
కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..
సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్ పొందేది మరొకరు. క్రెడిట్‌ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్ పేరిట సీఎం రమేష్ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు..
.. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్‌డ్యామ్‌లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే.

చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్ తగిలే వరకు డయాఫ్రం వాల్ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు.