
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్‌కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్‌ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.
ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.