
సాక్షి, విజయనగరం: జనసేన కేడర్‌ను ఉద్దేశించి పార్టీ మహిళా నాయకురాలు రెచ్చిపోయారు. తమ పార్టీకి చెందిన జనసైనికులను దారుణంగా అవమానించారు. వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారు అంటూ తిట్టిన తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన నాయకురాలు పాలవలస యశస్వని ఆగ్రహంతో ఊగిపోయారు. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లోకేడర్, లేబరోళ్లు సంభోదించారు. అసలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలను అడిగి మరీ తన ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టించుకోవాల్సిన దుస్థితిలో పార్టీలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తనను పట్టించుకోవడం లేదన్నారు. కొందరు గోడ మీద పిల్లుల్లగా ఉన్నారు. ఇదే సమయంలో పదవులు వచ్చిన వాళ్లు ఒకలా.. పదవులు లేని వాళ్లు ఒకలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విజయనగరం వాళ్ళు వేరే గ్రహం నుండి వచ్చారు. వీళ్లంతా అదో రకం అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక, ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతిన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.