లాయర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం | Chandrababu Naidu got Angry on Lawyers protest | Sakshi
Sakshi News home page

లాయర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Feb 22 2018 8:30 PM | Updated on Aug 31 2018 8:40 PM

Chandrababu Naidu got Angry on Lawyers protest - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా  పెనుగొండలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో గందరగోళం జరిగింది. సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.... రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. లాయర్ల నినాదాలు హోరెత్తడంతో చంద్రబాబు ప్రసంగానికి ఆటంకం ఏర్పడింది. దీంతో లాయర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు లాక్కెళ్లారు.

కాగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళన చేస్తున్న పలువురు లాయర్లను ఇవాళ ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  అయితే చంద్రబాబు పర్యటన ఉందని తమను అదుపులోకి తీసుకోవడం దారుణమని న్యాయవాదులు మండిపడ్డారు. చంద్రబాబు కేంద్రం వద్ద మోకరిల్లి ఏపీ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని వారు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement