
విజయవాడ: చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ కొనియాడారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన పాలనను గుర్తుచేసుకున్నారు పోతిన మహేష్. ‘ ప్రతీ కుటంబం వైఎస్సార్ వల్ల లబ్ధి పొందారు. పేద , సామాన్య వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ తెచ్చారు. రైతులకు కోసం ఉచిత కరెంట్ ఇచ్చారు. పోలవరంతో పాటు ఎన్నో బహుళార్ధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
కొందరు వైఎస్సార్‌కు మేమే పోటీ అంటున్నారు. వైఎస్సార్ గురించి మాట్లాడే వారు ఎందులో ఆయనకు పోటీనో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ .జగన్ పుణికిపుచ్చుకున్నారు. అమ్మ ఒడి తెచ్చింది వైఎస్ జగన్. పోర్టులు తెచ్చినా ...మెడికల్ కాలేజీలు కట్టినా అది వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు.