YSRCParty) September 3, 2025 -
తప్పుడు ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి, అమరావతి: దగుల్భాజీ పోస్ట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారానికి తెరతీశారు. తల్లి విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఫేక్ ప్రచారం చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే, విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ లోకేష్ దుష్ప్రచారానికి ఒడిగట్టారు.తప్పుడు ట్వీట్ చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పబోయిన నారా లోకేష్.. గోతిలో పడ్డారు. లోకేష్‌ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల మండిపడతున్నాయి. -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్‌కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
ఏపీ ఆదాయం.. అసలు వాస్తవం ఇదే: బుగ్గన
సాక్షి, తాడేపల్లి: గత నెలలో రాష్ట్ర ఆదాయాలు పడిపోవటంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుగ్గన తెలిపిన వివరాలను ఎక్స్‌లో వైఎస్సార్సీపీ పోస్టు చేసింది. గత ఆగస్టు నెలలో ఎస్.జీ.ఎస్.టీ. ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉంది. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవటానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణం’’అని బుగ్గన పేర్కొన్నారు.‘‘గత ఆగస్టు 23న వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆదాయాలు, పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7.0 శాతం మాత్రమే ఉంది. నికర GST ఆదాయాల CAGR 6.94 శాతం మాత్రమే. ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల అనేది వాస్తవ వృద్ధి కాదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.Note on SGST revenues for Augsut 2025 by Sri Buggana Rajendranath ( @BugganaRaja )Quite contrary to the narrative of the State Government, concerning the GST revenues growth during August, 2025, the year-on-year growth of GST revenues during August 2025 over August 2024 of 21%… https://t.co/gYGXjj11sM— YSR Congress Party (@YSRCParty) September 3, 2025‘‘మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం CAGRతో ఉందని చెప్తున్నారు. వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి 7 శాతం మాత్రమే. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితం. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి చక్కని విధానాలను రూపొందించాలి. అది వదిలేసి జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవటానికి తాపత్రయ పడుతోంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్‌ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్‌కు భయం’
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. -
పవన్.. మీరు ఉప్పు, కారం తినడం లేదా?
సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం. 32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్ కల్యాణ్ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
కొనసాగుతున్న కక్ష.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. -
ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి మేం అండగా ఉంటాం: ధర్మాన
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్‌రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్‌రెడ్డితో వైఎస్సార్సీపీ నేతలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మిధున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది.కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు.ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించనంత వరకూ వ్యక్తిగానే చూడాలి.వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం.చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే ప్రత్యర్ధులకు కోపం ఉంటుంది. చార్జిషీటు వేయనివ్వడం లేదని మండిపడ్డారు. -
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్‌కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్‌కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్‌కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్‌కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్‌కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్‌కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
జేసీ సహా టీడీపీ నేతలపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. తాడిపత్రి సీఐ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న గొడవ కారణంగా కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో జేసీ, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.అనంతరం, తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే, అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడంతో దీన్ని తట్టుకోలేని ఓ టీడీపీ నేత సీఐ సాయిప్రసాద్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సీఐ సెలవుపై వెళ్లినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, తాడిపత్రి పట్టణ ఇన్చార్జ్ సీఐగా బాధ్యతలను మంగళవారం రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి స్వీకరించారు. -
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్‌పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్‌పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్‌ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్‌పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్‌లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్‌ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత