
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.

క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.

