6న జరగాల్సిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమం 9కి వాయిదా | Ysrcp Program Scheduled For September 6th Postponed To 9th | Sakshi
Sakshi News home page

6న జరగాల్సిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమం 9కి వాయిదా

Sep 2 2025 8:53 PM | Updated on Sep 2 2025 9:40 PM

Ysrcp Program Scheduled For September 6th Postponed To 9th

సాక్షి, తాడేపల్లి: ఈ నెల 6న జరగాల్సిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమం 9కి వాయిదా పడింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై 6న ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ తొలుత నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమాన్ని 9కి వాయిదా వేసినట్టు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

కాగా, యూరియా దారిమళ్లుతోందని ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై విజిలెన్స్‌ విభాగం స్పందించి వారం రోజులపాటు దాడులు నిర్వహించింది.

దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. దాడుల్లో యూరియా పెద్దఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయినట్లు గుర్తించామని.. 2,845 మెట్రిక్‌ టన్నుల ఎరువులు స్వా«దీనం చేసుకుని 191 కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు.  టీడీపీ నేతలు దారి మళ్లించిన యూరియా, ఇతర ఎరువులు వివిధ జిల్లాల్లోని 598 ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నట్లు విజిలెన్స్‌ బృందాలు గుర్తించాయి. స్టాక్‌ రికార్డుల్లో లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌చేసి 67 కేసులు నమోదు చేశా­రు.

మరోవైపు.. అక్రమంగా నిల్వ ఉంచిన మరో రూ.­4.30 కోట్ల విలువైన 1,911 టన్నుల ఎరువులనూ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 124 కేసులు నమోదుచేశారు. నిబంధనలు అతిక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న మరో ఎనిమిది దుకాణదారులపైనా క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement