
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్‌రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్‌రెడ్డితో వైఎస్సార్‌సీపీ నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మిధున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది.కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు.ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించనంత వరకూ వ్యక్తిగానే చూడాలి.వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం.చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే ప్రత్యర్ధులకు కోపం ఉంటుంది. చార్జిషీటు వేయనివ్వడం లేదని మండిపడ్డారు.
