breaking news
-
‘ చంద్రబాబు.. మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు’
తాడేపల్లి : ఏపీఎండీసీ తన ఖనిజ సంపదను మరోసారి తాకట్టుపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేందరనాథ్రెడ్డి స్సష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు(మంగళవారం, జూన్ 24వ తేదీ) రూ. 5,500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయానని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపైపై బుగ్గన ధ్వజమెత్తారు. ‘ఆస్తులనుగానీ, మద్యం ఆదాయాన్నిగానీ తాకట్టు పెట్టటం లేదని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి?, అప్పు చెల్లించకపోతే నేరుగా రాష్ట్ర ఖజానా నుండే తీసుకునేలా అప్పుల వారికి అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. లక్షా 91 వేల కోట్ల విలువైన 436 గనులను యధేచ్చగా తాకట్టు పెట్టేశారు. ప్రయివేటు పార్టీకి వెసులుబాటు కల్పించడం దారుణం. మా హయాంలో అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక, వెనుజుల అవుతోందంటూ విష ప్రచారం చేశారు. మా హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు హయాంలో 27% అప్పులు చేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడిన వారంతా ఇప్పుడు ఏమయ్యారు?, చేసిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?, పోలవరం నిర్మాణానికి వచ్చిన రూ. 5,052 కోట్లు ఏం చేశారు?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. పర్యావరణ అనుమతులు సహా అనేక క్లియరెన్సులు వారే తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలలో రివేంజులు కాదు, రియలైజేషన్ ఉండాలి. అంతేకానీ ప్రతిరోజూ అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్లటం సరికాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు అప్పులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదు?, రాజధాని నిర్మాణానికి అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాల సేకరణ చేశారు. కానీ ఆయన రిపోర్టును పక్కనపెట్టి 1500 ఎకరాల్లో రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత 35 వేల ఎకరాలను సేకరించారు. అసలు రాజధాని కట్టాలనుకుంటున్నారా? నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారా?, పచ్చని పొలాలను పాడు చేస్తున్నారు’ అని బుగ్గన మండిపడ్డారు. -
ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు?. లోకేష్‌కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్‌తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్ఆర్సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. -
మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్’ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఏమన్నారంటే.. చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్‌కళ్యాణ్‌గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్ రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్ ఇది.మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్‌కు సంబంధించిన రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత.. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్ పార్టీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. ⇒ మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ⇒ జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. ⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?⇒ ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్‌మీట్ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు.. వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం! -
సుపరిపాలన సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీదే అధికారం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు సజ్జల. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం కావడమే కాదు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమయ్యేలే చేశారని సజ్జల విమర్శించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన 'పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం, పంచాయతీరాజ్ విభాగంను బలోపేతం చేయాలని జగన్ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్లో బలంగా ఉండాలి.కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం.ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్సార్సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దాం’ అని సజ్జల సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం..మన పంచాయతీ రాజ్ విభాగం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ‘ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’ అని పిలుపునిచ్చారు. -
‘ ఎస్పీ ముందు ఒకటి చెప్పి.. తర్వాత మాట మార్చారు’
విశాఖ : సింగయ్య మృతిపై టీడీపీ, ఎల్లో మీడియా అనవరసర రాద్దాంత సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ.. ఆపై మాట మార్చారన్నారు. ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జిమ్మిక్కులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఈరోజు( సోమవారం,. జూన్ 23) విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించిన బొత్స.. కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ‘రెంటచింతలకు వైఎస్ జగన్ వెళ్ళినప్పుడు భారీగా అభిమానులు తరలి వచ్చారు.. సత్తెనపల్లి జగన్ వెళ్ళినప్పుడు పోలీసుల వైఫల్యం కనిపించింది.. పోలీసులు మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కల్పించలేదు. పోలీసులు ముందు ఒకమాట.. తరువాత మరో మాట మాట్లాడారు. ఎల్లో మీడియాలో కధనాలు వచ్చాక పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో దిక్కుమాలిన, దిగజారిన పాలన సాగుతుంది. సింగయ్యను కాన్వాయ్ వాహనం ఢీ కొట్టలేదని ఎస్పీ చెప్పారు..మళ్ళీ ఆయన మాట మార్చారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి.. పాలన దిగజారిపోయింది. గాయలతో ఉన్న సింగయ్యను ప్రైవేటు వాహనంలో తరలిద్దాం అంటే 108 లోనే పంపిద్దాం అని పోలీసులు చెప్పిన మాట వాస్తవం కాదా?, పాలన వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున జగన్ పర్యటనలకు ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ సహా ఇతర పక్షాలు మూడేళ్లు కనపడలేదు. గురివింద గింజలా ఉంది మంత్రుల శైలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బాబు, పవన్ లకు ఎప్పుడైనా భద్రతా ఇబ్బందులు ఉన్నాయా..?, ఇది ప్రజాస్వామ్యం ఎవరి సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ప్రభుత్వ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. జగన్ వాహనం దగ్గర ఉండాల్సిన రోప్ పార్టీ ఎక్కడ ఉంది. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదునిజంగా ఘటన జరిగితే మీ పోలీసు వ్యవస్థ ఎక్కడుంది.. జగన్ పర్యటనలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంతో రాద్దాంతం చేస్తుంది. సింగయ్య మరణం మమ్మల్ని చాలా బాధించింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా చనిపోయిన కార్యకర్తలను ఏనాడైనా ఆధుకున్నారా..?, ప్రభుత్వం వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. సత్యసీలుల్లా మాట్లాడుతున్న మంత్రులు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది..చంద్రబాబు తాబెదారులకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఆడ బిడ్డ నిధి ఎక్కడిచ్చారు..?, P4 కాన్సెప్ట్ ఏమిటి..?, P4 వలన ఒరిగింది ఏమిటి..? సమాధానం చెప్పాలి. చంద్రబాబుని ఎప్పుడు గెలిపించినా మోసం, ధగా తప్పదు. యోగా డే కోసం ఇంత ఖర్చు అవసరమా..?, యోగా డే వలన ఏమిటి..?విశాఖకు ఏం మంచి జరిగింది..?, మనకు జరిగిన ప్రయోజనం ఏంటి..? సమాధానం చెప్పాలి. ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ ప్రాంతానికి ఏదో మేలు జరగాలి. ఋషికొండ భవనాలను ఒక మాన్యుమెంట్ లా తయారు చేసాం. ఋషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే బిల్స్ ఎందుకు ఇచ్చారు.. యోగా డే వైఫల్యం కావడంతో సింగయ్య మరణంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. సింగయ్య మరణం బాధాకరం.. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. పల్నాడు లాటీ ఛార్జ్ ఎందుకు చేశారు. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?, ప్రభుత్వాన్ని ఇలాగే నడుపుతారా?, చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మీరెవరు ప్రశ్నించడానికి అని బాబు అడుగుతున్నాడు. ప్రభుత్వ మెడలు వంచి తల్లికి వందనం ఇప్పించాం. మేం మాట్లాడకపోతే మరో మూడేళ్లు ప్రజలకు పథకాలు వచ్చేవి కాదు. మేం ప్రజల తరఫున పోరాడటానికే ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతాం. బలహీన వర్గాల తరఫున పోరాడుతాం. బాబు మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు.. ఎవడి తాట తీస్తావ్. భూ స్థాపితం చేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు.. ఏంటి ఆ మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడి సీఎం కుర్చీ స్థాయిని దిగజార్చద్దు’ అని బొత్స హెచ్చరించారు. -
‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు రోజా. అదే సమయంలో ఈవీఎం ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ‘కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు. ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్నారు హోం మంత్రి, గోడ కూలి భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్‌లకు ప్రజలు రావడం లేదు. జగనన్న మీటింగ్‌లకు పొలాల్లోంచి పరుగులు పెడుతూ జనం వస్తున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్‌లో ముందు, వెనుక వీడియా విడుదల చేయాలి. జగనన్న ప్రజల మనిషి. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు’ అని ఆర్కే రోజా మండిపడ్డారు. -
సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్. మరి జడ్‌ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్‌మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025 -
‘సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే.. బాబుపై కేసు నమోదు చేస్తారా?’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. అధికార పార్టీకి పోలీసులు ఊడిగం చేయడం బాధాకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదు చేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అసలు వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం .జరిగితే.. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు రామకృష్ణ. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న చంద్రబాబు.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారని నిలదీశారు. ఓ వైపు అప్పులు చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాలకు డబ్బు లేదంటున్నారని చంద్రబాబు పాలనా తీరుపై మండిపడ్డారు రామకృష్ణ.. చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం.. సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ -
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్‌కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’
సాక్షి, చిత్తూరు జిల్లా: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కాయలు కిలో 2,3 రూపాయలు ధరలు ఉంటే రైతులు ఎలా బతకాలి? చంద్రబాబు చెప్పేటివి బూటకపు మాటలు’’ అంటూ మండిపడ్డారు.‘‘ఎన్నిసార్లు చంద్రబాబు సీఎం అయిన రైతులను పట్టించుకున్నది లేదు. వ్యవసాయం దండగ అని స్వయనా ఒక సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి?. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలవాల్సిందిపోయి అందరి రైతుల ఉసురుతీస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ జగన్ వెళ్తుంటే.. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురిచేస్తోంది. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు ఈ ప్రభుత్వంలో సెలవులో ఉండాల్సిందే. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. -
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
సాక్షి, గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించారు. అయినా వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. -
సింగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు: అంబటి
సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్‌రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్ పర్యటన కోసం సింగయ్యతో పాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు.పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది.వైఎస్ జగన్‌ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యంరాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న సంఘటన జరిగినా దానిని చిలువలు వలవులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు.'జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ఈ రెండు పత్రికలు ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు ఆయన ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది.చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారువైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. -
అక్రమ కేసులకు భయపడం.. పోరాడతాం: గజ్జల సుధీర్ భార్గవరెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పల్నాడు పర్యటన విజయవంతం కావడం తట్టుకోలేకపోతోందని.. అందుకే అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు పట్టుకున్న రవితేజ టీడీపీ కార్యకర్త.. అతన్ని హింసించి నా ప్రమేయం ఉన్నట్టుగా అక్రమ కేసు పెడుతున్నారు’’ అని భార్గవరెడ్డి ధ్వజమెత్తారు.‘‘నాకు షార్ట్ కట్ రాజకీయాలు తెలియవు. జనానికి సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చా. కానీ నన్ను అణచివేయాలని చూస్తున్నారు. ఆ రోజు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టి అందరినీ బెదిరించారు. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించినా జనం తరలి వచ్చారు. సత్తెనపల్లి చుట్టూ 25 చెక్ పోస్టులు పెట్టారు. జనాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రవితేజ ఆ ప్లకార్డు పట్టుకోవటం వెనుక టీడీపీ కుట్ర ఉంది.’’ అని సుధీర్ భార్గవ్‌రెడ్డి చెప్పారు.‘‘రవితేజ, అతని కుటుంబం టీడీపీ కార్యకర్తలే. రవితేజని 18వ తేదీ రాత్రే అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసు స్టేషను ఎదుట అతని భార్యే చెప్పింది. కానీ నిన్న అరెస్టు చేసినట్టు అతనితో బలవంతంగా చెప్పించారు. అతన్ని రెండు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. రవితేజతో నా పేరు చెప్పించి నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. అక్రమ కేసులను ఎదుర్కొంటాం. న్యాయ పోరాటం చేస్తాం’’ అని భార్గవ్‌రెడ్డి పేర్కొన్నారు. -
మరో నాలుగేళ్లు రైతులకు ఇబ్బందులు తప్పవు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు.వైఎస్ జగన్ పాలనలో మామిడి రైతులకు మేలు జరిగింది. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి రూ.25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలుపైనే అమ్మకం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో కిలో మూడు రూపాయలకు అమ్మకం చేద్దామన్న కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఈరోజు రైతులకు ఏవిధం మేలు చేస్తాడు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు ఈ పాలనలో ఇబ్బందులు తప్పవు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం: మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మామిడి, పాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో రూ.3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4-5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తాం’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్‌స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. 👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు. -
‘కూటమి పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
తాడేపల్లి: టీడీపీ కూటమి పాలనలో స్థానిక సంస్థలు, ముఖ్యంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఏ నిధులూ లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్థితిలో అవి లేవని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు నీరు–చెట్టు, ఫాం పాండ్స్ నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని, చేయని పనులకు టీడీపీ నాయకులు బిల్లులు డ్రా చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడిన వెన్నపూస రవీంద్రారెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో వెన్నపూస రవీంద్రారెడ్డి ఏం మాట్లాడారంటే..:అంతులేని అవినీతిఅధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన కూటమి పెద్దలు, ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుతో పనులు చేయకుండా, వాటిని ఎంబుక్ (మెజర్మెంట్ బుక్)లో నమోదు చేయకుండానే బిల్లులు పొందాలని చూశారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆ పనులపై విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ నీరు–చెట్టు పేరుతో ప్రజా ధనం దోపిడీకి వ్యూహ రచన చేస్తున్నారు. అగ్రిమెంట్లు జరగకుండా, ఎంబుక్‌లో నమోదు కాకుండానే చేయని పనులకు వేల కోట్ల ప్రజా ధనాన్ని టీడీపీ నాయకుల జేబుల్లోకి సీఎం చంద్రబాబు మళ్లిస్తున్నారు. అందుకే ఏడాది కాలంగా నీరు–చెట్టు పేరుతో ఎంత డ్రా చేశారో ప్రజలకు వివరించాలి.నానా హడావిడి. ఇచ్చింది శూన్యంపల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావుడి చేసి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.400 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు విడుదల చేస్తే గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యవర్గాలకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారి మళ్లించారు. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్ సమాధానం చెప్పాలి. ప్రజలు కట్టే పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ దారి మళ్లిస్తుంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎలా పాలన సాగిస్తారు?. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, శానిటేషన్, విద్యుత్, ఇతర మరమ్మతులు చేయడానికి చిల్లిగవ్వ లేకుండా మొత్తం దారి మళ్లించి ఊడ్చేశారు.దొంగ మస్టర్లతో ఉపాధి నిధులు డ్రావేలాది కుటుంబాలు వలస వెళ్లకుండా స్ధానికంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘మనరేగా’ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా«ధి హామీ పథకం–ఎన్ఆర్ఈజీఎస్) తీసుకొస్తే ఆ నిధులను కూడా టీడీపీ నాయకులు డైవర్ట్ చేస్తున్నారు. తమ సొంత లేఅవుట్లకు రోడ్లు వేసుకోవడానికి ఆ నిధులు వినియోగిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేట్ పోస్టులను కూడా రూ.5 లక్షలకు అమ్ముకునే దుస్థితికి వ్యవస్థను దిగజార్చారు. మూడు మస్టర్లలో ఒకే ఫొటోతో 30 మందికి సంబంధించిన ఉపాధి హామీ నిధులను కాజేశారు.(అంటూ ప్రెస్మీట్లో ఫోటోలు ప్రదర్శించారు)అలా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సిన రూ.305 కూలీని ఇష్టారాజ్యంగా తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు ఉపాధి కల్పించకుండా దొంగ జాబ్ కార్డులు సృష్టించి దొంగ సంతకాలతో నిధులు ఇష్టారీతిన దారి మళ్లిస్తున్నారు. కొన్నింట్లో ఫొటోలు కూడా అప్లోడ్ చేయకుండానే నిధులు డ్రా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోంది.దోపిడీ కోసమే ఫాం పాండ్స్ నిర్మాణం1.55 లక్షల ఫాం పాండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో మరో అవినీతికి తెర తీశారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలానికి చెందిన ఒక ఒంటరి మహిళ పేరుతో ఆమెకు సంబంధం లేకుండానే ఫాం పాండ్ కేటాయించడమే కాకుండా ఫాంపాండ్ తవ్వినట్టు చూపించి నిధులు కూడా డ్రా చేసినట్టు వివరాలు వెబ్సైట్లో నమోదై ఉన్నాయి. ఈ విషయం తెలిసిన సదరు మహిళ ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అవినీతి చేయడం కోసమే ఈ ఫాం పాండ్ నిర్మాణం అనే కాన్సెప్టుకి తెరదీశారని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏడాది కాలంగా ఎంపీటీసీలకు ఒక్కరికి కూడా రూపాయి గౌరవ వేతనం ఇచ్చిన పాపాన పోలేదు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారు. దీనికి ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలి.సర్పంచ్ తల్లులకు తల్లికి వందనం కట్సర్పంచ్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి రాష్ట్రంలో సర్పంచ్‌లుగా ఉన్న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేయలేదు. ప్రజలతో ఎన్నుకోబడి ఐదేళ్లు ఉండే సర్పంచ్‌లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ నిర్ణయంపై పునఃపరిశీలన చేసి సర్పంచ్ కుటుంబాల్లో తల్లుల ఖాతాల్ల తల్లికి వందనం డబ్బులు జమ చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ కుటుంబాలను ఆదుకోవాలి. అసలు తల్లికి వందనం పథకం అమలు జరిగిందంటే వైయస్ జగన్ పోరాట ఫలితమే.అగమ్య గోచరంగా పంచాయతీ సెక్రటరీలుపాత, కొత్త పంచాయతీ సెక్రటరీలను ఏకం చేయాలన్న లక్ష్యంతో జీవో ఎంస్ నెం:11 తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఒక విఫల ప్రయోగం చేసింది. దీని కారణంగా దాదాపు 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వారి పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేసింది. దాదాపు వారికి 9 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. 23న పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ విస్తృత సమావేశంప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ సమావేశం ఈరోజు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించాం. ఉపాధి హామీ పనులు, డైవర్ట్ చేసిన నిధులు, పంచాయతీ సెక్రటరీల సమస్యలపై అందులో చర్చించాం. దీనిపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 23న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందాం. వైఎస్సార్ సీపీ నేతలు టీడీపీలో చేరితే సరి లేదంటే కక్ష సాధింపు చర్యలు తప్పవు. నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను మాత్రం ఊరుకోను.. అందరి సంగతి తేలుస్తా. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తా... ప్రతిపక్ష పార్టీ నేతల తోకలు కత్తిరిస్తా’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రజలకు.. ‘వైఎస్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్ జగన్ రెంట పాళ్ల పర్యటనపై విడుదల రజిని శుక్రవారం మీడియా మాట్లాడారు.పల్నాడుజిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా మాజీ సీఎం ఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు. ఆయన పార్టీలోని మరో నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైఎస్ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.ప్రజాధరణకు పల్నాడు పర్యటనే సాక్ష్యంపల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ చెందిన నాయకుడు నాగమల్లేశ్వరరావును పోలీసుల ద్వారా తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి, ఆయన పర్యాటనను విఫలం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ పర్యటనకు వాహనాలను అందించకూడదని ట్రావెల్ ఏజెన్సీలను బెదిరించారు, పెట్రోల్ బంక్‌లు, హోటళ్ళను బలవంతంగా మూసివేయించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. వైఎస్ జగన్‌కు అడుగుడుగునా స్వాగతం పలుకుతూ రోడ్లపై పోటెత్తారు. వైఎస్ జగన్ అంటేనే దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వ మోసాన్ని గుర్తించామంటూ వైఎస్ జగన్‌కు ప్రజలు తమ మద్దతును ప్రకటించారు.చనిపోయిన వారిపైనా రాజకీయమా?వైఎస్ జగన్ పర్యటనలో దురదృష్టవశాత్తు ఇరువురు చనిపోతే, దానిని కూడా వివాదంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. వైఎస్ జగన్ కాన్వాయి వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఒక యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతడిని ఆసుపత్రికి తరలించే సరికే అతడు చనిపోయాడు. ఈ ఘటనలు గురించి తెలియగానే వైఎస్ఆర్సీపీ నేతలు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంను అందచేయడం కూడా జరిగింది. ఆ కుటుంబాల పట్ల మా బాధ్యతను ఎక్కడా మరిచిపోలేదు. చివరికి వారి అంత్యక్రియల్లో కూడా పార్టీ నేతలు ఎంతో బాధతో పాల్గొని, ఆ కుటుంబాలను ఓదార్చడం జరిగింది. అమాయకుల ప్రాణాలను బలికొన్నది చంద్రబాబు కాదా?చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి, గోదావరి పుష్కరాల సందర్బంగా తన ప్రచారయావతో 29 మందిని బలితీసుకున్నారు. ఇరుకుసందుల్లో సభలను పెట్టి, జనాలను ఎక్కువగా చూపాలనే ప్రయత్నంలో భాగంగా కందుకూరిలో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాగే గుంటూరులో టీడీపీ తరుఫున చీరెల పంపిణీ పేరుతో మహిళలకు ఆశచూపి, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు అసమర్థ పాలనలో తిరుపతి క్యూలెన్లలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరి కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ మరణాలు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు కావా? తన వల్ల జరిగిన దారుణాలను చంద్రబాబు మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు. -
‘బుచ్చయ్య.. వయసుకు తగ్గ మాటలు మాట్లాడయ్యా’
సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మాజీ మంత్రి సాకే శైలజానాధ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వయసుకు తగ్గట్లు మాట్లాడాలని హితువు పలికారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.బుచ్చయ్య చౌదరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.జగన్ తల నరికితే తప్పేంటి అంటారా..?. బుచ్చయ్య చౌదరి వయస్సు తగ్గట్లుగా నడుచుకోవాలి. 77 ఏళ్లు వచ్చినా ఇంకా ఏదో ఆశించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయం పడుతున్నారు. జగన్ పేరు వింటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్లకార్డులో పుష్ప సినిమా డైలాగులు రాసినా కేసు పెట్టారు. టీడీపీ కుట్రలకు వారి పార్టీ కార్యకర్త రవితేజ బలయ్యాడు.రవితేజ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యుడు. వాళ్ళ కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉన్నారు.రవితేజకు ఆ ప్లకార్డు ఇచ్చి పంపింది టీడీపీనే.దానికి టీడీపీ మంత్రి రామానాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.ఈ కుట్ర మొత్తం టీడీపీ ఆఫీస్‌లోనే జరిగింది. సినిమాలో డైలాగ్‌లను పట్టించుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. జగన్ పేరు వింటేనే టీడీపీకి భయం వేస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్‌కు రక్షణ లేదు. ప్రతిపక్షాన్ని.. జగన్‌ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడారు. మీ భాషను మీ వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. నారా లోకేష్ కడ్రాయర్లతో పరిగెత్తిస్తామన్నారు. డిప్యూటీ సీఎం ఊగిపోతూ అనేక మాటలు మాట్లాడారు. మీరు పరమార్శలకు వెళ్తే మేం వద్దన్నమా..?జగన్ పట్ల కుట్రలు జరుగుతున్నాయేమో అన్న అనుమానాలున్నాయి. అందులో భాగంగానే జగన్ భద్రతను కూడా తగ్గించారు. జగన్ లేకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లు కూడా ఉండరని భావిస్తున్నారా..?.కుప్పంలో అప్పు కట్టలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేస్తే.. ఐదు లక్షలు ఇచ్చి పాపం కడిగేసుకుంటారా?. ప్రకాశం జిల్లాలో మీ నేత వీరయ్య చౌదరిని హత్య చేసింది మీ వాళ్లు కాదా?.రాజకీయాల్లో హింసాత్మక ప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఓడినా.. మీరు ఎంత హేళన చేస్తున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒక్క జగన్ మాత్రమే. భూస్థాపితం చేస్తా అని చంద్రబాబు మాట్లాడితే తప్పులేదా..?’అని ప్రశ్నించారు. -
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
శ్రీసత్యసాయి జిల్లా: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబోమని చెబుతున్న పవన్‌కు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎంందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా? అని శ్యామల నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారని ప్రశ్నించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడంపై ‘డీసీఎం మిస్సింగ్’ అనే ఫ్లకార్డును ప్రదర్శించారు శ్యామల.టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైఎస్ జగన్ అని శ్యామల కొనియాడారు. -
వైఎస్ జగన్‌పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఏపీని రప్పా రప్పా రాజకీయం ఊపేస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా? నీ తల నరకొచ్చు కదా.. అంటూ జగన్‌ను ఉద్దేశించి ప్రెస్మీట్లో రెచ్చిపోయారాయన. ఇటీవలె ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు ఊగిపోయారు. ఇప్పుడు బాబు బాటలోనే బుచ్చయ్యచౌదరి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నిన్న ఏం అంటావు నువ్వు .... గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టే నరుకుతామని అంటే ..దానిలో తప్పు ఏముందని అంటున్నావు .. నేను అంటున్నా .. నీతల నరకొచ్చుగా!::ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరివైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంలో.. ఓ యువకుడు పుష్ప2 చిత్రంలోనే ఫేమస్ డైలాగ్‌తో వైఎస్ జగన్ ఫొటోను ఫ్లెక్సీగా ప్రదర్శించారు. అయితే అందులో డైలాగ్ అభ్యంతకరంగా ఉందంటూ పోలీసులు అతనిపై కేసు పెట్టారు. గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కొందరు పాత్రికేయులు ఈ విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు.అయితే ఆ ఫ్లెక్సీలో ఉన్న డైలాగును స్వయంగా విలేకరుల నోటి నుంచే జగన్ అడిగి తెలుసుకున్నారు. అంతేతప్ప .. ఆయన స్వయంగా ఏం ఆ డైలాగ్‌ను కొట్టలేదు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు, మేనరిజాలను పాటించే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ చంద్రబాబును నిలదీశారు. అంతేకాదు.. ఆ పోస్టర్ ప్రదర్శించింది స్వయానా టీడీపీ అభిమానినే అని ఆధారాలు సైతం ప్రదర్శించారాయన.అయితే జగన్ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను టీడీపీ ఘోరంగా వక్రీకరించింది. జగన్ నోటి నుంచి రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్ వచ్చిందంటూ గగ్గోలు పెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల.. మరికొందరు నేతలు వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ నరుకుడు డైలాగ్ కొట్టారంటూ జగన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. ఐటీడీపీ అండ్ కో తమ ఎడిటింగ్‌లకు పని చెప్పి సోషల్ మీడియాలోనూ జగన్ అనని ఆ డైలాగ్‌ను ఆపాదిస్తూ విషప్రచారాన్ని ఉధృతం చేసింది. -
కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వేద పారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు. వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు’’ అని భూమన ధ్వజమెతారు.‘‘శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి. ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు. ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలి. మన హిందూ జాతి మేల్కోవాలి. వేదాలను కాపాడుకోవాలి. నేను రాజకీయం చేయడం లేదు.. మన వేదాలను కాపాడుకోవాలి’’ అని భూమన పిలుపునిచ్చారు.‘‘ఏడు యజర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయి. శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయి. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామి వారి కోసం పారాయణం చేస్తారు. స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు. వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతోంది. టీటీడీ చాలా చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తుంది...వైఎస్సార్ వేద విశ్వ విద్యాలయాన్న నెలకొల్పారు. పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఆ అధికారి చదవాలి. వేద పారాయణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 700 పోస్టులు సృష్టించింది. మేం ఓడిన తర్వాత ఆ పోస్ట్‌లు ఏమయ్యాయో తెలియదు. వేదాలపై కామెంట్ ఆ అధికారి స్కంద పురాణం చదవాలి. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ అధికారి మాట్లాడుతారా అనే అనుమానం ఉంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.