
సాక్షి, అన్నమయ్య: గణేష్ నిమజ్జనం సాక్షిగా.. కూటమి పార్టీల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలతో పలువురు ఆస్పత్రి పాలైనట్లు సమాచారం.

పీలేరులో గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. ఈ క్రమంలో జనసేన వర్గాలతో వాగ్వాదానికి దిగారు. అది ముదిరి రోడ్డునపడి కొట్టుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కూటమి పార్టీల మధ్య పీలేరుతో ఇలాంటి ఘర్షణలు కొత్తేం కాదు. తాజా ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి!