
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పులివెందుల మండలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు అరాచకం సృష్టిస్తున్నారు. అచ్చివెల్లి, ఎర్రిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. టీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలింగ్ కేంద్రాల నుంచి నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లు.. టీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఓటర్లు అంటున్నారు.
పోలింగ్ బూత్‌ల్లో బయటి వ్యక్తులు ఉన్నారని ఓటర్లు చెబుతున్నారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా పోలీసులు లేరని ఓటర్లు అంటున్నారు. ఎక్కడికక్కడే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుపడుతున్నారు. గ్రామాల్లో పచ్చ మూకలు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎర్రిపల్లిలో పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలు.. పోలీసులను సైతం తరిమేస్తున్నారు. గ్రామంలో మహిళలపై కూడా దాడి చేస్తూ.. పచ్చమూకలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు.
