breaking news
-
తాడిపత్రికి పెద్దారెడ్డి.. సుప్రీంకోర్టు దెబ్బకు దిగొచ్చిన ఎస్పీ!
సాక్షి, అనంతపురం: సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల ఐదో తేదీ తర్వాత కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు తేదీని ఖరారు చేయాలని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ఒక తేదీని ఖరారు చేయాలని ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో పెద్దారెడ్డి పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలను ఇస్తామని.. అది డిపాజిట్ చేయాలని తెలిపారు. దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి.. పోలీసుల సూచనలు పాటిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ కూటమి సర్కారు, ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హెరిటేజ్‌లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6 ‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు. యూరియా కూడా అందించలేకపోతున్నారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్‌లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా పడింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై 6న ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ తొలుత నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమాన్ని 9కి వాయిదా వేసినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.కాగా, యూరియా దారిమళ్లుతోందని ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై విజిలెన్స్ విభాగం స్పందించి వారం రోజులపాటు దాడులు నిర్వహించింది.దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. దాడుల్లో యూరియా పెద్దఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయినట్లు గుర్తించామని.. 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వా«దీనం చేసుకుని 191 కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు. టీడీపీ నేతలు దారి మళ్లించిన యూరియా, ఇతర ఎరువులు వివిధ జిల్లాల్లోని 598 ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నట్లు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. స్టాక్ రికార్డుల్లో లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్‌చేసి 67 కేసులు నమోదు చేశారు.మరోవైపు.. అక్రమంగా నిల్వ ఉంచిన మరో రూ.4.30 కోట్ల విలువైన 1,911 టన్నుల ఎరువులనూ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 124 కేసులు నమోదుచేశారు. నిబంధనలు అతిక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న మరో ఎనిమిది దుకాణదారులపైనా క్రిమినల్ కేసులు నమోదుచేశారు. -
సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
ఆ ధైర్యం టీడీపీకి లేదు: వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు.. వైఎస్ జగన్‌కు వివరించారు. ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు అంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని దౌర్జన్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా:: వైఎస్ జగన్ -
దెందులూరులో టీడీపీ నేతల గూండా గిరి
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
‘చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్సార్’
విజయవాడ: చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ కొనియాడారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన పాలనను గుర్తుచేసుకున్నారు పోతిన మహేష్. ‘ ప్రతీ కుటంబం వైఎస్సార్ వల్ల లబ్ధి పొందారు. పేద , సామాన్య వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ తెచ్చారు. రైతులకు కోసం ఉచిత కరెంట్ ఇచ్చారు. పోలవరంతో పాటు ఎన్నో బహుళార్ధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొందరు వైఎస్సార్‌కు మేమే పోటీ అంటున్నారు. వైఎస్సార్ గురించి మాట్లాడే వారు ఎందులో ఆయనకు పోటీనో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ .జగన్ పుణికిపుచ్చుకున్నారు. అమ్మ ఒడి తెచ్చింది వైఎస్ జగన్. పోర్టులు తెచ్చినా ...మెడికల్ కాలేజీలు కట్టినా అది వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
బాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా?: వైఎస్ జగన్
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక, అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను ప్రొత్సహిస్తోంది. కానీ, మా హయాంలో ఏనాడూ ఎరువులు బ్లాక్‌లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ క్వింటా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. ఉల్లికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ రూ.4 నుంచి రూ.12 వేలు క్వింటాల్ అమ్ముడుపోయింది. నేడు రైతుకు క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి కనీసం రూ.800 లకు కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ బాగలేకపోతే క్వింటా రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2500 చొప్పున ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు కానీ, రైతుబజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరటేజ్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. ఇదే రైతుకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి, చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35 కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి, ఇదీ ప్రభుత్వ పరిస్థితి. అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కనీసం రూ.3వేలకు కూడా కోసే వారు కనిపించడం లేదు. గత వైయస్ఆర్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30వేలకు రైతులు అమ్ముకున్నారు.యూరియా కూడా అందించలేకపోతున్నారువైయస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో అమ్ముకునే పరిస్థితి లేదని.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని.. తద్వారా కమీషన్లు, బ్లాక్ లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా హయాంలో రూ.265 రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది. తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు రైతుకలు అందుబాటులో ఉండి పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వీరి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు రావని, బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంటచూసినా రేటు లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయం చూస్తే, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్ళకు ఇరవై వేల చొప్పున రూ.40 వేలు ఇవ్వాల్సి వున్నా ఇంత వరకు ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు’’ అని జగన్ మండిపడ్డారు. -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్‌లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్‌ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్‌ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్‌ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్‌ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్‌లు, ఛార్జ్‌షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్‌లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్‌చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్‌ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్‌ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్‌టాప్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ధైర్యంగా ఉండండి... అండగా నిలుస్తా: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, సమస్యలను ప్రజలు వివరించారు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ‘నేనున్నాను...’ అంటూ భరోసా ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని నింపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి వెన్నుదన్నుగా ఉంటానని మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ... ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగనమండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ కీడు చేయకూడదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని ఆయన గుర్తుచేశారు.కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘వెన్నుపోటుదారుడిని మహా నాయకుడిగా చెప్పుకోవడం సిగ్గుచేటు’
తాడేపల్లి : టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబని, వ్యవస్థలను మేనేజ్‌చేసి సీఎం అయిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. అధికార కూటమి కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని, రాజ్యాంగ బద్ధంగా ప్రజల సమస్యలపై చర్చించే టైమ్ ఇవ్వమని అడుగుతున్నా చంద్రబాబు చలించడం లేదన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.‘కాంగ్రెస్ నుండి వచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. భార్యతో రికమెండేషన్ చేయించుకుని టీడీపీలో చేరిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలు గెలిపించుకున్న ఎన్టీఆర్‌ని కుట్రతో పదవి నుండి తొలగించిన రోజు ఇది. అక్రమంగా పదవి పొందిన చంద్రబాబు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎలా పండుగ చేసుకుంటున్నారు?, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి రోజును పండుగ చేసుకోవాలంటున్న చంద్రబాబుకు మానవత్వం ఉందా?, అనాటి ఘోరం ఈనాటి తరానికి తెలియక పోవచ్చు. గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేల బలం చూపించకుండానే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. వెన్నుపోటుదారుడిని మహా నాయకుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు?, కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ దగ్గరకు కుట్రతోనే చేరారు. ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోజు చంద్రబాబుకు మద్దతు లేదుఆ తర్వాత మరిన్ని కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఏం జరిగిందో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయట పెట్టాలి. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని ఎన్టీఆర్ పదేపదే కోరినా స్పీకర్ యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని స్త్రీ లోలుడుగా ఎల్లోమీడియా చిత్రీకరించింది. కుటుంబ సభ్యులు కనీసం భోజనం కూడా పెట్టలేదు. సంప్రదాయాల ప్రకారమే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్వనాశనం చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టే ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉండనిచ్చారుదేశ చరిత్రలో వెన్నుపోటు అనే పేటెంట్ చంద్రబాబుకే ఉంది. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇచ్చిన హామీలను అమలు చేయాలేనప్పుడు ఎందుకు ఇచ్చారు?, చంద్రబాబు అంటేనే ఫేక్ ఫేక్. రాజధాని రైతుల కడుపు కొట్టిన వ్యక్తి చంద్రబాబు. హైవే మీద నుండి రాజధానికి వెళ్లటానికి ఇప్పటికీ రోడ్డు లేదు ఎవరిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారు. తనలాగే తనకు కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమోనని చంద్రబాబు భయపడిపోతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే సూపర్ సిక్స్ సహా అనేక హామీల గురించి ప్రశ్నిస్తారని చంద్రబాబుకు భయం’ అని విమర్శించారు. -
మంత్రి టీజీ భరత్‌కు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు నిరసన సెగ తగిలింది. ఉల్లికి గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉల్లికి కనీసం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని వాపోయారు. అంతా అయిపోయిన తరువాత ధర పెంచితే ప్రయోజనం ఏముంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే, టీజీ భరత్ మాత్రం రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. -
సంబరాల బాబూ.. బుడమేరు ప్రక్షాళన ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సంబరాలు దేనికి చంద్రబాబూ..? చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..? వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్‌లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.విజయవాడను గాలికొదిలేశారు:పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. -
సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన
కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన. ● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులునిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ ను 21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది. మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకింత ప్రేమ ?● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక.. నిబంధనలు పాటించని క్యాంటీన్‌ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు. ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. -
రెచ్చిపోయి కొట్టుకున్న టీడీపీ జనసేన శ్రేణులు
సాక్షి, అన్నమయ్య: గణేష్ నిమజ్జనం సాక్షిగా.. కూటమి పార్టీల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలతో పలువురు ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. పీలేరులో గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. ఈ క్రమంలో జనసేన వర్గాలతో వాగ్వాదానికి దిగారు. అది ముదిరి రోడ్డునపడి కొట్టుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కూటమి పార్టీల మధ్య పీలేరుతో ఇలాంటి ఘర్షణలు కొత్తేం కాదు. తాజా ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి! -
దేవుడి ముందూ రాజకీయమేనా బాబు!
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్‌ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్‌పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్‌ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్‌తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్‌ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్‌లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.అదే టైమ్‌లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్‌కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్‌లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.. -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ: పేర్ని నాని సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదు’ అంటూ విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్‌పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం. మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో GVMCలో స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం చేయించారు.విశాఖ ఉక్కు ప్రజల అందరి హక్కు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్లాంట్‌పై కూటమి నేతల దొంగ బుద్ధి బయట పడింది. ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మొదటి నుంచి వైఎస్ జగన్‌ది ఒకే మాట.. ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారు.పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినాలని మాట్లాడారు. ఈ రోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు. ఎవరు తినాలి ఉప్పు కారం.. అది పవనే చెప్పాలి. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధాన మంత్రితో మాట్లాడలేదు. వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోదీని కోరారు’ అని గుర్తు చేశారు. -
ఒంటరి పోటీతో ఎలా ఉండేదో!.. చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు!
అల్లిపురం/జగదాంబ(విశాఖ): ఒంటరి పోటీతో జనసేనకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవన్న విషయం ఎప్పుడూ చర్చనీయాంశమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీలు పెట్టి, రాజకీయ వ్యూహం లేకపోవడం వల్ల ఎంతో మంది వెళ్లిపోయారని అన్నారు. అందుకే కేవలం ‘ఐడియాలజీ’పై మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహంతో గత ఎన్నికల్లో కలిసి జట్టుగా పోటీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ‘విడిగా వెళితే వచ్చి ఉండేదో.. రాదో..’ అని ఈ సందర్భంగా అన్నారు.రానున్న రోజుల్లో సినిమాలూ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల అనంతరం శనివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తాం. ఏదో ఒక రోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి సుస్థిరంగా ఉండాలి. జనసేన వల్లే విశాఖ స్టీలు ప్రైవేటుపరం కాకుండా ఆగింది’ అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చిరంజీవిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు! కాగా, ‘పార్టీలు పెట్టి సరైన రాజకీయ వ్యూహం లేక వెళ్లిపోయారు’ అంటూ పరోక్షంగా అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించే ఆయన మాట్లాడరనే గుసగుసలు సమావేశంలోనే కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. దీంతో, పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
క్రెడిట్ కొట్టేయగల సమర్థుడు చంద్రబాబు: అంబటి
కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్ పొందేది మరొకరు. క్రెడిట్‌ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్ పేరిట సీఎం రమేష్ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు.. .. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్డ్యామ్లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే. చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్ తగిలే వరకు డయాఫ్రం వాల్ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు. -
జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్‌ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?.. -
జనసేనలో అసంతృప్తి.. కిందా మీదా పడ్డ పవన్ కల్యాణ్
విశాఖ సిటీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారని అధినేతనే నిలదీశారు. తమకు పదువులే కాదు.. కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు. వారిని సముదాయించడానికి పవన్ కల్యాణ్ కిందా మీదా పడాల్సి వచ్చింది. జనసేన ప్లీనరీ సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. ఇందులో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితులను, కష్టాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలం జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని నమ్మిన జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలని పిలుపునిచ్చారు. సినిమా అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం తన ఉద్దేశం కాదని, పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. కానీ జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జనసైనికులు, వీరమహిళలే అన్నారు. కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కూటమిలో విలువ లేదు.. కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని, తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని, గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, దీని నుంచి బయట పడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పారీ్టపై కూడా పడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలకు అధినేత పవన్ సరి్ధచెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. -
‘కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. -
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్‌లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్‌లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్‌లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత