అరుదైన శునకం ..ఖరీదు రెండు లక్షలా? | Special Dog Costs Two Lakhs | Sakshi
Sakshi News home page

అరుదైన శునకం 

Jun 11 2019 9:18 AM | Updated on Jun 11 2019 11:21 AM

special dog - Sakshi

సాక్షి, అనంతపురం: కుక్క ధర లక్షలు పలుకుతోంది. ఇదెక్కడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.... మన అనంతపురంలోనే. అమెరికాలో కనిపించే మేలుజాతి శునకం ఇప్పుడు అనంతపురంలోనూ కనిపిస్తోంది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కుక్క ప్రస్తుతం యజమానికి కాసులను కురిపిస్తోంది. అమెరికాలో సెక్యూరిటీ కోసం బెల్జియం మెల్లాయిస్‌ జాతికి చెందిన శునకాన్ని అక్కడి పోలీసులు సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. దీంతో ముచ్చటపడ్డ ప్రణీత్‌ అరుదైన జాతి శునకాన్ని అనంతపురానికి తెచ్చేసుకున్నాడు.

అనంతపురంలో రెండో రోడ్డులో నివాసముంటున్న ప్రణీత్‌రెడ్డి బెల్జియం మెల్లాయిస్‌ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ శునకం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జాతి కుక్క ఒక్కొక్కటి రూ.3లక్షలు పలుకుతోందని, పిల్లలైతే రూ.2లక్షల దాకా ఉంటుందని ప్రణీత్‌రెడ్డి చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement