breaking news
vizaianagaram
-
వైఎస్ జగన్ ప్రశ్నించడంతో.. కళ్లు తెరిచిన ప్రభుత్వం
-
మహిళతో వివాహేతర సంబంధం.. చిన్నారిపై పైశాచికం..
సాక్షి, విజయనగరం క్రైమ్: ఓ యువకుడు రెండు సంత్సరాల నాలుగునెలల పాపపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బుగ్గలు, తొడల భాగంలో గోళ్లతో రక్కేశాడు. చిన్నారి ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పైశాచిక అనందం పొందాడు. దిశ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. దిశ డీఎస్పీ టి.త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్తను వదిలేసి చంటి బిడ్డతో ఉన్న మహిళతో నెల్లిమర్లలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న త్రినాథ్ (చిన్న)కు ఏడు నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ మహిళతో కలిసి కొత్తపేట సాలివీధిలో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. బుధవారం రాత్రి చిన్నారిని త్రినాథ్‌వద్ద విడిచిపెట్టి ఆమె ఓ శుభకార్యానికి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి శరీరంపై గోళ్లతో రక్కి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంటికి వచ్చిన తల్లి బిడ్డను చూసి నివ్వెర పోయింది. దిశ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే పరారైన నిందితుడిని గాలించి పట్టుకున్నారు. చిన్నారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! -
కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత
విజయనగరం: మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం వారు కలెక్టరేట్ ముట్టడి చేశారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టరేట్ ముట్టడిలో ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కూడా కలిసి రావడంతో భారీ సంఖ్యలో నిరసన కారులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది.